సాయి చేసిన సహాయం



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


భక్తుడు: నందకిషోర్

నివాసం: హైదరాబాద్

సాయి బంధువులకు సాయిరాం. నా పేరు నందకిషోర్.

2013వ సంవత్సరంలో నర్సాపురం నుండి బయలుదేరాను. శివానంద మహరాజ్ “గాణ్గాపురం” పీఠాధిపతిని కలవాలని ఉంది అని, బాబాని సహాయం అడిగాను.

అయితే తనని కలవాలంటే చిలుకూరు దగ్గర రిలయన్స్ కాలనీకి వెళ్ళాలి.  అక్కడి అడ్రస్ నాకు తెలియదు. నన్ను తీసుకెళ్ళేవారు కూడా లేరు.

ఎలా  చేరాలా అనుకుని గురు బంధువులు ఎవరైనా సహాయం చేస్తారులే అనుకున్నా.

నర్సాపురం నుండి వస్తుంటే నా ముందు సీట్ లో కూర్చున్న అతను రిలయన్స్ కాలనీకి అడ్రస్ ఫోన్ లో ఎవరికో చెపుతున్నారు. అబ్బా వాట్ ఏ మిరాకిల్ అనుకున్న.

తన పక్కన కూర్చుని అడ్రస్ అంతా అడిగాను. తను వివరంగా  చెప్పారు. బాబా గారు తన ద్వారా చెప్పారనుకున్నాను.

మరుసటి రోజు బస్సు ఎక్కి రిలయన్స్ విలేజ్ కి వెళ్లే బస్సు ఎక్కితే లంగర్ హౌస్ కి మాత్రమే అని చెప్పారు. తర్వాత రిలయన్స్ విలేజ్ కి వెళితే అక్కడ ఎవరు లేరు.

అది ఒక చిన్న గ్రామం. మళ్ళీ బాబాని  అడిగా ఎలా వెళ్లడం బాబా అని.

వెంటనే ఒక గురుబంధువు స్కూటర్ మీద వచ్చి రా నేను కూడా అక్కడికే వెళ్ళాలి నేను తీసుకువెళ్తా నిన్ను అన్నారు. ఎంతో ఆశ్చర్యం వేసింది. ఆనందం మాటల్లో చెప్పలేను.

“శివానంద మహారాజ్” ని కలిసాను. తాను నన్ను చూడగానే శరత్ బాబూజీ శిష్య పరంపర కదా అన్నారు.

కాసేపు సత్సంగం చేసి వచ్చా. బాబా గారు నా తోడుగా అడుగడుగునా ఉండి నన్ను కాపాడుతూ నాకు దారి చూపుతూ నాలో ఉన్నా కోరికని తీర్చారు అనడానికి ప్రత్యక్ష సాక్ష్యం ఈ సాయి లీల.

     ~~~~సర్వం సాయినాధార్పణమస్తు~~~~

*** సాయిసూక్తి:

 

“ఎవరికైన మధ్యాహ్నం పన్నెండు గంటలకి ఆకలవుతుంది. అన్నం లేని వాడి ఆకలి తీర్చి కడుపు నింపితే నాకు పెట్టినట్టే”

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles