Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు
శ్రీ సాయి లీలామృత ధార – శ్రీ షిరిడీ సాయి విభూతి లీల – రెండవ బాగం….
మూడవరోజు రాత్రి మరొక అత్యద్భుతమయిన సంఘటన జరిగింది. ఇంతకుముందు చెప్పినట్లుగానే సులోచనాదేవి భర్త శరీరానికంతా ఊదీ రాస్తూ, మంచం మీద చివర కూర్చుని “ఓమ్ సాయి, షిరిడీసాయి, ద్వారకామాయి” అనే మంత్రాన్ని జపిస్తూ ఉంది.
అర్ధరాత్రికి ఆయనకి మరొక విచిత్రమయిన కల వచ్చింది. బాబా ఆయనకి కలలో దర్శనమిచ్చి, తన పవిత్ర హస్తంతో అతని శరీరమంతా విభూతిని రాశారు. ఆ తరువాత అతనిని తన కాలితో ఒక్క తాపు తన్నారు. పెద్ద శబ్దంతో జనార్ధన రెడ్డి మంచం మీద నుండి పడ్దారు.
ఆ శబ్దానికి మంత్ర జపం చేస్తూ ఉన్న సులోచనాదేవి కళ్ళు తెరచి చూసింది. భర్త నేల మీద పడి ఉండటం చూసి ఆశ్చర్యం పోయింది. అతనికి ఆక్సిజన్ ఇవ్వడానికి పెట్టిన (ట్యూబ్స్) గొట్టాలు, గ్లూకోజు, రక్తం ఎక్కించడానికి అమర్చిన గొట్టాలు, యూరిన్ తీయడానికి అమర్చిన గొట్టం, అన్నీ కూడా ఎంతో నేర్పరితనంతో జాగ్రత్తగా ఎవరో తీసినట్లుగా మంచం మీద ఉన్నాయి.
తన భర్త బ్రతికి ఉన్నాడా, లేదా అని చూడటానికి దగ్గరకు వెళ్ళింది. తన భర్త సాయిబాబా నామాన్ని జపిస్తూ ఉండటం చూసి ఆమెకు ఆనందాశ్చర్యాలు కలిగాయి.
“దయచేసి అందరూ కూడా ‘ఓమ్ సాయి షిరిడి సాయి, ద్వారకామాయి’ అంటూ ఆయన మంత్రాన్ని జపిస్తూనే ఉండండి. బాబా, నన్ను వదలి వెళ్ళద్దు” అని భర్త నోటి నుండి ఈ మాటలు వెలువడుతున్నాయి.
అంతవరకు బాబా అంటే నమ్మకం లేని తన భర్త నోటివెంట ఈ మాటలు విన్న సులోచనాదేవికి చాలా విస్మయం కలిగింది. కళ్ళల్లోంచి ఆనంద భాష్పాలు ఆపుకోలేనంతగా కారసాగాయి.
జనార్ధనరెడ్డి మాట్లాడటం చూసి వైద్యులు కూడా చాలా ఆశ్చర్యపోయారు. ఆక్సిజన్, గ్లూకోజు, రక్తం ఎక్కించే గొట్టాలని ఎవరు తీశారని జనార్ధనరెడ్డిని అడిగారు. “నా సాయిబాబా రాత్రి వచ్చారు. ఆయనే అన్నీ తీసేశారు” అని సమాధానమిచ్చారు జనార్ధనరెడ్డి.
జనార్ధన రెడ్డి అన్న మాటలు వైద్యులకి అర్ధం కాలేదు. ప్రధాన వైద్యుడు కూడా జనార్ధనరెడ్డి కేసు ఏమిటన్నది నిర్ధారణ చేయలేకపోయాడు. జనార్ధనరెడ్డి శ్వాస తీసుకోవడంలో చాలా గుణం కనపడింది. ఇక ఆక్సిజన్ గాని, రక్తం ఎక్కించడం గాని అవసరం లేదని తేల్చారు. అసలు ఇదంతా ఎలా సాధ్యమయిందని చాలా ఆశ్చర్యం కలిగింది అందరికీ.
శ్వాస తీసుకోవడంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా త్వరగానే కోలుకున్నాడు. రెండు వారాలలోనే జనార్ధన రెడ్డి పూర్తిగా కోలుకున్నాడు. ఎక్స్-రే, రక్త పరీక్ష, యూరిన్ పరీక్ష అన్నీ చేశారు. రిపోర్టులన్నీ నార్మల్ గా ఉన్నాయి. పూర్తి ఆరోగ్యం చేకూరడంతో ఆస్పత్రి నుంచి డిశ్ఛార్జి చేశారు.
ఇంతవరకు బాబాని ఒక సామాన్య ఫకీరు గానే భావించిన జనార్ధనరెడ్డి బాబాని హృదయ పూర్వకంగాను, ప్రేమతోను, భక్తితోను, ఆరాధించడం మొదలుపెట్టాడు. సిగరెట్లు కాల్చడం, మందు త్రాగడం లాంటి చెడు లక్షణాలన్నిటినీ పూర్తిగా వదిలేసి బాబాకు అంకిత భక్తునిగా మారాడు. సులోచనాదేవి భర్తని సద్గురు గారి దగ్గరకు తీసుకుని వచ్చి ఆయనకు తన కృతజ్ఞతలు తెలుపుకుంది.
షిరిడీ సాయిబాబా వారి గొప్పతనాన్ని, ఆయన చేసే అద్భుతమైన లీలలను నేను వర్ణించలేను. స్వచ్ఛమయిన మనసుతో తన భక్తులు పిలిచిన వెంటనే ఆయన స్పందిస్తారు.
ఎవరి ఊదీ అయితే వేలాది మంది భక్తులకి ఎంతో ప్రయోజనాన్ని కలిగిస్తొందో, ఆ ఊదీని ప్రసాదించిన సాయిబాబా వారికి మనం ఎప్పుడూ విధేయులమై ఉండాలి.
సర్వాంతర్యామి అయిన సాయిబాబా ఇష్టానికే అన్నీ వదలివేసిన జనార్ధనరెడ్డి, సులోచనాదేవి, వారి పిల్లలు ఇప్పుడు ఆనందంగా సుఖ సంతోషాలతో జీవిస్తున్నారు.
డా.కె. రామ్ కుమార్
కార్యదర్శి, సాయి కుమార్ వ్యాధి నివారణ ఆశ్రమం
సికిందరాబాదు.
బాబా గారు జీవించి ఉన్నప్పుడు, ఆయన మహాసమాధి చెందిన తరువాత కూడా తన భక్తులకు ఇన్ని అనుభవాలనిచ్చి కాపాడుతున్నారని మనకందరికీ తెలుసు. ఈ అనుభూతులను పొందిన భక్తులంతా తమకు బాబా అనుభూతులను, అనుభవాలను ఇచ్చారనీ, తామెంతో ఆనందాన్ని పొందామనీ చెప్పినవన్నీ అసత్యాలు కావు. ఈ ప్రపంచంలో ఇంతమంది సాయి భక్తులు అసత్యవాదులేనా? అనుభవాలు, అనుభూతులు అనుభవించిన వారికే తెలుస్తాయి.
కొన్ని అనుభూతులను వర్ణించలేము. మరి నేటికీ షిరిడీకి తమ సద్గురువయిన బాబాను దర్శించుకోవడానికి లక్షల సంఖ్యలో భక్తులు వస్తున్నారే? మరి అటువంటప్పుడు కొంతమంది కాషాయధారులు బాబాని నిందించడం ఎంతవరకు సబబు? వారికి నమ్మకం లేకపోవుగాక, విమర్శించడం భావ్యం కాదు కదా. ఒక్కసారి ఆలోచించండి.
ఈ సమాచారం ఈ లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.
సర్వం సాయినాథర్పాణమస్తు
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- శ్రీ సాయి లీలామృత ధార – శ్రీ షిరిడీ సాయి విభూతి లీల – మొదటి బాగం….
- శ్రీ సాయి లీలామృత ధార – పోయిన స్కూటర్ దొరుకుతుందా లేదా? – రెండవ బాగం…
- శ్రీ సాయి లీలామృత ధార – పోయిన స్కూటర్ దొరుకుతుందా లేదా? – మొదటి బాగం…
- శ్రీ సాయి లీలామృత ధార – షిరిడీలో నా మొదటి అనుభవం
- శ్రీ సాయి దత్తావతారం రెండవ బాగం – శ్రీ గాడ్గే మహరాజ్ ని శ్రీ సాయి అనుగ్రహించుట
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
0 comments on “శ్రీ సాయి లీలామృత ధార – శ్రీ షిరిడీ సాయి విభూతి లీల – రెండవ బాగం….”
Maruthi
May 22, 2017 at 4:54 pmSai Baba…Sai Baba