గంగం గణగణ…. మహనీయులు – 2020… సెప్టెంబరు 8



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


సాయిబాబాకు చిరిగిన కఫ్నీయే చీనాంబరం. సాయి సోదరుడైన షేగాం  మహారాజుకు అది కూడా  లేదు. ఆయన పరిపూర్ణ అవధూత.

సాయి ఎల్లప్పుడూ “అల్లా మాలిక్” అనేవాడు. గజానన్ మహారాజు “గంగం గణాంబోతే” అనే వాడు.

సాయిబాబా ద్వారకామాయిలో గల కొలంబా నుండి ఆహారం తీసుకునేవాడు. ఆ కొలంబా నుండే జంతు జాలం కూడా ఆహారం తీసుకునేవి.

ఇతరులు తిని పారవేసిన విస్తరిలోని మెతుకులను గజానన్ మహారాజు తినేవాడు.

సాయి పాదాల నుండి గంగా యమునలు స్రవించాయి. నర్మదామాత జాలరి రూపంలో దర్శనమిచ్చి నమస్కరించి వెళ్లిపోయింది గజానన్ మహారాజుకు.

సాయినాథుని తల్లిదండ్రలు, గురువు, కుల గోత్రాలు ఎవరికీ తెలియవు. గజానన్ మహారాజు విషయంలో కూడా అంతే.

ఇద్దరిలోను కనిపించేది ఆర్తత్రాణ పరాయణత్వమే. మరో విషయమేమిటంటే, వారిద్దరూ సమాధి చెందిన తరువాత కూడా ఆర్తత్రాణ పరాయణత్వం కొనసాగటం.

సాయిబాబా రెండేళ్ల ముందటే తాను మహాసమాధి చెందుతానని సూచించాడు. “ఈ నాడే నా సీమోల్లంఘనం” అని.

గజానన్ కొంచెం ముందుగా సూచించాడు. సెప్టెంబర్ 8, 1910 వినాయక చవితి.

“గణపతిని ఈ నాడు పూజించండి. నా పార్థివ దేహాన్ని కూడా ఉత్సాహంతో విసర్జన చేయండి. కొంచెం కూడా శోకం, దుఃఖం కలుగకూడదు. ఈ చోట మీ రక్షణ కోసం నా అస్తిత్వం ఎప్పుడూ ఉండనే ఉంటుంది. భక్తులను మరచిపోయే ప్రసక్తి ఉండనే ఉండదు” అన్నారు గజానన్ మహారాజు.

సాయిబాబా విజయదశమి నాడే (ఏకాదశి ఘడియలలో) కన్ను మూశారు. గజానన్ రుషిపంచమి నాడు దేహాన్ని విసర్జించారు.

సాయి మహాసమాధి చెందిన తరువాత వారి శరీరాన్ని సమాధి మందిరంలో భక్తుల సందర్శనార్థం ఉంచగా, సాయిబాబా నోటి నుండి కొంచెం రక్తం వచ్చింది.

గజానన మహారాజ్ మహాసమాధి చెందిన సమయంలో సాయిబాబా ఎంతగానో విలపించారు. అది సాయినాథుడు తన సోదరునిపై చూపే అభిమాననానికి గుర్తు.

ఆంగ్ల కాలమానం ప్రకారం 8. 9 .1910. ఈ నాడు సెప్టెంబర్ 8. గజాననుల మహాసమాధి దినం.

గజాననులకు ప్రీతి పాత్రమైన “గంగం గణగణాంత బోతే “ అంటూ స్మరిద్దాం!

Written by: Mullapudi Panduranga Sainath &  Munnaloori Bose.

Collected and Presented By: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles