Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు
సాయి భక్త సగుణమేరు నాయక్ – రెండవ బాగం…..
సగుణ్ మొదట శిరిడీ దర్శించి 5 నెలలు అక్కడే ఉన్న తరువాత శిరిడీని విడిచిపెట్టేందుకు బాబా అనుమతిని అడిగినప్పుడు, బాబా “ఏదో పని చేస్తూ ఇక్కడే ఉండు. దేవుని ఆశీర్వాదం లభిస్తుంది” అని చెప్పారు. అతను బాబా మాటను విశ్వసించి శిరిడీని జీవితపర్యంతం తన నివాసంగా చేసున్నాడు.
అప్పటినుండి అతను మశీదుకు ఎదురుగా టీ షాప్ మరియు ఫలహార దుకాణాలను నడుపడం ప్రారంభించాడు. ఆ షాప్ లో బాబా యొక్క చిత్రాలు, ఆరతి పుస్తకాలు మరియు ఇతర పూజ వస్తువులను అమ్ముతుండేవాడు. ‘శ్రీ సాయి సచ్చరిత’ గ్రంథంగా వెలువడినపుడు, ఆ గ్రంథాలను తన దుకాణంలో వుంచి అమ్మేవాడు సగుణ్. చివరికి షోలాపూర్ కి చెందిన ఫొటోగ్రాఫర్ నుండి బాబా ఫొటో ప్రింట్ లు సంపాదించి ఫ్రేం కట్టించి అమ్మేవాడు. అతను శిరిడీలో ఆ జీవితం ప్రారంభించిన నాటి నుండి సంపన్నుడయ్యాడు.
దుకాణం ప్రారంభించిన రోజు సగుణ్ ఒక లడ్డూ మరియూ కొంచెం ‘చివ్ డా’ (మరాఠి వంటకం) ఓ పళ్ళెంలో వుంచి బాబాకి సమర్పించాడు. బాబా కొంత రుచి చూసి, “బాగుంది. ఖాళీగా కూర్చోకుండా ఏదో ఒక పని చేస్తూనే వుండాలి. చింతపడకు, నేను నీ దుకాణంలోనే వుంటాను” అని సగుణ్ ని ఆశీర్వదించారు.
శిరిడీకి భక్తులు రావడం ఎక్కువ కావడంతో, సగుణ్ భోజన హోటల్ ని ప్రారంభించాడు. బాబాకి నైవేద్యం సమర్పించడం సగుణ్ ఎప్పుడూ మర్చిపోలేదు.
సగుణ్ దయాగుణం ఎంతటిదంటే, షిరిడీలో ఎవరూ ఆకలితో బాధ పడకుండా చూసేవాడు. దారిన పోయేవాడయినా, సాధువయినా, భిక్షగాడయినా, లక్షాధికారయినా సగుణ్ వారికి భోజనం పెట్టేవాడు. అతడు ప్రతి ఒక్క భక్తునికి వారు ఆహారం కోసం ధనం చెల్లించారా, లేదా అనే దానితో సంబంధం లేకుండా ఆహారం పెట్టేవాడు.
ఏ భక్తుడినీ అతడు తినకుండా పంపలేదు. బాబా ఒకసారి సగుణ్ తో “భుకేల్యా జీవాచీ భుక్ జాణావి! రిక్తహస్తె దారాతూన్ కుణాలా పాఠవూ నయే!” (ఇతరుల ఆకలిని నీ ఆకలిగా భావించుకో, ఎవరినీ రిక్తహస్తాలతో నీ గుమ్మం ముందునుండి పంపవద్దు) అన్నారు.
ప్రతిరోజూ బోజనాలయ్యాక సగుణ్ మేరు నాయక్ మశీదు శుభ్రంచేసి, సాయి యథాస్థానంలో కూర్చున్నాక, ఆయనకు తాంబూలం ఇచ్చేవాడు. బాబా అది తిన్నాక గ్లాసుడు మంచి నీళ్లు ఇచ్చి 2 రూపాయల దక్షిణ ఇచ్చేవాడు. అప్పుడు బాబా కొంతసేపు మౌనంగా గడిపేవారు.
అతను ఒకసారి బాబాను తనకు ఏ ఆపద రాకుండా కాపాడుతూ ఉండమని అర్థించాడు. అందుకు బాబా సరేనన్నారు. అతను మశీదులోని దీపాలను చమురుతో నింపడం వంటి చిన్న చిన్న చిన్నసేవలను చేస్తూ ఉండేవాడు.
ఒకప్పుడు బెతల్ నుండి టెండూల్కర్ అనే భక్తుడు శిరిడీ వచ్చి బాబా దర్శనం చేసుకొని, ఆయనను భోజనానికి ఆహ్వానించాడు. బాబా నవ్వి ఊరుకున్నారు. అతడు నిత్యమూ ఇద్దరికీ భోజనం సిద్ధం చేయించేవాడు. ఒకటి తాను తినేవాడు, వేరొకదానిపై మూతపెట్టి ఉంచమని సగుణ్ తో చెప్పేవాడు.
ఒకనాటి రాత్రి 10 గంటలకు సగుణమేరు నాయక్ పాత్రలు తోముకుంటుండగా ఒక సాధువువచ్చి, “నా అన్నం నాకివ్వు” అన్నారు. అతడు భోజనమివ్వగానే, “ఇది సిద్ధం చేయించిన వ్యక్తిని పిలు” అన్నారా సాధువు.
టెండూల్కర్ గాఢనిద్రలో వుండి, కబురుచేసినా రాలేదు. “మాది నాథ సాంప్రదాయం. నీవెప్పుడూ యిలాగే ఆకలిగొన్నవారికి అన్నం పెడుతూండు!” అన్నారాయన. మరుసటిరోజు, ఆ సాధువు తామేనని టెండూల్కర్ తో చెప్పి, “ఎవరైనా అన్నమడిగితే వ్యర్థంగా తిప్పి పంపకూడదు. ఏమీ లేకుంటే బెల్లం ముక్కైనా యివ్వాలి” అన్నారు బాబా.
ఒకరోజు సగుణమేరు నాయక్ బాబా దర్శనం కోసం వెళ్ళినప్పుడు బాబా చాలా కోపంగా ఉన్నారు. బాబా సగుణ్ ను తాను చెప్పినట్లు అనుసరించట్లేదని తిట్టారు. సగుణ్, “తానేమైనా తప్పు చేసానా, బాబా ఇలా కోప్పడుతున్నార”ని కలవరపడ్డాడు.
సగుణ్ అకస్మాత్తుగా ఎవరైనా ఆకలితో ఉండి ఉండాలి అని గ్రహించాడు. అతను వాడాకు వెళ్లి, “ఎవరైనా భోజనము చేయకుండా ఉన్నారా?” అని అడిగారు. అప్పుడు భక్తులలో ఇద్దరు భుజించలేదని తెలిసింది. అతను వారిని భోజనానికి ఆహ్వానించాడు. వారు సంతృప్తిగా భోజనం చేసిన తర్వాత అతను ద్వారకామాయికి మళ్ళీ వెళ్ళాడు. ఈసారి బాబా నవ్వి, “నా మాటల అర్థం తెలుసుకున్నావా? ఎల్లప్పుడూ ఇలాగే అర్ధం చేసుకొని నడుచుకో” అని చెప్పారు.
రేపు తరువాయి బాగం…..
(Source: Devotees Experiences of Sri Saibaba by Poojya Sri.B.V.Narasimha Swamiji and http://bonjanrao.blogspot.in/2012/09/saguna-meru-naik.html)
సర్వం సాయినాథర్పాణమస్తు
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- సాయి భక్త సగుణమేరు నాయక్ – మూడో బాగం…..
- సాయి భక్త సగుణమేరు నాయక్ – మొదటి బాగం…..
- సాయి భక్త బడేబాబా రెండవ బాగం….
- సాయి భక్త ముక్తారాం – రెండవ బాగం….
- సాయి భక్త ముక్తారాం – మొదటి బాగం….
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
0 comments on “సాయి భక్త సగుణమేరు నాయక్ – రెండవ బాగం…..”
Maruthi
May 22, 2017 at 9:52 amSarva jeeva Swaroopa neaku mangalam,sarva jeeva poshaka neaku mangalam. Sai Baba…Sai Baba…Sai Baba…Sai Baba