Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
నా పేరు గాయత్రి దేవి. మేము విశాఖ పట్నంలో ఉంటాము. నేను ఇంట్లోనే ఉంటాను. నేను సాధారణ గృహిణిని మా వారు బిల్డింగ్ కాంట్రాక్టర్.
స్థలాలు కొని ప్లాట్లు కట్టి ఇల్లు అమ్ముతుంటారు. మా వారికీ ఒకసారి కుడి చెయ్యి బాగా నొప్పి చేసింది. చెయ్యి పైకి ఎత్తడానికి చాలా కష్టపడవలసి వచ్చేది.
ఎంతమంది డాక్టర్స్ కు చూపించినా ఎన్ని టెస్టులు, ఎన్ని x ray లు తీసినా కూడా ఏం చెయ్యలేక పోయారు.
ఆ నొప్పి ఏ విధంగానూ తగ్గలేదు. చివరికి ఒక డాక్టర్ నువ్వు కొన్నాళ్ళు స్కూటర్ డ్రైవ్ చెయ్యటం మానేయి అని అన్నారు.
స్కూటర్ డ్రైవ్ చేయకుండా బయటికి వెళ్ళడం ఆయనకి అవ్వదు. ఏం చెయ్యాలో మాకేం తోచడం లేదు.
ఆ సమయంలో మా వారి స్నేహితుడొకరు MVP కాలనిలో ఈస్ట్ పాయింట్లో ”బాబా” గుడి ఉంది. అక్కడికి వెళ్లి నువ్వు బాబాకి దండం పెట్టుకుని, అక్కడే బాబా ఊదీ దొరుకుతుంది, నీ చేతికి అది రాయి, నీకు నొప్పి తగ్గిపోతుంది అని చెప్పాడు.
సరేనని ఈయన వెళ్ళి బాబాకి దండం పెట్టుకుని అక్కడే ఉన్న ”ఊదీ” తీసుకుని తన చేతికి రాసారు. అలా రాసాక మూడు రోజులలో ఆ నొప్పి తగ్గిపోయింది.
ఇన్ని మందులు వాడిన తగ్గలేదు. చాలా బాధ పడ్డారు కదా ఇప్పుడు ఇలా ఊదీ రాయగానే భలే తగ్గిపోయిందే ఈయన ఎవరో మహాత్ముడిలా ఉన్నాడనిపించింది.
ఈ సారి ఈయన బాబా గుడికి వెడుతుంటే నేను కూడా వెళ్ళాను. నేను బాబాకి దండం పెట్టుకున్నాను.
ఆ తర్వాత మా వారు బిల్డింగ్ కట్టడానికి అని ఒక స్థలం కొనాలని అనుకుని స్థలం కొన్నారు.
అది కొన్నాక మాకు తెలిసిందేమంటే ఆ స్థలం యజమాని మాకు అక్కడ నీళ్ళు పడవు అన్న విషయం దాచిపెట్టి మాకు ఆ స్థలం అమ్మేశాడు. మాకు విషయం తెలియక కొనేసుకున్నాము.
బిల్డింగ్ కట్టాలంటే ముందు నీళ్ళు కావాలి. అందుకని బోర్ వేద్దామనుకుని చూస్తే నీళ్ళు పడవంటే పడవన్నారు.
నేను బాబాకి దండం పెట్టుకున్నాను. ”బాబా నీ మీద భారం వేసి మేము బోర్ వెయ్యడం ప్రారంభం చేస్తాము” అని బాబాను వేడుకుంటూ నేను ఇంట్లోనే ఉండిపోయాను.
అక్కడ పని మొదలు పెట్టేసారు 90 అడుగులు వేసేటప్పటికీ చాలా అనూహ్యంగా నీళ్ళు పడ్డాయి.
ఈ విషయం ఇంట్లో ఉన్న నాకు మా నాన్న గారు ఫోన్ చేసి చెప్పారు.
అసలు నీళ్ళు పడవన్న స్థలంలో కూడా నీళ్లు 90 అడుగులకే తెప్పించిన బాబాపై మాకు పరిపూర్ణమైన విశ్వాసం కలిగింది.
మా ఆర్ధిక పరిస్థితి ఏమి బాగాలేదు. మాకు పూట గడవటం కూడా కష్టంగా మారిపోయింది. అటువంటి సమయంలో ఒకచోట రామ్ రతన్ బాబా గారు జ్యోతి వెలిగించడానికి వస్తే మేము కూడా వెళ్ళాము.
ఆయన మమ్మల్ని చూసి మీరు అతి త్వరలో కోటీశ్వరులు అవుతారు అన్నారు.
మేము ఇంటికి వచ్చాక నేను ఈయన ఇద్దరం చెప్పుకుని నవ్వుకున్నాము. ఎందుకంటే మేము కోటీశ్వరులం అవ్వటం ఏమిటి ఈ రోజు మా దగ్గర ఒక్క పైసా కూడా లేదు ఎలా అవుతాము కోటీశ్వరులం అని అనుకున్నాము.
మాకు నాలుగు ఎకరాలు పొలం ఉంది. ఆనాడు అది మేము 18 లక్షలు పెట్టి కొన్నాము.
ఇప్పుడు అమ్మేద్దామనుకుంటున్నాము ఎందుకంటే మరో చోట పెట్టుబడి పెట్టాలంటే డబ్బులు కావాలి కదా! అందుకోసం ఉన్నది అమ్మేద్దాం అనుకుంటున్నాం.
కొన్నది 18 లక్షలకి , 10, 12 లక్షలు కంటే ఎక్కువ రావు అంటున్నారు. మాకు డబ్బుతో ఎంత అవసరం ఉన్నా నష్టానికి పొలం అమ్మలేము.
ఏం చేద్దాము అని ఆలోచిస్తున్నాము. ఈ లోపు గురువుగారు ఒకరింట్లో జ్యోతి వెలిగించడానికి వచ్చారు.
అక్కడ ఆయన్ని మేము కలిసాము. ఆయనికి విషయం అంతా చెప్పాము. ఆయన విషయం అంతా విని, ఆయన మాకు ధైర్యం చెప్పి, ”ఏమి ఫరవాలేదు మంచి బేరానికి మీరది అమ్ముతారు” అని చెప్పారు.
అక్కడ నేను నామం చెబుతూ కూర్చున్నాను. నామం చెబుతున్నానే గాని నా మనసేమి బాగాలేదు.
ఈయన బయటికి వెళ్లారు. కాసేపట్లో మా వారు నాకు ఫోన్ చేసారు. నువ్వు రా అర్జెంటు గా ఒక NRI పార్టీ వచ్చింది. 26 లక్షలకి అగ్రిమెంట్ అయ్యింది, నువ్వు వచ్చి సంతకం పెట్టాలి రా అన్నారు.
నా మనసంతా నిరాశే ఆవరించి ఉండటాన 10 , 12 లక్షలు ఇస్తామంటున్నారు ఇప్పటిదాకా అలాంటిది ఏకంగా 26 లక్షలు ఎవరిస్తారు.
మా వారు నాతో వేళాకోళం చేస్తున్నారు అనుకున్నాను. అందుకే నేను రాను రాలేను అని అన్నాను.
ఆ పార్టీని తీసుకుని మా వారు సీతమ్మ ధారకి తీసుకువచ్చేసారు. అక్కడే బాబా ఎదురుగానే నేను అగ్రిమెంట్ పేపర్ పై సంతకం చేశాను.
15 రోజులలో రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది. ఆ పొలం ఇప్పుడు కొంటే కోట్లు విలువ. కానీ ఆనాడు పరిస్థితుల్లో అది అమ్మేస్తే కానీ మాకు ఆధారం లేదు.
The above miracle has been typed by; Mrs. Raja Rajeswari Sainathuni
Latest Miracles:
- ఇంటర్వ్యూ లేకుండానే అసిస్టెంట్ జనరల్ మేనేజర్ గా అపాయింట్ మెంట్ ఇప్పించిన బాబా గారి లీల…Audio
- మాకు షిర్డీ వెళ్లి బాబా ని దర్శించుకోవటమే పెద్ద పండుగ.
- అడవిలో ఏకాకిగా ఉన్న మాకు సహాయం చేసిన బాబా వారు …..!
- భక్తురాలు అయిష్టముగా వెళ్లిన తీర్థయాత్రలో, బాబా వారు కలలో కనిపించి “నేను నీ కూడానే ఉన్నాను” అని అభయం ఇచ్చుట.
- కష్టాలలో ఉన్న భక్తుని ఆధ్యాత్మిక మార్గంలోనికి తీసుకొని వచ్చిన అవధూతల దర్శనం…Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments