Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
రాధ గారి అనుభవములు రెండవ మరియు చివరి భాగం
ఆ తరువాత మా భార్య భర్తల మధ్య గొడవలతో దూరం ఎక్కువ అయింది. నేను కొన్ని రోజులకి మా వారికీ దూరంగా 5 సంవత్సరాలు హైదరాబాద్ లో మా అమ్మ దగ్గర ఉన్నాను.
అప్పటికి నాన్న పోయారు. నేను బాబా పూజలు అక్కడ ఉండగా కూడా మానలేదు.
హైద్రాబాద్ చేరిన దగ్గర నుండి నేను గురువారాలు బాబా పూజలు చేస్తే, మంగళవారం సాయంత్రం నుండి, ఇంట్లో ప్రతివారం, వారానికో సుగంధ పరిమళం వస్తూండేవి.
మొదట్లో నాకేమి అర్ధమయ్యేది కాదు. వాసనలు ఇలా వస్తున్నాయేంటి అనుకుని ఇంట్లో నా పిల్లలు, మా అన్నయ పిల్లలు, ఎవరైనా సెంట్ సీసా పగలుగొట్టారా లేక తులసి మాలలు ఏమైనా ఇంటికి తెచ్చారా అనుకునేదాన్ని,
ఇంట్లో మా మరదలికి కూడా ఏమైనా వాసనలు వస్తున్నాయా అని అడిగేదాన్ని,
అలా అడుగుతుంటే, మా ఆడపడచు రాలేదంటే ఏంటో? వస్తున్నాయంటే ఏంటో? అనుకునేదేమో మరి ఒకసారి వస్తున్నాయి అనేది. మరోసారి ఎగతాళిగా నవ్వేది.
ఆ విషయం అమ్మకి చెప్పాలని నాకు తోచలేదు. అలా వస్తుంటే బాబా నాతో కూడా ఉంటున్నారన్న విషయం నాతో ఎవరు చెప్పలేదు. నేననుకోలేదు.
అక్కడ అలా 5 సంవత్సరాలు గడిచాయి. నేను పూజ గదిలో ఒక పక్క అగర్బత్హులు మూడు వెలిగించి ఇది అల్లాకి అని పెట్టేదాన్ని.
అలా ఎందుకు పెట్టేదాన్నో ఏమిటో నాకు తెలియదు. అలా పెట్టమని కూడా ఎవరూ నాకు చెప్పలేదు.
ఇంట్లో అలా వాసనలు వస్తుంటే అమ్మ ఒకసారి, అబ్బ ఏమిటీ వాసనలు ఛస్తున్నాము అంటూ విసుక్కుంది. అంతే ఆ రోజు నుండి ఈ రోజు వరకు నేనింక ఆ పరిమళాల్ని అనుభవించలేదు.
ఆ వెంటనే ఎన్నాళ్ళు నేను ఇలా ఉండను? నేను ఆయన దగ్గరకి వెళ్ళిపోవాలి అనే బుద్ధి పుట్టింది. అమ్మతో చెప్పాను. ఆవిడ ఒప్పుకోలేదు.
ఏమయినా సరే రేపు ఉదయం బయలుదేరి పోవాలి అనుకున్నాను. తెల్లారే పాటికి ఎవరో టెలిగ్రామ్ ఇచ్చి పిలిచినట్టుగా మా మామగారు, మా మరిది వచ్చారు.
ఎమ్మా వస్తావా అని అడిగారు? వెంటనే రెండు చీరలు బ్యాగ్ లో పెట్టుకుని వాళ్ళతో వెళ్ళిపోయాను.
మా అమ్మాయి మెడిసిన్ నాలుగో సంవత్సరం రాయబోతున్నప్పుడు కంగారు పడటం మొదలు పెట్టింది. ముందు మూడు బాగానే రాసింది.
నాలుగో సంవత్సరానికి మాత్రం 26 పేపర్లు ఉంటాయి. ఎందుకో గానీ బాగా టెన్షన్ పడేది.
ఎం కంగారు లేదు ‘బాబా’ ఉన్నాడని ఎంతో నచ్చ చెప్పాను. అది ఒక్కతే కాదు, వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా ఇదే తంతు.
ఏం రాయాలో, ఏం చేస్తారో, ఎలా ఉంటుందో ఇదే కంగారు, నేను కూడా ఈ గాబరా భరించలేక బాబా పాదాలపై పడ్డాను.
బాబా నువ్వేం చేస్తావో అనుకుని బాబా గుడికి వెళ్ళి మూడు ప్రదక్షిణలు అనుకుంటూ మొదలు పెట్టి 108 ప్రదక్షిణాలు చేశాను.
అలాగే ప్రతి బుధవారం నాడు. మధ్యలో రెండు, మూడు వారాలు వేరే కారణాల వలన, చెయ్యలేకపోయానేమో కానీ, 6 , 7 నెలలుగా 108 ప్రదక్షిణాలు చేస్తున్నాను.
ఇప్పుడు మా అమ్మాయి మెడిసిన్ లో మంచి percentage తో పాస్ అయ్యింది. మెడికల్ ప్రాక్టీసు పెట్టుకోవడానికి కూడా పర్మిషన్ వచ్చింది.
ఇంతకు ముందు మా వాళ్లలో మెడిసిన్ చదివిన వాళ్ళు లేరు. మా అమ్మాయి ఇలా చదువుకోవడానికి కారణం మా తమ్ముడు పట్టుబట్టాడు. తర్వాత ‘బాబా’ తన వంతు సహకార సహాయాలు అందించారు.
ఈనాడు మేము ఇలా ఉన్నాం అంటే అంతా బాబా మాకు పెట్టిన బిక్ష.
సర్వం శ్రీ సాయినాధ చరణారవిందార్పణ మస్తు
శుభం భవతు.
The above miracle has been typed by: Shiva Kumar Bandaru,
Latest Miracles:
- భక్తురాలి ఇంట్లో జ్యోతి వెలిగించినప్పటినుండి ఎన్నో రూపాలలో పూజ గది గోడ మీద కనిపించిన బాబా వారు.
- బాబాకి పేద, ధనిక, కులం, మతం, తేడాలు లేవు, కావలసింది కేవలం బాబా మీద భక్తి, ప్రేమ, శ్రద్ధ మాత్రమే!
- ఆత్మహత్య చేసుకుందామనుకున్న మామయ్య మనసు మార్చి, మా కుటుంబ ఇలవేల్పు అయినా బాబా వారు.
- తన భక్తురాలి తోబుట్టువును ప్రాణాపాయం నుండి తప్పించిన బాబా వారు
- మందిర నిర్మాణ ప్రదేశం పట్ల భక్తురాలి కలలో ఇష్టత చూపిన బాబా వారు
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments