Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
నిత్యానందబాబా సాయిబాబా వలె అన్నదానాన్ని చేసేవాడు.
నిత్యానందులు ఒకొక్కసారి ఆయన భోజనాలను చాలా రాత్రైన తరువాత పెట్టేవారు. “అలా ఎందుకు? ముందే భోజనం పెట్టవచ్చుగదా?” అని అడిగారెవరో. “ఉచిత భోజనమంటే అందరూ వచ్చి తింటారు. ఆకలితో ఉన్నవాడు భోజనం పెట్టేవరకు వేచి ఉంటాడు. అటువంటి వారికే భోజనం పెట్టేది” అంటారు నిత్యానందబాబా.
1920 సంవత్సరంలో ఈయన కన్హన్ గఢ్ (కేరళ)లో ఒక ఆశ్రమాన్ని నిర్మింపదలచారు. అది చాలా ఖర్చుతో కూడిన పని.
అంత డబ్బు ఈయన ఎక్కడ నుండి తేగలగుతున్నాడు? అనే ఆలోచనలు ప్రజలలోను, ప్రభుత్వంలోను కలగసాగింది.
ఈయన కొంతమంది పోలీసులను వెంటతీసుకుని, మొసళ్ళు నివసించే ఒక చెరువు వద్దకు పోయారు.
నిత్యానందులు నిర్భయంగా ఆ చెరువులోకి దిగి, కొంతసేపు ఉండి, బయటకు వచ్చి డబ్బును పోలీసులకు ఇచ్చారు.
అంత డబ్బు ఆయన చెరువులోనికి తీసుకుపోలేదు. చెరువులో ఉండేది మోసలులే. మరి డబ్బు ఎలా తెచ్చారు?
ఇది నిత్యానందుల మహత్తు అని గ్రహించి, ఇక డబ్బు గురించి ఆచూకీ తీయటం మానివేశారు అందరూ.
నిత్యానందులకు ఎందరో భక్తులుండేవారు. ఒక ధనవంతుడు, పరపతిగలవాని కుమారుడు ఈయన భక్తుడు.
తన కుమారుడు నిత్యానందుల భక్తుడవటం ధనవంతునకు ఇష్టంలేదు. ఒక రోజు అందరితో గోష్టిలో ఉన్నారు నిత్యానందులు. ఒక్కసారిగా లేచి, వెళ్ళిపోసాగారు.
ఆయన వెంట కొందరు భక్తులు వెళ్ళసాగారు. హఠాత్తుగా ఒక వ్యక్తి వచ్చి నిత్యానందులను పట్టుకున్నారు. రెండవ వ్యక్తి కత్తి పైకి తీసి నిత్యానందులను పొడవబోయాడు.
ఎత్తిన కత్తి చేతిలో అలాగే ఉంది. చేయి కదలటంలేదు. బాధతో విల విలలాడిపోతున్నాడు ఆ వ్యక్తి. నిత్యానందులు మెల్లగా వెళ్ళి ఆ వ్యక్తి చేతిని ముట్టుకున్నారు. మరల మామూలు స్థితికి వచ్చాడు.
ఈలోగా పోలీసులు వచ్చి, ఆ ఇద్దరు దుండగులను అరెస్టుచేసి, పోలీసు స్టేషన్ కు తీసుకుపోయారు.
పోలీసులతో నిత్యానందులు అది ఆ ఇద్దరి తప్పుకాదని, డబ్బుకు ఆశపడి ఆ ఇద్దరూ అలా చేశారని చెప్పినా పోలీసులు వినలేదు నిత్యానందులు పోలీసులను కోరారు వారిని విడువమని.
పోలీసులు వినకుంటే నిత్యానందులు నిరాహారిగా పోలీసు స్టేషన్ ఎదురుగా కూర్చున్నారు. ఈ సంగతి తెలిసిన ధనవంతుడు పోలీసులతో మాట్లాడి, ఆ దుండగులను విడిపించాడు.
ఆ దుండగులపై చూపే కరుణ, ఆయన మహత్తుకు మారి, ఆయన శిష్యుడైనాడు.
నిత్యానందులు కేరళలో జన్మించారు. ఈయనకున్న అనేకానేక ముఖ్య శిష్యులలో ముక్తానంద ఒకరు.
నిత్యానందులవారు ఆషాఢ మాసంలో బహుళ ద్వార్ధశినాడు 1961లో మహాసమాధి చెందారు. ఈయన మహాసమాధి మహారాష్ట్రలోని గణేశపురిలో ఉంది.
“ఓం నమో భగవతే నిత్యానందాయ….”
Written by: Mullapudi Panduranga Sainath & Munnaloori Bose.
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- ఓం నమో భగవతే గోపీనాథాయ …. మహనీయులు – 2020… జూలై 3
- ఓం నమో భగవతే శ్రీధరాయ! …. మహనీయులు – 2020… ఏప్రిల్ 19
- ప్రార్దించు! …. మహనీయులు – 2020… జూలై 14
- ఓం సత్యనారాయణ స్వామినే నమః…..సాయి@366 జూలై 10….Audio
- ఓం జయ జగదీశ హరే…. మహనీయులు – 2020… సెప్టెంబరు 30
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments