శ్రీ సాయి లీలామృత ధార – శ్రీ షిరిడీ సాయి విభూతి లీల – మొదటి బాగం….



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు

శ్రీ సాయి లీలామృత ధార – శ్రీ షిరిడీ సాయి విభూతి లీల – మొదటి బాగం….

బాబా గారు చేసే వైద్యం చాలా విచిత్రంగా ఉంటుందని శ్రీసాయి సత్ చరిత్ర పారాయణ చేస్తున్న మనకందరికీ తెలుసు. ఉదాహరణకి 13వ అధ్యాయంలో భీమాజీ పాటిల్ క్షయ రోగాన్ని చాలా విచిత్రంగా నయం చేశారు. అతను షిరిడీలో ఉన్నప్పుడు బాబా అతనికి రెండు స్వప్నానుభవాలనిచ్చి, రోగాన్ని కుదిర్చారు.

మొదటి స్వప్నంలో అతను ఒక పాఠశాల విద్యార్ధిగా పద్యాలని కంఠోపాఠము చేయకపోవటం చేత, బాబా క్లాసు ఉపాధ్యాయునిగా  దెబ్బలు కొట్టినట్లు కనిపించారు. రెండవ స్వప్నంలో ఒక గృహస్థునిగా కనిపించి అతని చాతీపై పెద్ద బండను వేసి క్రిందకు మీదకు తోయడం వల్ల మిక్కిలి బాధననుభవించాడు.  స్వప్నంలో పడిన ఈ బాధలతో అతని జబ్బు నయమైంది.

ఈ రోజు మీరు చదవబోయే ఈ అద్భుతమైన లీలలో బాబా ఏవిధంగా వైద్యం చేశారో చూడండి.

షిరిడీ ధునిలోని పవిత్రమయిన ఊదీ ఎంతో అద్భుతంగా ఎన్నో రోగాలని నివారిస్తోంది. ఎవరయితే సాయిబాబా వారి మీద అచంచలమయిన విశ్వాసం ఉంచి ఆయననే ధ్యానిస్తూ ఉంటారో వారి కష్టాలన్నీ అనుమానం లేకుండా తొలగిపోతాయి. సాయిబాబా వారి ఊదీ యొక్క అద్భుత శక్తి ఎటువంటిదో ఈ సంఘటన ద్వారా తెలుస్తుంది.

సికిందరాబాద్ బోలారంలో నివాసం ఉంటున్న జనార్ధన రెడ్డిగారు కంట్రాక్టరు. మొదట్లో ఆయనకు సాయిబాబా అంటే నమ్మకం లేదు.  కాని, ఆయన భార్య సులోచనాదేవికి సాయిబాబా మీద సంపూర్ణమయిన భక్తి విశ్వాసాలు. ఆమె ప్రతిరోజు సాయిబాబాని ఎంతో భక్తి ప్రపత్తులతో పూజ చేస్తూ ఉండేది.

జనార్ధనరెడ్డికి సిగరెట్లు కాల్చడం, త్రాగుడు ఇటువంటి చెడు లక్షణాలన్నీ ఉన్నాయి.  విపరీతమయిన త్రాగుడు వల్ల అతనికి కామెర్లు వచ్చాయి. కిడ్నీలు కూడా పాడయ్యి, చక్కెర వ్యాధి కూడా వచ్చింది. కాని ఈ విషయాలేమీ తన కుటుంబ సభ్యులకి చెప్పలేదు.

1965 మే 14 వ తారీకు ఉదయం 7 గంటలకి అతని ఆరోగ్యం దిగజారిపోయింది. అతనిని ఉస్మానియా ఆస్పత్రిలో చేర్పించారు.  అప్పటికి జనార్ధనరెడ్డి వయస్సు కేవలం 32 సంవత్సరాలు. అతనికి రక్తం, గ్లూకోజు ఎక్కించడం మొదలుపెట్టారు.  నీరుడు బంధించడం వల్ల గొట్టం ద్వారా మూత్రాన్ని తీయాల్సిన పరిస్థితి వచ్చింది. రోజు రోజుకి అతని ఆరోగ్యం క్షీణిస్తూ ఉండటంతో అతని స్థితిని చూసి పిల్లలు బాగా భయపడిపోయారు.  అతను కోమాలోకి వెళ్ళిపోయాడు.  వైద్యులు కూడా అతను బ్రతుకుతాడనే ఆశ వదిలేశారు.

అతని భార్య సులోచనా దేవి సద్గురు డా.సాయి కుమార్ దగ్గరకు వెళ్ళి తన భర్తను ఒక్కసారి వచ్చి చూడమని వేడుకుంది. సద్గురు ఆస్పత్రికి వెళ్ళి ఆమె భర్తని పరీక్షించారు. పరీక్షించి “బ్రతికే అవకాశం చాలా తక్కువ. ఇక భగవంతుడే ఆయనను కాపాడాలి” అన్నారు. ఎలాగయినా తన భర్తను బ్రతికించమని సులోచన చేతులు జోడించి సద్గురుని వేడుకుంది. అప్పుడాయన “నా చేతుల్లో ఏమీ లేదమ్మా!  బాబాయే నీకు సహాయం చేయాలి” అని చెప్పి తన జేబులోనుండి చిన్న విభూతి పొట్లం తీసి  ఆమెకిచ్చారు.

సద్గురు చెప్పినట్లుగానే, సులోచనాదేవి భక్తితో “ఓమ్ సాయి, షిరిడీ సాయి, ద్వారకామాయి” అని జపిస్తూ భర్త కాళ్ళకి, ఛాతీకి, పొట్టకి, నడుముకి విభూతిని రాసింది. తన భర్తని బ్రతికించుకోవడానికి రాత్రి ఒంటిగంట వరకు అదే మంత్రాన్ని జపిస్తూ కూర్చుంది.  ఆ తరువాత ఆమెకు నిద్రవచ్చి తెల్లవారుఝాము మూడు గంటల వరకు నిద్రపోయింది.

ఈ సమయంలో అంటే రాత్రి ఒంటి గంట నుంచి మూడు గంటల మధ్యలో జనార్ధనరెడ్డికి ఒక విచిత్రమయిన కల వచ్చింది. సాయిబాబా అతనికి కలలో కనిపించి అతని ముక్కు రంధ్రాలలో మూలికల ద్రవం పోశారు.

సులోచనాదేవికి మూడు గంటలకు మెలకువ వచ్చి చూసేసరికి భర్త పడుకున్న తలగడ తడిసిపోయి పసుపు పచ్చగా కనిపించింది.  అతని ముక్కు నుండి పసుపు పచ్చటి ద్రవం కారుతూ ఉంది. సులోచనాదేవి భయపడిపోయి విధి నిర్వహణలో(డ్యూటీ డాక్టర్) ఉన్న వైద్యుడిని వెంటనే పిలిచింది.  వారు పరీక్షించి, రెడ్డిగారి నాడి కొట్టుకోవడంలో కాస్త గుణం కనిపించిందని చెప్పారు.

కాని, ఇందులో సాయిబాబా వారి ప్రమేయం ఉందని వారికి తెలీదు.  మరుసటి రోజు జనార్ధన రెడ్డి గారు కాస్త స్పృహలోకి వచ్చారు.  మరలా అతని ముక్కులో నుంచి పసుపు పచ్చటి ద్రవం కారసాగింది. వైద్యులు బాగా పరీక్షించారు. కాని ఆ విధంగా ఎందుకు జరుగుతోందని మాత్రం కనుక్కోలేకపోయారు.

మూడవ రోజు రాత్రి మరొక అత్యద్భుతమయిన సంఘటన జరిగింది.

రేపు తరువాయి బాగం…..

ఈ సమాచారం ఈ  లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.

సర్వం సాయినాథర్పాణమస్తు 

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Have any Question or Comment?

0 comments on “శ్రీ సాయి లీలామృత ధార – శ్రీ షిరిడీ సాయి విభూతి లీల – మొదటి బాగం….

Maruthi

Sai Baba… Sai Baba…Sai Baba…Sai Baba…Sai Baba…Sai Baba…Sai Baba…Sai Baba

http://saileelas.com/m/sounds/view/03-chapterMp3
03 chapterMp3
శ్రీ సాయి సచ్చరిత్రము… తెలుగు OVI TO OVI ….మూడవ అధ్యాయం ..మరాఠి మూలం శ్రీ అన్నాసాహెబ్ దాభోల్కర్ …. తెలుగు అనువాదం కుమారి మణెమ్మ ….. ధ్వని అనుకరణ శ్రీ శ్రీనివాస ప్రసాద్

Comments are closed for this post !!

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles