ఓం జయ జగదీశ హరే…. మహనీయులు – 2020… సెప్టెంబరు 30



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


భారతదేశంలో హిందీ రచయితలు ఇద్దరున్నారని, అందులో ఒకరు భరతేందు హరిశ్చంద్ర అని, రెండవ వాడైన తాను అంటే శ్రద్దారాం ఫిల్లౌరీ మరణించనున్నాడని చెప్పారు శ్రద్దారాం  ఫిల్లౌరీ.

ఆ మాటలు గర్వంతో పలికినవి కావు. యదార్థమైనవి. హిందీ భాషలో ఆయనే మొదట నవల వ్రాశాడు.

ఆ నవల ఎంత ప్రాచుర్యం పొందినదంటే, ఆ కాలంలో, పెండ్లయిన పెండ్లి కూతురుకు సారెగా ఇచ్చే వాటిలో ఒకటిగా అది ఉండేది. ఆ నవల పాఠకులను సంస్కారవంతులను చేసేది.

అయన రచించిన “పంజాబీ బాత్ చీత్” బ్రిటీష్ హయాంలోని ఐ.సి.యస్. అధికారులకు ఒక గ్రంథంగా ఉపయోగపడేది.

ఆయన తండ్రి వలెనే జ్యోతిష్య శాస్త్రంలో దిట్ట. సనాతనవాది. ఆయన మహాభారతంలోని శల్య పర్వంపై ఉపన్యాసం ఇస్తుంటే, అది బ్రిటిష్ ప్రభుత్వంపై వ్యతిరేకతను పెంచేదిగా ఉందని గ్రామ బహిష్కారం చేసింది.

కానీ, నూటన్ అనే క్రైస్తవ మతాధికారి చొరవతో ఆ ఇక్కట్టు తప్పింది.

సాయిబాబాకు కాకడ ఆరతి ఇచ్చే మందు మూడు పాటలను వినిపిస్తారు. అందులోని ఒక గీతం శ్రద్దారాం ఫిల్లౌరీ రచనయే.

“ఓం జయ జగదీశ హరే

స్వామి జయ జగదీశ హరే

భక్త జనోంకే సంకట్

క్షణమే దూర్ కరే

ఓం జయ జగదీశ హరే…”

అంటూ ఆ గీతం భారతదేశంలోనే కాదు. ప్రపంచంలోని నలుమూలలా (హిందూ) దేవాలయాలలో వినిపిస్తుంది. ఆలయాలలోనే కాదు, ఇది ప్రతి గృహంలో కూడా వినబడుతుంది.

ఆ గీతం విశ్వ విభుడైన జీగదీశుని వర్ణిస్తుంది. కొలది మార్పులతో, చేర్పులతో లక్ష్మీ, శివ మొదలైన దైవాలకు కూడా వర్తించి పాడుకోవటం జరుగుతోంది.

అది హిందీ భాషలో ఉంది. అయితే ఈ ” ఓం జయ జగదీశ హరే…”రచన తామే చేశామనే వారు కూడా ఉన్నారు. అది శ్రద్దారాం ఫిల్లౌరీ కాలంలో జరిగింది.

కానీ ఆ గీతంలో ‘శ్రద్ధ’ అనే పదం ఉండటం, ఆ రచనకు శ్రద్దారాం వ్రాసినట్లు రుజువైంది.

“ఓం జయ జగదీశ హరే…”ను రచించిన వ్యక్తి ఎవరో గ్రహించినా, గ్రహించకున్నా, శ్రద్దారాం ఫిల్లౌరీ ద్వారా ఆ రచన చిరంజీవత్వాన్ని పొందేటట్టు చేశాడు జగదీశుడు.

నేడు సెప్టెంబర్ 30. శ్రద్దారాం ఫిల్లౌరీ జన్మదినం.

ఆ జగదీశుని స్మరించెదము గాక

“ఓం జయ జగదీశ హరే…”

Written by: Mullapudi Panduranga Sainath &  Munnaloori Bose.

Collected and Presented By: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles