Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
సాయిబాబా “నీ దగ్గర ఇవ్వటానికి ఏమీ లేకపోతే కనీసం బెల్లపు ముక్కైనా ఇచ్చి పంపు” అంటారు. సాయి చిస్తీ సంప్రదాయానికి చెందిన వాడంటారు కొందరు.
ఢిల్లీలో నిజాముద్దీన్ ఔలియా ఉండేవారు. ఒకనాడు మధ్యాహ్నం ఆయన విశ్రాంతి తీసుకుంటుంటే, ఒక సన్యాసి (దర్వేష్) వస్తే సేవకులు అతనిని త్రిప్పి పంపారు ఏమీ పెట్టకుండా.
“నీ ఇంట్లో ఏమీ లేకపోతే, నీ దగ్గరకు వచ్చినవారిని కనీసం ఆదరించు. పగిలిపోయిన హృదయంతో మనిషిని త్రిప్పిపంపాలని ఎవరు చెప్పారు?” అన్నాడు నిజాముద్దీన్ తో అతని గురువైన ఫరీద్.
నానా సాహెబ్ చందోర్కరు సేవకులు ఒక బిచ్చగత్తెను తిట్టి పంపినప్పుడు “కోపగించుకోవటం దేనికి? కొంచెం మర్యాదగా చెప్పవచ్చును గదా” అన్నారు సాయిబాబా. నోరు మంచిదైతే దైవానికి దగ్గరవచ్చు.
సుల్తాన్ కుతుబుద్దీన్ ముబారక్ షా, హజ్రత్ నిజాముద్దీన్ ను ప్రతి నెల చివరి రోజున రమ్మని అడిగాడు.
“నేను సుల్తాన్ ను దర్శించటం మా గురువుగారి బోధకు వ్యతిరేకం” అని సమాధానం పంపాడు నిజాముద్దీన్.
ఈ విషయంలో గురువైన ఫరీద్ ను సలహా అడిగితే బాగుంటుందేమో” అని ఎవరో అన్నారు.
“మాట్లాడుకోవలసిన ఆధ్యాత్మిక విషయాలెన్నో ఉండగా, ఈ ప్రాపంచిక విషయంగూర్చి నేను మాట్లాడాను” అన్నాడు నిజాముద్దీన్.
“సుల్తాన్ ను దర్శించటానికి ఇంకా రెండు గంటల వ్యవధి మాత్రమే ఉంది” అన్నారు అక్కడున్నవారు. నిర్లిప్తంగా ఉన్నాడు నిజాముద్దీన్.
ఆ సుల్తాన్ హత్యకు గురయ్యాడని అప్పుడే వార్త అందింది. సత్పురుషులకంటే అధికులెవరూ ఉండరు.
చిస్తీ సత్పురుషులలో నిజాముద్దీన్ ఔలియా పై వచ్చినంత సాహిత్యం ఇంకెవరిపైనా (సూఫీలలో) రాలేదంటారు.
ఈయన హృదయం అతి సున్నితమైంది. ఎంత సున్నితమంటే, ధ్యానానికి సంబంధించిన సూక్తులను వింటేచాలు, కన్నులనుండి నీరు కారేది.
ఆయన ఉపవసించిన దినాలే ఎక్కువగా ఉండేవి. సాయంకాలంపూట రెండు ముద్దలు తినేవాడు. చాలావరకు ఉదయాన ఏమీ తినేవాడు కాదు.
ఇంకొంచెం తీసుకోమని ప్రేమతో సేవకులు, శిష్యులు ఆయనను అర్థిస్తే, ఆయన కుంచించుకు పోయి, కళ్ళ వెంట నీరు కారుస్తూ “ఎంతమంది మనుజులు దుకాణాల్లోనూ, మశీదుల్లోనూ రోజుల తరబడి తినటానికొక మెతుకైనా లేక ఆకలితో అలమటిస్తున్నారో మీకు తెలియదా? మరి ఈ అన్నం నా గొంతు ఎలా దిగుతుంది” అనేవారు.
ఆయనలో ఉన్న అద్భుత గుణాలు, లక్షణాలు దయా, కరుణా, వాత్సల్యాలకు ప్రతి రూపాలే.
ఏప్రియల్ 3 (1325) న హజ్రత్ నిజాముద్దీన్ సమాధి చెందిన దినం.
ఆయనను స్మరించి, ఆయన బోధలను ఆచరిద్దాం!
Written by: Mullapudi Panduranga Sainath & Munnaloori Bose.
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- కఠిన సాధన…. మహనీయులు – 2020… మే 7
- కఠినం …. మహనీయులు – 2020… ఏప్రిల్ 6
- అంతిమ సందేశహరుడు …. మహనీయులు – 2020… ఏప్రిల్ 20
- ప్రసాదపు విలువ…. మహనీయులు – 2020… ఏప్రిల్ 13
- “తెలియగాలేరు, దైవ లీలలను”…. మహనీయులు – 2020… నవంబర్ 27
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments