Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
2006 లో నాకు ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ వచ్చింది చాలా సీరియస్ అయిపోయింది. ఉన్నట్టుఉండి నేను పడిపోయాను, దుర్గాబాయి ఆసుపత్రి లో చేర్చారు.
నేను కోమాలో ఉన్నాను, నన్ను ఐ సి యూ లో ఉంచారు. నాకు బయట కిటికీలో నుంచి నాకు బాబా కనపడుతున్నాడు.
బాబా వచ్చాడు ఆయనకి ఏమైనా తినడానికి పెట్టండి అంటున్నాను. కానీ నా నోటి వెంట ఒకమాట కూడా రావట్లేదు.
బాబా నా రూంలోకి వచ్చి, నా మంచం మీద కూర్చొని నా తల నిమురుతూ, పరవాలేదు తగ్గిపోతుంది అన్నట్లుగా నిమిరేసి వెళ్లిపోయారు, అప్పటికి నేను కోమాలో ఉండబట్టి ఐదు రోజులు.
బాబా! రెహమ్ నాజర్ కారనా!! బచ్చోంక పాలన్ కారనా!” అంటూ పాడుతున్నాను”. పాట బయటకి వస్తుంది. మా వాళ్ళు అది విని డాక్టర్ ని పిలుచుకొని వచ్చారు.
ఆయన వచ్చి ఏంటి రవి గారు భజన చేస్తున్నారు? అన్నాడు . లేదు నేను బాబా పాట పాడుతున్నాను అన్నాను.
నన్ను వార్డ్ లోకి మార్చారు. కోమా లోనుండి బయటకు వచ్చాను. ఇరవై రోజులు హాస్పిటల్ లో ఉన్నాను.
నేను ఇంటికి రాగానే నేను ఇంకా కోలుకోకుండానే మా అమ్మాయికి ఒక మంచి సంబంధం వచ్చింది.
అప్పుడే హాస్పిటల్ నుంచి వచ్చాను. నా దగ్గర డబ్బులు లేవు సంబంధం కుదిరిపోయింది.
నేను బాబా తో చెప్పుకున్నాను. నన్ను ఇప్పటి దాకా ప్రతి పనిలో చూసుకుంటూనే ఉన్నావు.
నన్ను అనారోగ్యం నుండి కాపాడింది నువ్వే ! ఇప్పుడు పిల్ల కి పెళ్లి అంటే డబ్బు కావాలి అది నా పిల్ల కాదు నీ కూతురే ఎం చేస్తావో, అంతా నీదే భారం అని అనుకున్నాను.
ఎప్పుడో 24 సంవత్సరాల క్రితం మా నాన్న యద్దన పూడి అయ్యన్న పంతులు గారికి 40 ,000 రూపాయలు అప్పుగా ఇచ్చారు.
ఇప్పుడు మా అమ్మాయి పెళ్లి అనుకోగానే ఆయన నా పేరు మీద 40 ,000 డ్రాఫ్ట్ పంపించారు.
ఆ డబ్బుతో పెళ్లి పనులు మొదలు పెట్టాము. రవి మీ అమ్మాయి పెళ్లట కదా ఈ డబ్బు ఉంచు అంటూ 10 ,000 చేతిలో పెట్టి వెళ్లారు. ఆలా పెళ్లి బ్రహ్మాండంగా జరిగింది.
మా అమ్మాయి పెళ్లి కి బాబా స్వయంగా రావాలి అనుకున్నాను.
త్యాగరాజు అని మాకు తెలిసిన ఆయన బాబా ఫోటో, శ్రీ సాయి సచ్చరిత్ర పుస్తకం రెండు పట్టుకొని మా అమ్మాయికి గిఫ్ట్ ఇవ్వడానికి వచ్చాడు .ఆయనని ఆలా చూసేసరికి నాకు కళ్ళ నీళ్ళు ఆగలేదు.
2012 లో నాకు సడన్ గా నీరసం అయ్యి డాక్టర్ దగ్గరికి వెళితే నీకు హార్ట్ ఎటాక్ వచ్చింది సీరియస్ గా ఉంది అని మెడ్విన్ కి వెళ్ళమన్నారు. నా దగ్గర డబ్బులు లేవు.
ఆ ట్రీట్మెంట్ కి నేను తట్టుకోలేను నిమ్స్ కి పంపమన్నాను , ఆయన సరే అన్నారు. ఓపి వరకు నడుచుకుంటూనే లొపలికి వెళ్ళాను.
లోపల రిపోర్ట్స్ చూసి గేటు నుంచి ఇక్కడికి నడుచుకుంటూ వచ్చారా అన్నాడు. నన్ను బాబా గారు ఇక్కడికి పంపించారు .ఇంకా ఏం చేస్తాడో ఆయనిష్టం అన్నాను.
బాబానా ఆయనెవరు? బాబా అంటే షిరిడి సాయి బాబా నా అంటూ నన్ను వీల్ చైర్లో కుర్చోబెట్టుకొని, ఆయన రూమ్ లోకి తీసుకు వెళ్ళాడు.
ఆయన రూంలో పెద్దదైన బాబా ఫోటో కి పూల దండ వేసి ఉంది. నాకు ఆయన్ని చూపించి, నిన్ను ఇక్కడికి తీసుకువచ్చి పెట్టాడు ఆయనే నిన్ను చూసుకుంటాడు అన్నాడు.
యంజీయోగ్రామ్ చేసి మూడు వాల్యులు మూసుకుపోయాయి అని తెలుసుకొని ఆ డాక్టర్ గారే ఆరోగ్య శ్రీ అంటూ ఆయనేవో తంటాలు పడి నాకు ఖర్చు కాకుండా స్టంట్స్ వేశారు . అంతా బాబా దయ.
The above text has been typed by: Mrs. Rajarajeswari Sainathuni
Latest Miracles:
- ఆరోగ్యం బాగోలేని నా తమ్మునికి , స్వయంగా బాబా వారే ఆపరేషన్ చేసి జబ్బును నయం చేసిన వైనం …రవి కుమార్
- అప్పుడే పెళ్ళి వద్దనుకున్న నాకు, బాబా భక్తురాలిచ్చే వివాహం జరిపించిన బాబా వారు.
- తాళాల గుత్తి మాయం చేసి తానే(బాబా వారు) నా ఇంటికి కాపలా ఉన్నాడు.
- బాబా అనుగ్రహంతో బడే మియా కుమార్తె వివాహం
- బాబా ఆశీర్వాదంతో నా వివాహం జరిగింది.-3
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments