అంతిమ సందేశహరుడు …. మహనీయులు – 2020… ఏప్రిల్ 20



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


సాయిబాబా “అల్లా శక్తిని రుజువుచేయగలిగిన వాడే మహమ్మదీయుడు” అన్నారు.

మహమ్మదీయ మత స్థాపకుడు మహమ్మద్. ఆయన సమాధి స్థితిలో నుడివిన మాటలను, పద్యములను మిత్రులు వ్రాసుకున్నారు. ఈ విధముగా విని, వ్రాసినవే ఖురాన్ లోని 114 అధ్యాయాలు.

మక్కాలో మహమ్మద్ ను నమ్మని వారున్నారు. అవి నిజాలని నమ్మేందుకు కొన్ని మహిమలను చూపమన్నారు మక్కాలోని అవిశ్వాసులు.

అందులో ఒకటి చంద్రుడు రెండుగా చీలటం. ప్రవక్త తన వేలిని చంద్రునివైపు చూపారు. “అప్పుడు మేము మహాప్రవక్తతో పాటు మినా అనే ప్రదేశంలో ఉన్నాము.అకస్మాతుగా చంద్రగ్రహం రెండుగా చీలిపోయింది. దాని ఒక భాగం ఒక కొండ వైపునకు జరిగింది” అని అబ్దుల్ బిన్ మసూర్ ప్రత్యక్ష సాక్షిగా తెలిపారు.

ఒక అరబ్బు “నీవు ప్రవక్త అని ఎలా నమ్మాలి?” అని ప్రశ్నించాడు. ” ఆ ఖర్జురపు చెట్టు రుజువు సరిపోతుందా?” అని అడిగాడు ప్రవక్త.

దూరంగా ఉన్న చెట్టును తన దగ్గరకు రమ్మన్నాడు ప్రవక్త. అది ప్రవక్త దగ్గరకు వచ్చి సాగిలపడింది. “ఇక పో” అన్నారు ప్రవక్త. అది తన పాత స్థానంలోనికి పోయింది.

1500 మంది ప్రవక్త దగ్గరకు వచ్చారు. ఆ సమయంలో ప్రవక్త ఒక చెంబుతో కాలకృత్యాలు తీర్చుకుంటున్నారు. వారందరకీ దాహంవేసి ప్రవక్త వద్దకు వచ్చారు.

ప్రవక్త తన చెంబులో చేతిని పెట్టి నీరును పోయసాగాడు. 1500 మంది దాహాన్ని తీర్చుకున్నారు.

ప్రవక్త అనుమాయుని తండ్రి రుణ భారాన్ని కుమారునిపై మోపి మరణించాడు.

రుణ దాతలందరూ ఒకేసారి వచ్చి అతనిపై ఒత్తిడి తెచ్చారు. అందరు కలసి ప్రవక్త దగ్గరకు వెళ్ళారు.

ప్రవక్త అతని పొలం వద్దకు అందరితో కలసి వెళ్ళాడు. ఆ పంటంతా ఇచ్చినా, ఏ ఒక్కరి ఋణం తీరదు.

ప్రవక్త ” ఆ పొలములోనికి పోయి మీ రుణానికి తగిన పంటను తీసుకొండి” అన్నారు.

అందరూ ఎవరికెంత రావాలో అంత తీసుకున్నారు. ఐనా పంట పొలంలో అలాగే ఉంది.

ప్రవక్త సూక్తులు

“నీ నౌకరు తప్పులను దినానికి 70 సార్లు క్షమించు”.

“కష్టించి పనిచేసిన వానికియ్యవలసిన కూలీని వాని శరీరం మీద చెమటలు ఆరక ముందే ఇచ్చివేయి”.

“మహిళల గురించి దేవుని గురించి భయపడి మెలగండి”.

“మీకు స్త్రీలపై ఏ విధంగా హక్కు ఉన్నదో, వారికి కూడా మీపై హక్కు ఉంది”.

“మీరు స్వయంగా తినే భోజనమే వారికి కూడా పెట్టండి. మీరు ధరించే బట్టలనే వారికి కూడా ఇవ్వండి”.

ప్రవక్త జన్మదినం ఏప్రియల్ 20 (571)

Written by: Mullapudi Panduranga Sainath &  Munnaloori Bose.

Collected and Presented By: Mr: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles