సాయి భక్త సగుణమేరు నాయక్ – మూడో బాగం…..



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు

సాయి భక్త సగుణమేరు నాయక్ – మూడో బాగం…..

1912లో వేపచెట్టు క్రింద పాదుకలు ప్రతిష్ఠించిన తరువాత మొదటి ఐదు సంవత్సరాలు పాదుకల నిత్యపూజను దీక్షిత్ చేసేవారు. అతని తర్వాత ఈ ఆరాధన లక్ష్మణ్ కచేశ్వర్ జఖడే కొనసాగించారు. తరువాత సగుణ్ ఈ ఆరాధనను నిర్వహించేవాడు.

మొదటి ఐదు సంవత్సరాలు డాక్టర్ కొఠారే ప్రతి నెలా దీపాలు వెలిగించడం కోసం 2 రూపాయలు పంపేవారు. అంతేగాక, కొఠారే పాదుకల వద్ద పైకప్పు మరియు చుట్టూ ఫెన్సింగ్ చేయడానికి కావలసిన సామగ్రిని పంపించారు. వాటిని రైల్వే స్టేషన్ నుండి శిరిడీకి తీసుకురావడానికి అయిన ఖర్చు సగుణ్  చెల్లించాడు.

బాబా ఆజ్ఞ ప్రకారం ఇతను రోజూ వేప చెట్టు క్రింద పాదుకలు స్థాపించిన చోట నైవేద్యం, దీపం పెడుతుండేవాడు.  బాబా నుండి ఆజ్ఞను పొంది తన సేవనందించిన ఇతడు ధన్యుడు.

1914లో బాబా ఇతనికి కలలో కనిపించి “మెత్తగా ఉడికించిన అన్నం తమకోసం తెమ్మ”ని చెప్పారు. అప్పటినుండి అతడు అలాగే తెచ్చి కొంచెం ధునిలో వేసి, మిగతాది ‘కొలంబా’లో ఉంచేవాడు. ఇలా రెండు సంవత్సరాలు గడిచిన తర్వాత “అన్నంలో కొంచెం నెయ్యి కలపమని” బాబా ఆదేశించారు. అప్పటినుండి అతడలానే చేసేవాడు.

ఒకసారి శిరిడీలో నీటి కొరత గురించి ప్రజలు ఫిర్యాదు చేసినప్పుడు, బాబా ఒక ప్రత్యేక స్థలం సూచించి అక్కడ బావి త్రవ్వితే పుష్కలంగా నీరు వస్తుందని హామీ ఇచ్చారు. సగుణ్, కాకా దీక్షిత్, బూటీ తదితరులు బావి త్రవ్వించే పనిలో సహాయపడ్డారు. బాబా చెప్పినట్లే పుష్కలంగా నీరు పడింది. ఇది శిరిడీలో త్రవ్వబడిన మూడో బావి.

సగుణ్ తన జీవిత కాలంలో ఏరోజూ బాబాకి నైవేద్యం సమర్పించకుండా వుండలేదు. బాబా మహాసమాధి చెందిన తర్వాత కూడా ద్వారకామాయికి ప్రతిరోజూ నైవేద్యం తీసుకుని వస్తూనే వుండేవాడు.

బాబా సగుణ్ ని ’ఠకీ’ (మోసగాడు) అని పిలిచేవారు, అయితే ఈ అద్భుతమైన భక్తుడ్ని అలా ఎందుకు పిలిచేవారో బాబాకే తెలియాలి. బాబా మహాసమాధి తర్వాత కూడా సగుణ్ విష్ణుదేవుని పూజని కొనసాగించాడు.  బాబా ఎందరో భక్తులకు ఎంతో డబ్బుని ఇచ్చేవారు, కానీ సగుణ్ కి ఎప్పుడూ ఏమీ ఇవ్వలేదు, సగుణ్ ఎన్నడూ ఫిర్యాదూ చేయలేదు, బాబాని ఎప్పుడూ ఎందుకు తనకి డబ్బు ఇవ్వడం లేదని అడగనూలేదు. సగుణ్ ది నిష్కామ సేవ (ప్రతిఫలాపేక్షలేని సేవ).

సగుణ్ ప్రత్యక్షంగా చూసిన ఒక సంఘటన ను ఇలా తెలియజేసారు. ఒకప్పుడు మార్తాండ్ అనే పిచ్చి బ్రాహ్మణుడు శిరిడీ వేపచెట్టు క్రింద పాదుకలను పెద్ద బండతో రెండు ముక్కలుగా పగలగొట్టాడు. ఆ తర్వాత పార్వతి-మహాదేవుని ఆలయానికి వెళ్లి అక్కడి విగ్రహాలను కూడా పగలగొట్టాడు.

భక్తులు పగిలిపోయిన పాదుకల స్థానంలో క్రొత్త పాదుకలు ప్రతిష్టించడానికి బాబా అనుమతి కోరారు. అందుకు బాబా అంగీకరించక అన్నశాంతి మాత్రం జరిపిస్తే చాలునని చెప్పారు. బాబా ఆదేశం ప్రకారం అన్నదానం చేయబడింది.

తనకి విపత్తులెదురయినప్పుడు కూడా సగుణ్, “మంచైనా, చెడైనా అది బాబా నిర్ణయం” అనేవాడు. బాబా బోధనాశైలిలోని శ్రద్ధకి సగుణ్ ప్రత్యక్ష ఉదాహరణ.

సగుణ్ కు బాబా వారి బోధనలు:

  1. దేనినీ ఆశించకు; ఎవరినుండీ ఏమీ ఆశించకు.
  2. వున్నదానితో తృప్తిపడు.
  3. నీ శక్తికొలదీ ఇతరులకు సహాయపడు.
  4. ఇతరులకి సహాయపడిన తర్వాత ప్రతిఫలాన్ని కానీ, బహుమానాన్ని కానీ ఆశించకు.
  5. ఇతరుల ఆకలిని నీ ఆకలి గా భావించి, వారికి ఆహారం అందించు.
  6. నీ గుమ్మం నుండి ఎవరినీ ఉత్తి చేతులతో పంపవద్దు.

బాబా మహాసమాధి తరువాత 1922-23లో సగుణ్ కి బాబా కలలో కనిపించి, “సంస్థాన్ వారు తమకు నెయ్యితో నైవేద్యం పెట్టడం లేదని, అది తమకు ఎంతో ఇష్టమని” చెప్పారు. సగుణ్ మళ్ళీ తన సొంత వ్యయంతో బాబా చెప్పినట్లుగా నైవేద్యం పెట్టడం మొదలుపెట్టాడు. ఇది చూసి సంస్థాన్ వారు కూడా ఆవిధంగానే నైవేద్యం పెట్టడం మొదలుపెట్టారు.

బాబా మహాసమాధి తర్వాత ఒకసారి సగుణ్ చాలా జబ్బుపడ్డాడు, మరణం అంచుకి చేరుకున్నాడు. శిరిడీ గ్రామస్తులు ఎంతో వ్యాకులపడ్డారు, ఆయనకి నయమవుతుందని అనుకోలేదు. కానీ ఇంతటి విపత్కర పరిస్థితిలో కూడా సగుణ్ కి బాబా పట్ల వున్న విశ్వాసం అణువంతయినా తగ్గలేదు.

సగుణ్ కోలుకుని, నడవగల్గిన స్థితికి వచ్చినప్పుడు, సరాసరి ద్వారకామాయి లోపలికి వెళ్ళి, కన్నీటితో బాబా చిత్రపటం ముందు నిలబడి, “నాధా, దేవా, నాకోసం ఎంతటి బాధని అనుభవించావు, నా బాధల్ని నువ్వు స్వీకరించి ఎన్ని కష్టాలు పడ్డావు” అని బిగ్గరగా ఏడ్చాడు. సగుణ్ దుఖాన్ని చూసిన వారందరికీ కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.

సగుణ్,  బాబా ప్రసాదం మరియు ఊదీలను దూర ప్రాంతాలలో ఉండే భక్తులకు చాలా కాలం పాటు పోస్ట్ ద్వారా పంపుతూ ఉండేవాడు. అతను శిరిడీలో తన బసను కొనసాగిస్తూ, 1974 వరకు బాబా పేరుతో సేవను అందించాడు. 1974లో సగుణ్ తన 85వ ఏట శిరిడీలో సమాధి చెందారు. దురదృష్టవశాత్తూ సగుణమేరు నాయక్ సమాధి శిరిడీలో నిర్మించబడలేదు.

బాబాలో ఐక్యమైన ఈ అద్భుతమైన భక్తుని సంక్షిప్త చరిత్ర ఇది.

(Source: Devotees Experiences of Sri Saibaba by Poojya Sri.B.V.Narasimha Swamiji and  http://bonjanrao.blogspot.in/2012/09/saguna-meru-naik.html)

సర్వం సాయినాథర్పాణమస్తు

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Have any Question or Comment?

0 comments on “సాయి భక్త సగుణమేరు నాయక్ – మూడో బాగం…..

Maruthi

Sai Baba…Sai Baba..Sai Baba…Sai Baba

kishore Babu

Sai Baba…Sai Baba…Sai Baba…Sai Baba

Comments are closed for this post !!

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles