అంతటా కృష్ణుడే…. మహనీయులు – 2020… సెప్టెంబరు 19



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


హరిదాస్ జీ అంటే ఎవరికీ తెలియకపోవచ్చు. కానీ అక్బర్ ఆస్థానంలో ఉండే తాన్ సేన్ అంటే అందరుకూ అర్ధం అవుతుంది.

అయన సాయివలె బ్రహ్మచారి. వేటిపైనా వ్యామోహం లేదు.

ఒకసారి కానోట్ నుండి ఒక వ్యాపారి ఖరీదైన సెంటు (పరిమళ ద్రవ్యం) బుడ్డిని తెచ్చి హరిదాస్ కు ఇచ్చాడు. హరిదాస్ వద్దనలేదు. అందరినీ ఆశ్చర్య  పరిచింది. అయన వద్దనకపోవటం.

అది అతి ఖరీదైన సెంటు. హరిదాస్ ఆ సెంటును వెంటనే నేలపై కుమ్మరించాడు. ఆ వ్యాపారి అవాక్కయ్యాడు.

హరిదాసు చిరునవ్వు నవ్వి “నేను ఇప్పుడు శ్రీకృష్ణునితో హొలీ ఆడుతున్నాను. సమయానికి నీవు సెంటు తెచ్చావు. ఆ సెంటును కృష్ణునిపై పోశాను. కావాలంటే, కృష్ణ మందిరానికి పోయి చూడు” అన్నారు.

అందరూ కృష్ణ మందిరం చేరారు.  శ్రీకృష్ణుని వస్తముల నుండి ఘుమ ఘుమలు వస్తున్నాయి. అది అందరకూ ఆశ్చర్యం కలిగించింది.

హరిదాసు 24 గంటలలో అధిక భాగం తన ప్రియతముడైన శ్రీకృష్ణుని గూర్చి కీర్తనలు చేయటంలోను, పాడటంతోనూ సరిపోతుంది.

అయన నివసించేది గుడిసెలో. అయన మధుర గానాన్ని వినటానికి శ్రీకృష్ణుడే స్వయంగా వస్తుంటాడని అందరూ అంటారు.

అందుకు రుజువు కూడా ఉంది. ఆయన గానం చేస్తున్నప్పుడు ఆ కుటీరంలోంచి ప్రకాశవంతమైన కాంతి బయటకు వచ్చేది.

అయన పిడకలను ముట్టించి వచ్చే మంటపై రొట్టెను కాల్చేవాడు. ఆ రొట్టెలో మూడు వంతుల భాగాన్ని, తనను దర్శింప వచ్చిన వారికి ప్రసాద రూపంగా ఇచ్చేవాడు.

సాయిబాబా అబ్దుల్ తో చెప్పిన మాట “తక్కువగా తిను” అన్నదానికి హరిదాస్ జీవితమే ఉదాహరణ. ఈయన నింబార్క సాంప్రదాయానికి చెందిన మహనీయుడు.

ఆయన మహాసమాధి నిధీవనంలో ఉంది. ఈయన కొన్ని రచనలు హిందీ భాషలో “హరిదాస్ కీ గ్రంథ్’, ‘స్వామి హరిదాస్ జీ కీ పర్’, ‘హారిదాస్ జీ కీ బాణి’ లుగా వెలువడ్డాయి.

భారత ప్రభుత్వం 19 .5 .1985న స్మారక తపాలా బిళ్ళను విడుదల చేసింది.

నేడు సెప్టెంబర్ 19. హరిదాస్ జీని ఆయన రచనతో స్మరిద్దాం.

“నీకు ఇంకా సిగ్గు రాలేదా, జన్మనంతా వృథా చేసుకున్నావు”.

ప్రతి క్షణము హరి సేవకై వినియోగించెదము గాక!

Written by: Mullapudi Panduranga Sainath &  Munnaloori Bose.

Collected and Presented By: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles