అడవిలో ఏకాకిగా ఉన్న మాకు సహాయం చేసిన బాబా వారు …..!



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


నాకు ఎలమంచిలి బదిలీ అయ్యింది. అది ఒక పల్లెటూరు. అక్కడ ఇంగ్లీష్‌ మీడియం బడులు వుంటాయో లేదో మా మూడో వాడి  చదువు సాగుతుందో లేదో అని భయపడ్డాము.

అయినా ‘బాబా’ మీద భారం వేసి వెళ్ళాము. అక్కడ ఇంక వేరే కాలక్షేపాలు ఏమీ లేవు. అంచేత శ్రద్ధగా బాబా గారి హారతులు నేర్చుకోవటం, పాడటం అలవాటయ్యింది.

హారతులన్ని నోటికి వచ్చేసాయి. సత్సంగాలు, పారాయణాలు, భజనలు అన్నీ బాగా జగురుతుండేవి అక్కడ. మూడేళ్ళపాటు చేసి తిరిగి హైదరాబాద్‌ చేరుకున్నాము.

2003 సంవత్సరంలో ‘గోదావరి పుష్మరాలు’ వచ్చాయి. ఆ సమయంలో మా బానమరిది వరంగల్‌ లో వున్నాడు.

కాళేశ్వరం లో గోదావరి వున్నది. అక్కడికి వెళ్ళి స్నానాలు చేద్దాం అనుకున్నాము.

ఎలా వెళ్ళాలా అని అనుకుంటుంటే మా బావమరిది ఫోన్‌ చేసాడు. “బావా ఇక్కడికి మీరందరూ వచ్చేయండి. అప్పుడు మనమందరం కలిసి ఒక వెహికల్‌ మాట్లాడుకొని ‘కాళేశ్వరం’  వెళదాము” అన్నాడు.

సరేనని మేము బస్సు లో వెళ్ళాము. మా మేనకోడలు (బామ్మరిదికూతురు) కడుపుతో వుంది, దాన్ని ఒక దాన్నీ వదిలి మేము రాలేము  మీరు వెళ్ళండి అన్నాడు మా బావమరిది.

నేను, మా ఆవిడ, మా మరదలు ముగ్గురం బయలుదేరి ‘కాళేశ్వరం’ వెళ్ళాము.

అక్కడ స్నానాలు చేసాం, అక్కడంతా అడవి, ఎట్టి పరిస్థితుల్లోను రాత్రి ఉండటానికి అవకాశం లేదు, ఇద్ధరి ఆడవాళ్ళ ఒంటిమీద నగలు ఉన్నాయి.

ఉన్నది అడవి ప్రాంతం అడపా తడపా ఒక్క వాహనం వస్తోంది. అదీ పుష్కరాల పుణ్యమా అని. లేకపోతే నరమానవుడు కనిపించడు ఆ మార్గంలో.

బస్సు కోసం నిలబడి వున్నాం. బస్సు రావటం లేదు, వచ్చిన బస్సు జనం ఎక్కువగా ఉన్నారని ఆపటం లేదు.

నాకు బి.పీ. పెరుగుతోంది.  అటు రాజమండ్రి వెళ్ళినా బాగుండేది, అనవసరంగా ఇటొచ్చి ఈ అడవిలో ఇరుక్కున్నట్లున్నాము అని అనుకుంటూ  బాబాను తలుచుకున్నాను,

“బాబా! ఇద్దరు ఆడవాళ్ళున్నారు, వాళ్ళ ఒంటి మీద నగలున్నాయి, చీకటి పడిపోయింది,  బస్సు రావటం లేదు,

ఇందాక ఎప్పుడో ఒక బస్సు వచ్చింది, దాంట్లో భాళీ లేదని ఆ బస్సు ఆపలేదు, ఏం చేస్తావో ఏమో బాబా!” అని అనుకున్నాను.

అంతే! ఒక బస్సు వచ్చింది. నేనా బస్సు ఆపాను. ఆ బస్సులో డ్రైవర్   ఎక్కడికి అన్నాడు, నేను వరంగల్‌ అన్నాను, ఎంతమంది అన్నాడు, ముగ్గురం అన్నాను, సరే ఎక్కండి అన్నాడు,

అప్పటికే బస్సులో ఇసుక వేస్తే రాలనంతగా జనాలు వున్నారు. అయినా ఎక్కాలి, తప్పదు. అలాగేఎక్కాము.

మాతో పాటు ఒక గర్భిణి స్రీ పాపనెత్తుకొని ఒపికలేనట్టుగా అసహనంగా బస్సు కోసం ఎదురు  చూస్తోంది.

నేను డ్రైవరు ని బతిమిలాడి ఆ స్రీని కూడా బస్సు ఎక్కించడానికి ప్రయత్నించాను.

ముందు కసిరాడు, ఏమండీ మీరు ముగ్గురు అని చెప్పారు, అలా అంటేనే బస్సు ఆపాను, ఇప్పుడు ఆవిడ కూడా  అంటున్నారు అన్నాడు.

ఫరవాలేదు ఆడమనిషి అడవిలో ఎంతసేపు నుంచుంటుంది, పైగా వట్టిమనిషి కూడా కాదు అన్నాను.

ఆ మనిషిని చూసాకా ఆ డ్రైవెర్‌ కూడా మెత్తబడ్డాడు. సరే ఎలాగో అవస్థపడి,కష్టపడి వరంగల్‌  చేరుకున్నాం.

ఎంతటి కారడివిలో వున్నా “బాబా” ఎలా సహాయం చేస్తాడో మాకు అనుభవపూర్వకంగా తెలిసింది.

The above miracle has been typed by: Mrs. Raja Rajeswari Sainathuni

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles