Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
This Audio Prepared by Mrs Lakshmi Prasanna
- Mir-31 Cheque bounce కాకుండా 5:30
నేను ఒక హోమియోపతి Doctor ని శిరిడీలోనే ఒక clinic పెట్టుకున్నాను. నాకు సాయిబాబా మీద చాలా నమ్మకం వున్నా, ఇలాంటి అనుభవాన్ని ఆ దేవదేవుడు కలిగిస్తాడని నేను ఎప్పుడు అనుకోలేదు.
ఆ సాయినాధుడు ఎందరినో, ఎన్నో, ఎన్నో రకాలుగా రక్షిస్తున్నాడు. తన చెంతకు చేర్చుకుంటున్నాడు. సప్త సముద్రాల ఆవల తీరంలో వున్న వాళ్ళను దారం కట్టి లాగుతున్నాడు (సమాధి మందిరం వైపు, ద్వారకామాయి వైపు.)
అక్కడే వున్న నాకు ఇలాంటి అనుభవాన్ని కలిగించి నన్ను మనసా, వాచా, కర్మణా తన వైపు లాగుతాడని నేను అనుకోలేదు.
ఒక పచ్చి నిజం చెప్పనా! మేము శిరిడీ వాసులం, కాని అందరు ఆ సాయినాధుని భక్తులు వుండరు.
శిరిడీలో వున్నత మాత్రాన, కొందరు వ్యాపారం కోసం, కొందరు వృత్తి కోసం అలా వాళ్ళ వాళ్ళ అవసరాల కోసం వుంటారు.
నేను అలాగే ఒక హొమియో Clinic తెరుచుకొని, వచ్చి, పోయే యాత్రికులు ఎక్కువ వుంటారు కాబ్బటి బాగా నా Clinic నడుస్తుందని అక్కడ వున్నాను.
నేను చాల రోజుల క్రిందట ఒక party వాళ్ళ దగ్గర 300 రూపాయలు అప్పు తీసుకొని వుంటిని. ఒక రోజు నేను నా Clinic లో ఉండగా వాళ్ళు వచ్చి ఆ 300 రూపాయలు ఇవ్వమని అడిగారు. నేను ఒక check తీసి 300 Rs అని రాసి, సంతకం చేసి ఇచ్చాను. వాళ్ళు వెళ్ళిపోయినారు.
ఇంటికి వచ్చిన తరువాత పాస్ బుక్ చూసుకున్నాను. దానిలో 100 Rs వున్నాయి. ” అయ్యో వాళ్ళకు 300 Rs అని ఇచ్చాను. 100 Rs లే వున్నాయి, cheque Bounce అవుతుందేమో, నాకు ఎంత చెడ్డ పేరు వస్తుంది, అలా అయితే ఎలా” అనుకోని మదన పడసాగాను.
అప్పుడు నేను బాబా వైపు నా దృష్టి సారించాను. అంతవరకు రాని ఆలోచన అప్పుడు వచ్చింది. అందుకే భగవంతుడు మనుష్యులకు కష్టాలను ఇస్తాడు. అప్పుడైన ఆ విధాతను గుర్తు చేసుకుంటారని “బాబా నన్ను ఈ అపవాదునుంచి రక్షించు సాయి” అని నేను సమాధిమందిరం వైపు పరుగెట్టాను.
ఒక నాలుగు రోజుల తరువాత ఒక సాధారణవ్యక్తి, నాకు తెలిసిన అతనే నన్ను కలవడానికి వచ్చి ఒక చిన్న Packet ఇచ్చి నీ దగ్గర వుంచూ! అని అడిగాడు.
నేను అడిగాను, దానిలో ఏముంది?(నాకు ఆశ్చర్యంగా వుంది?) అతను చెప్పాడు, దీనిలో 300 రూపాయలు వున్నాయి. ఇంక నేను వుండబట్టలేక నీకు అభ్యతరం లేకుంటే నేను ఆ పైసలు వాడుకోనా! అని అడిగాను సంకోచిస్తూనే. ఆ వ్యక్తి అన్నాడు, వాడుకోండి నాకు ఏమి problem లేదు, నేను మళ్ళీ 3 నెలల తరువాత వస్తాను, అని వెళ్ళి పోయాడు.
నేను వెంటనే bank కు పరుగులు పెట్టాను. 300 Rs account లో వేశాను. అప్పటికి ఇంకా నేను check ఇచ్చిన వాళ్ళు వచ్చి మనీ తీసుకోలేదు. ” భగవంతుడా! రక్షించావు” అనుకున్నాను.
3 నెలలు గడిచాయి, ఆ వ్యక్తి రాలేదు, 6 నెలలు గడిచిపోయాయి. ఇంకా ఆ పైసలు నా దగ్గర పెట్టిన వ్యక్తి రాలేదు. “ఏమై వుండచ్చు? మర్చిపోయాడు, పోనీ నేనే వెళ్ళి ఇద్దామంటే, ఎక్కడ వుంటాడో తెలియదు” అనుకుంటూ వున్నాను.
ఇంతలో ఒకరోజు నాకు రోడ్డు మీద వెళ్తూవుంటే కనపడినాడు. పరస్పరం అభివందనం చేసుకున్నాం. ఇంక నేను వుండలేక అడిగాను, ఏమి? నీ money తీసుకునేదానికి నీవు రాలేదు? ఎందుకు! అని అడిగాను.
ఆశ్చర్యం! అతను ఏ money? అని అడిగాడు? నేను చెప్పాను 6 నెలల క్రిందట నీవు 300 రూపాయలు నా దగ్గర వుంచి వెళ్ళావు? 3 నెలల తరువాత వస్తాను, అని చెప్పావు. రాలేదేమి? అన్నాను.
దానికి అతను అన్నాడు, నేను నీ దగ్గరికి ఎందుకు వస్తాను, నేను నీ దగ్గరికి రాలేదు, నీకు Money ఇవ్వలేదు” అన్నాడు. అయినా, నేను తమాషాకు అంటున్నాడు, అనుకున్నాను.
Money return చేస్తే అతను తీసుకోలేదు, పైగా పరుగులు పెట్టి వెళ్ళిపోయాడు. అప్పుడు నాకు అర్ధం అయింది, ఇది ఆ దివ్యమైన సాయి అవతారం చేసిన దైవ లీల అని, ఓహో! ఇలాంటి లీలలు ఆయన సప్త సముద్రాల అవలకూడా చేస్తున్నాడు.
అందుకే ప్రజలు బీద, ధనిక, రోగం, భోగం ఏమి ఆలోచించకుండా శిరిడీ వైపు వస్తున్నారు” అనుకోని ఆ సాయినాధుని సర్వశ్య శరణాగతి చేశాను.
సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు
డా: రుస్తుంజీ,
శిరిడీ.
ఈ బాబా వారి లీల తెలుగు లోకి అనువదించిన వారు : మాధవి, భువనేశ్వర్
Latest Miracles:
- I was worried that “Oh god. What if this cheque bounces.
- భక్తుని సంశయాలను స్వప్న రూపంలో దర్శనమిచ్చి తీర్చిన బాబా వారు
- వైద్యుని రూపంలో వెళ్ళి, భక్తుని తండ్రి నడుము నొప్పిని తగ్గించిన బాబా వారు.
- శిరిడి యాత్రకు బాబా ధన సహాయం
- Baba UDHI Cured her high fever
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
22 comments on “Cheque bounce కాకుండా పరిచయస్తుని రూపంలో భక్తుని వద్దకు వెళ్ళి , ధన సహాయం చేసిన బాబా వారు–Audio”
Vidya
January 19, 2018 at 8:57 amWow !!! sairam
Lavanya
January 19, 2018 at 9:13 amChaala bagundi.Nammasakyam kaaleedu.
Swayam prakash
January 19, 2018 at 9:14 amThis miracle is wandrafull.thanks Madhavi mam..Jai sai ram.
Kajal
January 19, 2018 at 9:15 amReally amazing.mam..Saibaba is great guru we indians have.thank u mam..We lone many things from u..
Somya
January 19, 2018 at 9:16 amMadam..This miracle is so much beautiful..Sairam.
subhalaxmi
January 19, 2018 at 9:17 amBaba is really a great guru..Mam..Sairam.
Gourahari
January 19, 2018 at 9:18 amMadhavi mam..U r doing very nice work..Gob bless u..Sairam.
Sudip
January 19, 2018 at 9:21 am1st..I won’t belive..Mam..But day by day..I came to know about saibaba..Really thank u .Now we r very happy ..Jai sai baba.
Sambit
January 19, 2018 at 9:22 amVery amazing experience..The doctor had..Really great guru is sai baba..
Sai
January 19, 2018 at 9:23 amNuvvu chinnappati nunchi chepthunnadu.maaku..Eppudu memu realise avutunnamu..Baba great.really..
Radha
January 19, 2018 at 9:24 amChala baagundhi.Madhavi..Super work u r doing..Sai ram.
Gautam
January 19, 2018 at 9:26 amU r very much blessed..Madhu..I m very happy.with u..Sai ram
b vishnu Sai
January 19, 2018 at 9:28 amChaala baagundi
Om sai ram
Madhavi
January 19, 2018 at 9:33 amEe baba leela naaku annitikanna ekkuva nachindhi..Baba entha krupa..chupistharo..Enka vere guruvu..Daivam.endhuku.? Aayane thandri.thalli..Guruvu.daivam…Enka enni rojulu raayagalano..Theleedhu.but i m very thank full to whole teem .of saileelas.com…
Raghavendra
January 19, 2018 at 9:40 amBhale vundhi..Ee sai leela..Thanks mam.
soundarya
January 19, 2018 at 11:13 amAum sai ! Sakthi sai !
T.V.Gayathri
January 19, 2018 at 3:15 pmసర్వం సాయినాధార్పణమస్తు.ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి.
Padmini
January 19, 2018 at 3:49 pmVery nice om said ram.
Dillip
January 19, 2018 at 4:04 pmచాలా బాగుంది
sujit
January 19, 2018 at 4:06 pmvery nice చాలా బాగుంది
kishore Babu
January 20, 2018 at 1:08 amనాకు ఒకసారి ఇదే అనుభవము ఎదురైంది…నా దగ్గర ఒక రూపాయీ కూడా లేదు ఆఫీస్ కి వెళ్ళడానికి…అన్ని షర్ట్స్ లో వెతికాను ఏమైనా చిల్లర ఉంటాయేమో అని…ఎక్కడ లేవు..బాబా ఫోటో కి నమస్కారం చేసి…ఆఫీస్ కి నడిచి వెళ్లడం మొదలు పెట్టాను..కొంచెం సేపు నడిచిన తర్వాత జేబులో చేయపెట్టాను…200 రూపాయలు ఉన్నాయి…ఇక ఆనందానికి హద్దులు లేవు…బాబా నామము చెప్పుకుంటూ..ఆఫీస్ కి నడిచి వెళ్ళాను…బాబా ప్రేమని…తల్లి ప్రేమ కన్నా కూడా ఎక్కువ అని చెప్పవచ్చు.
kishore Babu
January 20, 2018 at 1:11 amMadhavi madam…your service is very Great…many people are inspiring towards Baba devotion once after reading your postings. thanks alot… Please continue the same dedication and devotions..