శ్రీ సాయి దత్తావతారం రెండవ బాగం – శ్రీ గాడ్గే మహరాజ్ ని శ్రీ సాయి అనుగ్రహించుట



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు

రెండవసారి బాబా శిరిడీ చేరేనాటికే వారు పరిపూర్ణులని తెలిపే సంఘటన ఒకటి సాయికి ప్రత్యక్ష భక్తుడైన దామోదర్ రాస్నేగారి కుమారుడు నానాసాహెబ్ రాస్నే ఎక్కిరాల భరద్వాజ గారికి ఇలా చెప్పారు. నానాసాహెబ్ రాస్నే శ్రీ గాడ్జి మహరాజ్ అనే మహాత్మునికి తన యింట అతిథ్యమిచ్చి, వారి గురు సేవ గురించి అడిగితే ఆయనిలా చెప్పారట

“మేము సామాన్యంగా ఆ వృత్తాంతము ఎవ్వరికీ చెప్పము” మా తల్లిదండ్రులు చాకలి వారు షేవ్ గాంవ్ పతర్జీ అనే ఊళ్ళో ఒక బట్టల దుకాణంలో పనిచేసేవాణ్ణి. ఒకరోజు దివ్య వర్ఛస్సు గల ఫకీరొకరు ఆ గ్రామానికి వచ్చారు. ఆయన సేలూ మాన్యత్ నుండి వచ్చారట ఆయన ముస్లిమన్నభావంతో ఎవరూ భిక్ష వేయలేదు.

మా దుకాణంలోగూడ యజమాని లేడు పొమ్మన్నారు. నాకు ఆయనను చూస్తూనే భిక్ష వేయాలనిపించి, పరుగున పోయి రొట్టెలు, కూర తెచ్చేసరికి ఆయన వెళ్ళిపోయారు. నేను ఆయనను వెతుకుతూ పోయేసరికి ఆయన ఒక ఏకాంత స్థలములో కూర్చొని చేనులోని జొన్న కంకులు కోసుకుని తింటున్నారు. నన్ను చూచి కోపంతో.

“నీవిక్కడికి ఎందుకొచ్చావ్?” అని గర్జించారు.

” మీకెవరూ భిక్ష వేయలేదని గమనించి యింటి నుంచి భిక్ష తెచ్చాను” అన్నాను.

“ఓహో! నేనేమి కోరితే అదిస్తావా ఏం?” అని ఎత్తిపొడుపుగా అన్నారు.

“నా దగ్గర లేని డబ్బు తప్ప మీరేమి కోరినా యిస్తాను” అన్నాను.

“అయితే నీ ప్రాణమివ్వు అన్నారు” పంతంగా,

‘అది నేనివ్వగలిగింది కాదు. మీరే తీసుకోండి. నాకీ జీవితమంటే విరక్తి పుట్టింది’ అన్నాను.

ఆ ఫకీరు నవ్వి, నా తలపై చేయి పెట్టి ఆశీర్వదించారు. వెంటనే నా హృదయంలో చెప్పలేని మార్పు వచ్చింది. వారి సన్నిధి తప్ప మరేమీ కావాలన్పించ లేదు. వారికి భిక్ష యిచ్చాక యింటికి వెళ్ళి, నాకొక గొప్ప గురువు దొరికారని, నేనిక సంసారంలో జీవించలేననీ చెప్పి, వేగంగా ఫకీరు వద్దకు చేరుకున్నాను.

ఆయన నన్ను చూస్తూనే ఉగ్రులై, “దుష్టుడా! నీకిచ్చింది చాలక యింకా పీడించుకు తినాలని వచ్చావే” అని గద్దించి, ఆ ప్రక్కనున్న శ్మశానంలోకి వెళ్ళారు.

నేను “మిమ్మల్ని విడిచి బ్రతుకలేను” అంటూ వారి ననుసరించాను.

అక్కడొక సమాధి ప్రక్కన గుంట త్రవ్వి, అందులో రెండు కుండలు నీరు పోయమన్నారు. నేను అలానే చేసాను. ఆయన ఆ నీరు మూడు దోసిళ్ళ త్రాగి, నన్నూ త్రాగమన్నారు. అవి త్రాగగానే నాకు చాలాసేపు బాహ్యస్మృతి లేకుండా పోయింది. నాకు స్పృహ వచ్చేసరికి ఆయన ఎటో వెళ్ళిపోయారు.

నేను ఆయనకోసం చాలాకాలం వెదకి చివరకు శిరిడీలోని మశీదుకు చేరాను. లోపల తెరలు దించి వున్నాయి. అచ్చట ఫకీరు స్నానం చేస్తున్నారు. నేను తెర పైకెత్తి చూచాను. నన్ననుగ్రహించిన ఫకీరే ఆయన నన్ను చూస్తూనే పట్టరాని కోపంతో ఆయన, ‘లంజకొడకా! ఇప్పటికే నా రక్తమాంసాలు పీక్కుతిన్నావ్, ఎముకలు గూడా తినాలని వచ్చావట్రా?’ అని ఒక యిటుక విసిరారు.

అది నా నొసట తగిలి నెత్తురు కారింది. మరుక్షణమే ప్రేమగా ఆయన, “నిన్ను పూర్ణంగా అనుగ్రహించాను. భగవంతుని అనుగ్రహం నీకెప్పుడూ వుంటుంది, నిన్నందరూ దైవంగా కొలుస్తారు. ఇక నావెంట తిరుగవదు’ అన్నారు.

కొంతకాలానికి ఆయనే “శ్రీ గాడ్జి మహరాజ్గా” లోకపూజ్యులై ఎన్నో ధర్మశాలలు, పాఠశాలలు స్థాపించారు, వీరు సంకీర్తన చేస్తుంటే వేలాది భక్తులు చేరేవారు. ఆయన 1927 ప్రాంతంలో తమ భక్తులతో కలిసి సంకీర్తన చేసూ శిరిడీ చేరారు.

మధ్యలో ఆయన, “నేను మా వూరు వెళ్ళిపోతున్నాను” అని కేకలు వేస్తున్నారు. భక్తులతో కలసి ఆయన గూడ శిరిడీ వీధులు చిమ్మి తర్వాత సమాధి మందిరానికి ఉత్తరాన సంకీర్తన చేసారు.

చివరకు భక్తులతో “ఇదే మన ఆఖరి కలయిక” అని చెప్పి వెంటనే లేచి, కాలి నడకన నర్మదా తీరంలోని బదోచ్ చేరి అక్కడే మహాసమాధి చెందారు. అంటే సాయి మరలా శిరిడీ చేరేనాటికే సమరుడైన సద్గురువన్నమాట.

రేపు శ్రీ పాద శ్రీ వల్లభుడు సాయి ఒక్కరే. …

సర్వం సాయినాథర్పాణమస్తు 

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles