శ్రీ సాయి లీలామృత ధార – పోయిన స్కూటర్ దొరుకుతుందా లేదా? – రెండవ బాగం…



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు

శ్రీ సాయి లీలామృత ధార – పోయిన స్కూటర్ దొరుకుతుందా లేదా? – రెండవ బాగం…

“ఆంటీ, మీరేమీ మనసులో ఆందోళన చెందకండి.  స్కూటర్ తప్పకుండా దొరుకుతుంది. స్కూటర్ ఎలా ఉన్నది అలా దొరుకుతుంది.  కాని దానిని రిపేర్ చేయించడానికి వంద రూపాయలు ఖర్చు పెట్టాలి. కాని దొరుకుతుందనే ఆశ నాకుంది. రేపు నేను షిరిడీ వెడుతున్నాను.  బాబాని ప్రార్ధిస్తాను. మీరేమీ గాభరా పడకండి. బాబా స్కూటర్ దొరికేలా చేస్తారు. నాకు ఖచ్చితంగా ఆయన మీద నమ్మకం ఉంది” అన్నాను. 

అపుడామె, “స్కూటర్ రిపేర్ కి వెయ్యిరూపాయలు ఖర్చయినా ఫరవాలేదు. స్కూటర్ దొరికెతే చాలు” అన్నారు.  (ఇంతకు ముందు కోర్టు ఆవరణలో ఉంచిన 6,7 స్కూటర్లు పోయాయి. ఇంతవరకు ఏ ఒక్కటీ దొరకలేదు) స్కూటర్ మాత్రం దొరికి తీరుతుంది. బెంగ పెట్టుకోవద్దని చెప్పాను.

డైనింగ్ టేబుల్ దగ్గర స్కూటర్ దొంగతనం గురించి మళ్ళీ ప్రస్తావన వచ్చింది. మాకు పార్టీ ఏర్పాటు చేసిన జూనియర్ అడ్వొకేటు, “మాయా! నువ్వు గురువారం నాడు సాయిబాబా స్టిక్కరు స్కూటర్ కి అంటించావు. అందుకే స్కూటర్ పోయింది” అన్నాడు.

అతనన్న ఆ మాటలకి నాకు చాలా బాధ కలిగింది.  “సాయిబాబా స్టిక్కర్ ఉన్నందు వల్లే స్కూటర్ దొరుకుతుంది” అని నా మనసులో అనుకున్నాను. “మనసులో ఎటువంటి చింత పెట్టుకోకండి. నేను రేపు షిరిడీ వెడుతున్నాను.  నేను షిరిడీ నుండి తిరిగి వచ్చేటప్పటికి స్కూటర్ దొరుకుతుంది” అన్నాను.

అప్పుడు మరొక అడ్వొకేటు “స్కూటర్ దొరుకుతుందని అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలవు?” అన్నాడు.  “నా సాయిబాబా చాలా శక్తి కలవారు. నీకా భయం అక్కరలేదు” అన్నాను.

షిరిడీలో హుండీలో వేయడానికి అయ్యర్ గారి నుంచి  రూ.1.50 తీసుకున్నాను.  మరుసటి రోజే షిరిడీకి ప్రయాణమయ్యాను. షిరిడీ ఏ సమయంలో చేరుకున్నా గాని, అభిషేకానికి టిక్కెట్టు లభించేలా చేయమని, స్కూటర్ కూడా తప్పకుండా దొరికేలా చేయమని దారి పొడవునా బాబాని ప్రార్ధించుకుంటూనే ఉన్నాను.

షిరిడీ చేరుకోగానే అభిషేకానికి టిక్కెట్లు దొరకడంతో బాబాకి అభిషేకం చేయించాను. ఆ రోజు బాబా వారి వదనం ఎంతో ప్రకాశవంతంగా దివ్యంగా ఉంది. నేను ఇప్పటికి పదకొండుసార్లు షిరిడీ వచ్చాను. కాని ఇంతకు ముందెన్నడూ ఇటువంటి ప్రకాశవంతమయిన వెలుగు నాకు బాబా ముఖంలో కనపడలేదు.  ఆయన ముఖంలోని తేజోమయమయిన చిరునవ్వు కూడా చూడగలిగాను. స్కూటర్ దొరికేలా చేయమని ప్రార్ధించాను. అదే రోజు షిరిడీ నుండి తిరిగి వచ్చాను.

మరుసటి రోజు (సోమవారం) ఆఫీసుకు వెళ్ళాను.  స్కూటర్ దొరికిందనే వార్త ఏమీ రాలేదు. నేనింకా బాబాని ప్రార్ధిస్తూనే ఉన్నాను.   అఫీసు నుండి వచ్చాక బాబాతో, “ఏమిటి బాబా! ఇంకా స్కూటర్ దొరకలేదు” అని ఆయనకు చెప్పుకోవడం మొదలుపెట్టాను.

సాయంత్ర్రం 5.30 కి స్కూటర్ దొరికిందని శేఖర్ ఫోన్ చేశాడు. నా సంతోషానికి అవధులు లేవు. అదంతా సాయిబాబా దయవల్లనేనని చెప్పాను.  “అవును. మా ఇంటిలో అందరూ కూడా బాబా అనుగ్రహం వల్లే దొరికిందని అంటున్నారు” అన్నాడు.

నా గదిలో ఉన్న బాబా పటం వద్దకు వెళ్ళి ఆయన పాదాల వద్ద నా శిరసు నుంచి కన్నీళ్ళతో ఆయనకు నా కృతజ్ఞతలు తెలుపుకున్నాను.

సాయంత్రం ఆఫీసుకు వెళ్ళాను.  అయ్యర్ గారు “మాయా! నువ్వు షిరిడీ వెడుతూ 24 గంటల్లో స్కూటర్ దొరుకుతుందని చెప్పావు. నువ్వు చెప్పినట్లే దొరికింది. నిజంగా సాయిబాబా దయవల్లే పోయిన స్కూటర్ దొరికింది” అని ఎంతో సంతోషంతో చెప్పారు.

మెయిన్ రోడ్డులో ఉన్న ‘వండర్ లాండ్’ భవనం వద్ద శనివారం సాయంత్రం పోలీసులు స్కూటర్ని కనిపెట్టారు. సాయిబాబాకి అయ్యర్ గారి నుంచి రూ.2.50 తీసుకున్నాను. ఇంతవరకు ఎవ్వరికీ కూడా పోయిన తమ స్కూటర్లు దొరకకపోవడంతో అందరూ చాలా ఆశ్చర్యపోయారు.

మరునాడు ఆఫీసుకు వచ్చిన జూనియర్ అడ్వొకేటుతో, “స్కూటర్ దొరికింది.  సాయిబాబా స్టిక్కర్ అంటించిన తరవాతే స్కూటర్ పోయిందని అన్నావు.  కాని నేను చెబుతున్నాను, సాయిబాబా స్టిక్కర్ అంటించినందువల్లనే స్కూటర్ ఏమీ పాడవకుండా దొరికింద”ని అనగానే అతను ఇంకేమీ మాట్లాడలేకపోయాడు.

నిజమే, సాయిబాబాయే స్కూటర్ దొరికేలా చేశారు. స్కూటర్ లో పెట్రోల్ అయిపోవడం వల్ల స్కూటర్ ఎలా ఉన్నది అలా ఉన్నట్లు దొరకడమే కాక అంటించిన స్టిక్కర్ కూడా చెక్కు చెదరకుండా ఉంది.

ఇంతటి అద్భుతం చేసి చూపించిన సాయిబాబాకి కోటి కోటి ప్రణామాలు.  “మీ బరువు బాధ్యతలన్నిటినీ ఆయన భుజస్కంధాలపై పెట్టండి. ఆ భారం ఆయన మోస్తారు.”

తప్పిపోయన చాంద్ పాటిల్ గుఱ్ఱాన్ని సాయిబాబా చూపించారు (శ్రీ సాయి సత్ చరిత్ర 5వ అధ్యాయం). పోయిన స్కూటర్ ఇక దొరకదని నిర్ణయించుకుని కొత్త స్కూటర్ కొందామనుకుంటున్న అయ్యర్ గారికి స్కూటర్ దొరికేలా చేశారు.

నా సద్గురు సాయిబాబాకి మరొక్కసారి నా సాష్టాంగ ప్రణామాలు.

కుమారి మాయా సాధ్వాని,

పూనా

ఈ సమాచారం ఈ  లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.

సర్వం సాయినాథర్పాణమస్తు 

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Have any Question or Comment?

0 comments on “శ్రీ సాయి లీలామృత ధార – పోయిన స్కూటర్ దొరుకుతుందా లేదా? – రెండవ బాగం…

http://saileelas.com/m/sounds/view/03-chapterMp3
03 chapterMp3
శ్రీ సాయి సచ్చరిత్రము… తెలుగు OVI TO OVI ….మూడవ అధ్యాయం ..మరాఠి మూలం శ్రీ అన్నాసాహెబ్ దాభోల్కర్ …. తెలుగు అనువాదం కుమారి మణెమ్మ ….. ధ్వని అనుకరణ శ్రీ శ్రీనివాస ప్రసాద్

Comments are closed for this post !!

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles