బాబా అనుగ్రహంతో బడే మియా కుమార్తె వివాహం



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు

బడే మియా కూతురు పెళ్ళికెదిగి వుంది. త్వరలో వివాహం జరిపించాలి. అందుకోసం బడేమియాకి కనీసం వెయిరూపాయలవసరం. బడేమియా పేదవాడు, పాటిల్ కి సహాయపడినట్లుగానే బాబా తనకి కూడా సహాయపడతరేమో అనుకున్నాడు.

ఆ మరునాడే షిరిడీకి పోవాలని నిర్ణయించుకున్నాడు. తెల్లవారుతూనే బాబా దర్శనానికి ద్వారకామాయికి చేరుకుని, బాబాకి సాష్టాంగపడ్డాడు. బాబా పాదాల చెంత ఒక రూపాయని వుంచాడు. తన కూతురు పెళ్లీడుకొచ్చిందనీ, పెళ్లి చేయాలనీ అందుకు ఖర్చుల నిమిత్తం వెయ్యి రూపాయలవుసరమనీ బాబాకి విన్నవించుకున్నాడు.

అప్పుడు బాబా తన కఫ్నీ జేబులో చేయిపెట్టి దోసిడికందినన్ని నాణేలని తీసారు. బడేమియా కండువాని పట్టమని అందులో ఆ నాణేలన్నీ పోసారు బాబా. కండువాలో పోస్తున్నప్పుడు నాణేల గలగలలు బడేమియా విన్నాడు. ’ఇప్పటికి ఇంటికి వెళ్ళు, వెళ్లి ఆ నాణేలను లెక్కపెట్టుకో’ అని బడేమియాని బాబా ఆదేశించారు.

ఇంటికి చేరుకున్న వెంటనే బడేమియా ఆ నాణేలని ఆతృతతో లెక్కపెట్టాడు. మొత్తం అరవైఎనిమిది నాణేలున్నాయి. బాబా తనతో హాస్యమాడారని బడేమియా మొదట అనుకున్నాడు. వెంటనే బడేమియా షిరిడీకి తిరిగి పరిగెట్టాడు. ద్వారకామాయికి వెళ్ళి బాబాతో వాదించడం ప్రారంభించాడు.

“పాటిల్ గొప్పవాడు, అందుచేత నీకు మూడురూపాయలు దక్షిణివ్వగలిగాడు, నేను బీదవాడిని, ఎంతో దూరమైన మరఠ్వాఢా నుండి నీకోసం వచ్చాను, నాకు కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే, అదీ నాకూతురు పెళ్ళి ఖర్చుల కోసం కావాలి, కానీ నీకు ఒక రూఫాయ దక్షిణ సమర్పించుకున్నతర్వాత నాకు నీనుండి దొరికింది అరవై ఎనిమిది పైసలు. నా దారిద్ర్యాన్ని నువ్వు అపహాస్యం చేసావు బాబా” అని నిందించాడు.

“నువ్వు నా పాదల చెంత ఒక్కరూపాయి దక్షిణ పెట్టిన వెంటనే నువ్వు నానుండి వెయ్యిరూపాయలను ఆశిస్తున్నావని నేను గ్రహించానులే’ నవ్వుతూ అన్నారు బాబా. అప్పుడు బడేమియా తన కూతురికి నిజంగానే త్వరలో వివాహం కాబోతూవుందన్నాడు. “అర్రే! బడేమియా! నీ కూతురి పెళ్ళి వచ్చే సంవత్సరం జరుగబోతూవుంది. ఇప్పటినుండీ కంగారుపడతావెందుకు? పెళ్ళి నిశ్చయమైన వెంటనే, నీకు అవుసరమైన ధనాన్ని నేను సమకూరుస్తానుగా” అని మాటిచ్చారు.

బడేమియా ఇంటికి వెళ్ళిపోయాడు. బాబా ఆశీస్సుల వలన ఆ సంవత్సరం పంట ఎప్పటికన్నా నాలుగయిదు రెట్లు అధికంగా దిగుబడినిచ్చింది. ఆ విధంగా లభించిన ధనంతో ఎవరి దగ్గరా చేయిచాచనవుసరం లేకుండా, ఎవరి దగ్గరా అప్పుచేయనవుసరం లేకుండా, తన కుమార్తె వివాహం ఘనంగా జరిపించాడు. ఏమిటి, ఎప్పుడు, ఎందుకు, ఎలా ఇవ్వాలో భగవంతుడికి తెలుసు, భగవంతుని ఇష్టాన్ననుసరించే అన్నీ జరుగుతాయి.

source: (సాయి సాగర్, 2009 దీపావళీ విశేష సంచిక నుండి) http://sukanya-saiismylife.blogspot.co.ke/2015/11/blog-post_14.html

సర్వం సాయినాథర్పాణమస్తు 

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Have any Question or Comment?

0 comments on “బాబా అనుగ్రహంతో బడే మియా కుమార్తె వివాహం

Maruthi

SaiBaba…SaiBaba

Comments are closed for this post !!

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles