శ్రీ సాయి లీలామృత ధార – షిరిడీలో నా మొదటి అనుభవం



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు

శ్రీ సాయి లీలామృత  ధార – షిరిడీలో నా మొదటి అనుభవం

ఈరోజు, సాయిలీల మాసపత్రిక నవంబరు, 1974వ సంవత్సరం సంచికలో ప్రచురింపబడిన మరొక అద్భుతమైన సాయి లీల.  బాబా వారు  ఒక్కొక్కసారి  అదృశ్యంగా మన దగ్గరకు వచ్చి సహాయం చేస్తారన్న విషయం ఈ లీల చదివిన తరువాత మనం గ్రహించుకోవచ్చు.

  1. శ్రీ సాయి లీలామృత ధార – షిరిడీలో నా మొదటి అనుభవం

1972వ సంవత్సరం దీపావళి రోజులలో మా అబ్బాయికి జ్వరం వచ్చి టెంపరేచర్ 104 డిగ్రీల పైదాకా వుంది.  మేము బాబాని ప్రార్థించి రక్షించమని వేడుకున్నాము.  అబ్బాయికి జ్వరం తగ్గితే సంవత్సరం లోపు షిరిడీ వస్తామని మొక్కుకున్నాము.  బాబా దయవల్ల అబ్బాయికి తొందరలోనే జ్వరం తగ్గి ఆరోగ్యవంతుడయ్యాడు. 

కొన్ని కారణాంతరాలవల్ల మేము అనుకున్న మొక్కు ప్రకారం షిరిడీ వెళ్ళలేకపోయాము.  1973వ సంవత్సరం దీపావళి రోజులు కూడా సమీపిస్తుండంతో సంవత్సరం పూర్తవకుండా మా మొక్కును తీర్చేసుకోవాలనుకున్నాము.

కాని మా మూడు నెలల పాపతో అంత దూరం ప్రయాణం చేయాలంటే కాస్త భయంగానే ఉంది.  కానీ బాబా మీద భారం వేసి పది రోజులు ముందుగానే టికెట్స్ రిజర్వ్ చేయించాము.  దురదృష్టవశాత్తు పాపకు డయేరియా వచ్చింది.  మంచి మందులు వాడినా గుణం కన్పించలేదు.  అయిదు రోజుల దాకా చూశాము,

కానీ పాప ఆరోగ్యంలో ఎటువంటి మార్పులేకపోవడంతో అయిష్టంగానే టికెట్స్  రద్దు చేయించాను.  చాలా బాధ కలిగింది.  కానీ, విచిత్రంగా రెండు రోజులలోనే పాపకు విరోచనాలు తగ్గిపోయాయి.  వెంటనే మరలా ఇంతకు ముందు అనుకున్న రోజుకే టికెట్స్ రిజర్వ్ చేయించాను.  షిరిడీకి రాను పోను ప్రయాణం అంతా ఎటువంటి కష్టం లేకుండా జరిగింది.  షిరిడీలో మూడు రాత్రులు గడిపాము.  అక్కడ ఉన్న మూడు రోజులూ ఎంతటి ప్రశాంతతను అనుభవించామో అది వర్ణించడానికి సాధ్యం కాదు.

మంగళవారం నాడు మేము షిరిడీ చేరుకున్నాము.  బుధవారం రాత్రి పడుకునే ముందు బాబాను ఇలా ప్రార్థించాను, “బాబా! తెల్లవారుఝాము (గురువారం) నాలుగు గంటలకే నాకు మెలకువ వచ్చేలా చేయి.  స్నానం పూర్తి చేసుకుని తయారయి అయిదు గంటలకల్లా సమాధి మందిరానికి వచ్చి నీ కాకడ ఆరతిని, అభిషేకాన్ని దర్శించే అవకాశం కలిగించు”.  ప్రార్థించుకున్న తరువాత ప్రశాంతంగా నిద్రపోయాను. గాఢనిద్ర పట్టేసింది.

ఒక్కసారిగా ఎవరిదో చేయి నా వీపు మీద పడి నన్ను తోసి, లేచి కూర్చునేలా చేసింది.  నాకు చాలా ఆశ్చర్యం కలిగింది.  నా వీపు మీద చేయి వేసి తోసిందెవరా అని లేచి కూర్చుని లైటు వేసాను.  నా భార్యా పిల్లలు గాఢ నిద్రలో ఉన్నారు.  ఓహ్! అప్పుడే గుడి గంట నాలుగు సార్లు మ్రోగింది.  వాచీలో టైమెంతయిందోనని చూశాను.  సరిగా నాలుగు గంటలవడానికి ఒక నిమిషం ఉంది!!! బాబా తప్ప నన్నెవరు లేపగలరు?

త్రికరణశుధ్ధిగా ఆయనను ప్రార్థించి శరణాగతి వేడితే బాబా తానే స్వయంగా వచ్చి తన భక్తులకు ఎటువంటి సహాయాన్నయినా అందిస్తారనే విషయం ఈ అనుభవం ద్వారా నాకు ఋజువయింది.

దీనిని బట్టి బాబా మహాసమాధి చెందిన 55 సంవత్సరాల తరువాత కూడా బాబా సశరీరంగా దర్శనాన్నిస్తారన్న దానికి ఇది నా రెండవ అనుభవం.

ఇంకా ఆయన మా మీద కురిపించిన అనుగ్రహం – అభిషేకానికి మొదటి టిక్కెట్ మాకే లభింపచేయడం.  దీపావళి రోజున బాబాకు అభిషేకం, అర్చన మొట్టమొదటగా మాచేత చేయించుకున్నారు బాబా. 

ఆయన  నిరంతరం మా మీద కురిపిస్తున్న అనుగ్రహానికి మేమెంతో అదృష్టవంతులమని భావిస్తున్నాను.

సి. కె. రామనాధ్ చెట్టి

హైదరాబాదు – 500 027

త్యాగరాజు గారు నరసాపురంలో వుండేటప్పుడు జరిగిన లీల ఇలా చెప్తున్నారు. అక్కడ ప్రతి శనివారం శ్రీ సాయిబాబా సత్సంగం చేసుకుంటూ ఉండేవాళ్ళం. మా సత్సంగంలో దాదాపు 60 మంది పైదాకా సభ్యులం ఉండేవారం. అందులో ఒక సభ్యురాలు ఒకరోజు తమ అనుభవం చెప్పారు.

ఆవిడ ప్రతిరోజూ ఉదయం నాలుగు గంటలకే నిద్రలేచేవారు. లేచి బాబా వారి ఆరతి పాట పెట్టేవారు.  ఒకరోజు రాత్రి ఆలస్యంగా పడుకోవడంవల్ల లేవలేకపోయారు.  అప్పుడు నాలుగు గంటలకు ‘లే, లే’ అని ఎవరో లేపినట్లయింది.   నిద్ర నుండి లేపినది బాబా వారు.  ఇది చదివిన తరువాత నాకు ఈ సంఘటన గుర్తుకు వచ్చింది.

ఈ సమాచారం ఈ  లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.

సర్వం సాయినాథర్పాణమస్తు 

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Have any Question or Comment?

0 comments on “శ్రీ సాయి లీలామృత ధార – షిరిడీలో నా మొదటి అనుభవం

Maruthi

Sai Baba…Sai Baba

Comments are closed for this post !!

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles