భక్తుని సంశయాలను స్వప్న రూపంలో దర్శనమిచ్చి తీర్చిన బాబా వారు



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


నా పేరు భాస్కర్ల సత్యనారాయణ మూర్తి, మాది నర్సాపురం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్.

నేను మా ఇంటి వద్ద నుండి బయటికి వెళ్లే దారిలో ఒక ఎర్రటి విగ్రహం ఉండేది. నేను రోజూ వెళ్లే దారిలో ఉండటం వలన ఆ ప్రదేశానికి రాగానే నా మనసంతా అదోరకం గా అయ్యేది.

నేను వెళ్లే సమయానికి ఆ విగ్రహానికి రోజూ ఒకామె నీళ్లు పోసి కడుగుతుండటం నేను తరచూ చూస్తున్న దృశ్యం.

ఆ విగ్రహం ఆమె తండ్రి గారిది కాబోలు! అని అనుకునే వాడిని, అయినా నేను ఎవరినీ నోరు తెరిచి ఈయనెవరు? అని అడగలేదు.

అలాగే కొన్ని సంవత్సరాలు జరిగిపోయాయి. అది 1980 లో జరిగిన సంగతి.

ఒక రోజు నేను ఏలూరు లో మా బావ వెంకటేశ్వర రావు దగ్గరకు పనిమీద వెడితే, అక్కడ మా బావ నన్ను కూర్చో పెట్టి ” బావా! నీకు షిరిడి సాయిబాబా తెలుసా ?” అన్నాడు. ” నాకు తెలియదు ” అన్నాను.

”బాబా అంటే చాలా గొప్ప వ్యక్తి (శక్తి)  దైవ సమానులు, ఆయనను నమ్ముకో నీ కోరికలు అన్నీ నెరవేరుతాయి.  నీకు మంచి ఉద్యోగం దొరుకుతుంది ” అంటూ తెగ చెప్పాడు.

నాకు అతనిపై చాలా కోపం వచ్చింది , చివరికి ” నన్ను వొదిలిపెట్టు బావా ! నేను వెళ్ళిపోతాను ” అంటూ చిరాకు కూడా పడ్డాను.

అప్పుడు మా బావ తన జేబులోంచి ఒక ఫోటో తీసి ”పోనిలే ఈ ఫోటో నైనా నీ వద్ద పెట్టుకో ! నేనెందుకు చెబుతున్నానో విను” అంటూ బలవంతంగా ఒక ఫోటో నా జేబులో పెట్టాడు.

ఆ ఫోటో నా జేబులోకి రాగానే నా మనసంతా ప్రశాంతంగా మారిపోయింది.

నేను ఫోటో బయటికి తీసి చూసాను, ఏదో తెలియని అనుభూతికి లోనయ్యాను, చెప్పారని ఆనందం కలిగింది.

పరీక్షించి ఫోటో చూసాక, నేను రోజూ రోడ్డు పైన చూస్తున్న విగ్రహం, ఈ ఫోటో ఒకటేనని అర్ధం అయ్యింది.

అంత వరకు లేని తాపత్రయం మొదలు అయ్యింది  నాకు, ఎవరు ఈ బాబా? అసలు ఉన్నాడా లేడా? ఉంటే ఎక్కడ ఉన్నారు? అసలు ఈయన ఊరు ఏది?  అసలు ఈ ఫోటో వచ్చాక నాలో ఇంత మార్పు ఎలా జరిగింది? అని బాబా నామం జపిస్తూ కాలం గడుపుతున్నాను.

ఆ సమయం లోనే నాకు వివాహం జరగటం, నా భార్య బాబా భక్తురాలు అవటం జరిగింది.

మా ఊళ్ళో గుడి లేదు కానీ, మా అత్తగారు ఊరు భీమవరం, అప్పటికే ఆ ఊరిలో బాబా గుడి ఉంది. ఆమె గుడికి వెళ్ళేదట.

ఇది ఇలా ఉండగా నేను రోజూ చూసే బాబా కి ఒక గుడి కట్టాలని ఊర్లో పెద్దలు నిర్ణయం చేసారు. కొంతకాలానికి గుడి తయారయ్యింది.

నేను, నా భార్య రోజూ హారతులకు ఆ గుడికి వెళ్లేవారం. అలా నాకు బాబా తో సాన్నిహిత్యం బాగా పెరిగింది.

షిరిడీ వెళ్లాలనుకున్నా కూడా బాబా అనుజ్ఞ లేదనుకుంటూ, నేను వెళ్ళలేకపోయాను.

నేను రోజూ లాగానే బాబాకి దండం పెట్టుకొని పడుకున్నాను.

ఆ రాత్రి నాకో కల, ఆ కలలో నేను సైకిల్ పైన ఒక సంచీ తగిలించుకొని కూరలు తేవాలని వెడుతూ, ఒక టీ షాపు ముందు ఆగి, టీ తాగుతుండంగా

నా సైకిల్ కి ఉన్న సంచీ లోంచి 7 అంగుళాల పొడవు , 4 అంగుళాల వెడల్పు ఉన్న ఒక బాబా ఫోటో పైకి వచ్చి అందులోంచి ”టీ నువ్వే తాగుతున్నావు , నాకు ఇవ్వవా” అని బాబా వారి మాటలు నాకు వినపడ్డాయి.

అంతే వెంటనే మెలుకువ వచ్చింది. మా ఆవిడని లేపి మరీ ఈ విషయం చెప్పాను, అప్పుడు సమయం 4 . 15 అయ్యింది.

ఆ రోజు గురువారం అప్పటినుండి రోజూ బాబాకి నైవేద్యం పెట్టకుండా నేను గానీ, మా ఆవిడ గానీ ఏమీ తినము, తాగము. బయట తినవలసి వచ్చినా కూడా బాబా ని తలవకుండా మేమేమి తినం, తాగము.

ఒక రోజు అసలు బాబా ఎలా ఉన్నారు? ఇప్పుడేంచేస్తున్నారు? ఆయన సమాధి ఎలా ఉంటుంది? సమాధి ఆకారం ఎలా ఉంటుంది? ఫోటో లో లాగానే పైనే ఉంటుందా?

బాబా సమాధి జరిగినప్పుడు ఏ రంగు చొక్కా వేసుకున్నారు? బాబా నువ్వు ఏం చేస్తావో తెలియదు, నీ దర్శనం నేను అడగకుండానే టీ షాప్ లో ఇచ్చావు.

నేను నీ భక్తుడనైతే, ఈ రోజు నా ఈ సమస్య నువ్వు తీర్చాలి, అని ప్రాధేయపడి, ప్రార్ధించి, నేను పొరపాటుగా బాబా ని ప్రశ్నలు వేస్తున్నానా? అన్న భయంతో అలాగే నిద్ర పోయాను.

ఆ రోజు కూడా గురువారమే , తెల్లవారు ఝామున 4 గంటలకి ఒక దివ్యమైన కల. ఆ కలలో పెద్ద గుడి, ఆ గుడిలో ఎదురుగ, ఒక పెద్ద బాబా విగ్రహం, దాని ఎదురుగా సమాధి,

ఆ ఎతైన సమాధి విగ్రహం పక్కన అనగా కింద కుడి వైపు, బాబా ఎడమ వైపు, అవి ఇత్తడితో చేయించినవి. అవి తెరుచుకొని లోపలకి వెడితే పై సమాధికి కింద సమాధికి మధ్యలో చాలా ఖాళీ ఉంది.

ఆ సమాధి పెట్టెలో బాబా తెలుపు రంగు కఫ్ని ధరించి పడుకొని కాలు మీద కాలు వేసుకొని, అంటే శేషపానుపు పైన పవళించిన విష్ణువు లాగా, కాలు ఆడిస్తూ ”నీ సంశయం తీరిందా? ఇంకా ఏమైనా ఉందా? ” అంటూ నా వంక చూసి అడిగితే ఆనందంతో కాళ్ళ నుండి ఆనంద భాష్పాలు.

నేను లేచి చూసేసరికి నాకర్ధమైంది, బాబా గారు నాకు తన నిజ సమాధిని చూపించారని నేనప్పటికి ఇంకా షిరిడీ కి వెళ్లకపోయినా, నాకు షిరిడీ చూపించారని నేను తెలుసుకున్నాను.

నేనింక వెంటనే మరణించిన పర్వాలేదని అనిపించింది. నా కోరిక ఈ రకంగా తీర్చినందుకు తన్మయం చెందాను.

The above miracle has been typed by: Mrs. Rajarajeswari Sainathuni

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles