శ్రీ గజానన్ మహరాజ్



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు

సద్గురువులలోకెల్ల అగ్రేసరులైన సాయిబాబా వలన ఎందరు పూర్ణ పురుషులయ్యారో స్పష్టంగా తెలియడంలేదు. ప్రోద్దు గ్రుంకిన కొద్దీ నక్షత్రాలొక్కొక్కటే, ఆకాశంలో ప్రకటమైనట్లు, కాలం గడుస్తుంటే శ్రీసాయి వలన పూర్ణులైన వారి సంగతులొక్కక్కటే బయటకొస్తున్నాయి. అటువంటి ఒక పూర్ణ పురుషుడు గజానన్ మహరాజ్ గురించి క్లుప్తంగా మీ కోసం….

గజానన్ మహరాజ్

గజానన్ పట్టేకర్ అను యువకునికి 8వ యేట ఉపనయనం చేశాక, అతని పినతండ్రి అతనికి మహనీయుల దర్శనము, ఆశీస్సులు యిప్పించడానికి అతనిని షహపూర్ వద్ద నది ఒడ్డున వున్న ఔదంబర వృక్షం క్రింద విడిది చేసిన ముగ్గురు సాధువుల వద్దకు తీసుకువెళ్ళి, వారికి నమస్కారం చేయించాడు. వారిలో ఒకరు గురుకృప వలన పట్టేకర్, మహనీయుడు అవుతాడని ఆశీర్వదించారు. 

తర్వాత అతని కుటుంబానికి సుపరిచితుడైన నానాచందోర్కర్ శిరిడీ దర్శించినప్పుడు బాబా, “నీ మిత్రుని కొడుకు గజానన్ నన్ను షహపూర్లో నది ఒడ్డునున్న ఔదుంబర వృక్షం క్రింద దర్శించుకున్నాడు. నేనపుడతనిని ఆశీర్వదించాను. అపుడు నాతో కూడా గురుసిద్ధారూఢులు (హుబ్లీ), కళ్యాణ్ నివాసియైన రామ్ మారుతీ స్వామికూడ వున్నారు.

నీవుగూడ అవకాశమున్నప్పుడల్లా అక్కడ నదిలో స్నానం చేసి అచటి నా స్థానాన్ని గూడ దర్శించుకో!” అని చెప్పి పట్టేకర్ కు ప్రసాదంగా పాలకోవా పంపారు. ఆ మాటవిని ఆశ్చర్యపోయాడు నానాచందోర్కర్.

తరువాత అతడు హేమద్పంత్ తో కలిసి మళ్ళీ శిరిడీ వెళ్ళినపుడు సాయి, “మీ గజానన్ ఆ మారుతి ఆలయంలో యింకెంత కాలముంటాడు?” అన్నారు. తర్వాత హేమాద్పంతు, “సాయి సచ్చరిత్ర” ప్రతిని షహపూర్లోని ఆ ఉదుంబర వృక్షంక్రింద వుంచి పూజించాడు. అంగోన్ కా వాడ్ కు చెందిన సఖారం మహరాజ్, గాడ్లే మహరాజ్ మొన మహాత్ములు గూడ ఆ చెట్టుక్రింద తపస్సు చేసుకున్నారు.

తర్వాత సాయి చెప్పినట్లే గజానన్ పట్టేకర్ ఎందరో మహనీయులను దర్శించి, రత్నగిరి జిల్లాలోని పటగాం నివాసియైన శ్రీ దాదా మహరాజ్ అను మహనీయుని అనుగ్రహానికి పాత్రుడై, తర్వాత గజానన్ మహరాజ్ గా ప్రసిద్ధికెక్కారు. 

అలనాడు సాయితో కలిసి ఆ వృక్షంక్రింద అతనికి దర్శనమిచ్చిన రామ్ మారుతీ మహరాజ్ సాక్షాతూ మారుతియేనని చెప్పి, అక్కల్కోట స్వామిగూడ కొందరు భక్తులను వారి దర్శనానికి పంపేవారు. ఈ రామమారుతి మహరాజ్ తమ భక్తులతో శ్రీ గురుసిద్ధారూఢులు, శ్రీ సాయిబాబా వేరుకాదని తెల్చే ఎన్నో అనుభవాలు చెబుతుండేవారు.

రేపు మరో పూర్ణ పురుషుడు శ్రీరామ మారుతీ మహరాజ్ గురించి……

సర్వం సాయినాథర్పాణమస్తు 

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles