ఓం నమో భగవతే శ్రీధరాయ! …. మహనీయులు – 2020… ఏప్రిల్ 19



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


సాయిబాబా దక్షిణరూపంలో స్వీకరించిన డబ్బును, ఆ రోజునే పంచిపెట్టేవాడు.

భగవాన్ శ్రీధరులవారు డబ్బు ముట్టుకునేదే లేదు. ఎవరైనా బలవంతంగా ఇస్తే, దానిని పరోపకారానికి ఉపయోగించాలి అనేది ఆయన నియమం.

శ్రీధరులు హుబ్లీ స్టేషన్ లో ఉన్నారు. అక్కడనుండి ఆయన రైలు ప్రయాణం చేయాలి. గమ్యం సజ్జన్ గఢ్.

రైలు వచ్చే సమయమైంది. రైలు టికెట్టుకు కూడా చేతిలో పైసా లేదు. “అన్నింటికి స్వామి సమర్థులు (రామదాసు) ఉన్నారు” అనుకునేవాడు.

ఒక రైల్వే పోర్టరు వచ్చి “స్వామి తమరెక్కడికి వెళ్ళాలి? అని ప్రశ్నించాడు. ‘సజ్జన్ గఢ్ ‘ అన్నారు స్వామి.

ఆ పేరు చెవులపడగానే ఆ కూలీకి సమర్థ రామదాసుని చూసినంత సంతోషం కలిగింది. “టిక్కెట్టు తీసుకున్నారా, స్వామి?” అడిగాడు పోర్టరు. “లేదు తమ్ముడు నా దగ్గర డబ్బుల్లేవు” అన్నారు స్వామి. “ఇప్పుడే వస్తాను స్వామీ” అని ఆ కూలి వెళ్ళి, మీరజ్ వరకు టిక్కెట్టు తెచ్చి ఇచ్చాడు.

“స్వామీ! మా కూలీలంతా తలాకాస్త వేసుకుని మీరజ్ వరకు మాత్రమే టికెట్టు కొనగలిగాం” అని రైలు రాగానే స్వామీజీని ఖాళీగా ఉన్న పెట్టెలో ఎక్కించి, సాష్టాంగ నమస్కారం చేసి, “సమర్థులకు మా నమస్కారాలు అందచేయండి స్వామి” అని సెలవు తీసుకున్నాడు ఆ కూలీ.

గంగిగోవు పాలు గరిటెడైనను చాలుకదా! భక్తితో కూలీలందరూ తమ వద్ద నున్న డబ్బుతో కొంతవరకైనా రైల్వే టికెట్టును కొని ఇవ్వగలగడం ఆ సమర్థుల వారిపై గల ప్రేమను చాటుతుంది.

సాయిబాబా కూడా ఒక పేదరాలి వద్దనున్న సగం రొట్టె, ఉల్లిపాయను తిన్నారు.

శ్రీధరస్వామి గెహెళ్ళి మఠంలో ఉన్నప్పుడు ఒక రచయిత్రి శ్రీధరులపై ఆశువుగా పాటలల్లి పాడేది. ఆ పాటలను సావిత్రి అనే భక్తురాలు విని పరవశించేది. ఆమె నిరక్షరకుక్షి.

సావిత్రి ఒకసారి ఆ రచయిత్రి దగ్గరకు పోయి “నాకు ఆ పాటలు నేర్పండి. గురువుగారి ముందు పాడతాను” అని కోరింది.

” ఓ యబ్బో అక్షరం ముక్క రాదుగాని, మఠంలో పాట కచ్చేరి చేద్దామనుకుంటున్నావా?” అని పకపకా నవ్వింది ఆ రచయిత్రి.

మరునాడు కూడా ఆ రచయిత్రి పాట పాడింది. సావిత్రి ఆవిడ దగ్గరకు పోయి “మీకు నేర్పటానికి వీలుగాకపోతే, ఎవరిచేతనైనా చెప్పించుకుంటాను ఆ పాటలను కాగితం మీద వ్రాసి ఇవ్వండి” అని వేడుకుంది.

సావిత్రి ఆమెను అలా వేడుకోవటం శ్రీధరులు చూచారు. సావిత్రిని పిలచి “ఆమెను ఏదో రాసివ్వమని అడుగుతున్నావు. ఏం? నీకు కవిత్వం చెప్పటం చేతకాదా సావిత్రక్కా? పాటలు పాడు” అని గద్దించినట్టు ఆజ్ఞాపించారు.

ఆమెకు ఏదో మైకం కమ్మినట్లయింది. ఆ గొంతు నుండి పాటలు ఉరికాయి. ఇక సావిత్రమ్మ శ్రీధరులమీద పాటలు పాడసాగింది. రచయిత్రి తన అహంకారానికి తననే నిందించుకుంది.

సమర్థుల అనుగ్రహాన్ని పొంది, ఇతరులను సన్మార్గంలో పెట్టిన శ్రీధరులు ఏప్రియల్ 19 (1973)న మహాసమాధి చెందారు.

నేడు ఏప్రియల్ 19 శ్రీధరుల వర్ధంతి. ఆయనను స్మరించెదము గాక:-

ఓం నమో భగవతే శ్రీధరాయ….

Written by: Mullapudi Panduranga Sainath &  Munnaloori Bose.

Collected and Presented By: Mr: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles