పాల గ్లాసులో మేడి పండు



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు

20 సంవత్సరాల క్రితం మేము చండీఘర్ లో ఉంటున్నాము. ప్రతి గురువారం ఒక బాబా భక్తుడు ఇంటిలో భజనలు జరుగుతూ ఉండేవి. ఒకరోజు ఆ ఇంటావిడ అనారోగ్యంతో ఉన్నందున బాబాకు నైవేద్యంగా పంచదార కలిపిన పాలు ఉంచాలని ఆమె నాకు చెప్పారు. భజన మొదలుపెట్టారు.

నేను వంటగదికి వెళ్లి ఒక గ్లాసులో పాలు పోసి, ఒక చెంచాడు చక్కెర వేసి కలపకుండా తెచ్చి బాబా ముందు ఉంచాను. మా భజన పూర్తీ అయ్యే సమయానికి, నేను కలపకపోయినా చక్కెర దానంతట అదే కరిగిపోతుంది భక్తులందరికి ఇవ్వడానికి అని నేను అనుకున్నాను.

భజన పూర్తయిన తరువాత, నేను భక్తులకు తీర్ధంగా ఇచ్చే ముందు ఒకటి లేదా రెండుసార్లు పాలు కలపబోయాను. ఆశ్చర్యం! స్పూన్ అసలు కదలట్లేదు. భజన సమయంలో కళ్ళు మూసుకొని పాడుతున్నప్పుడు ఏదో పడి ఉంటుందని నేను భావించాను. నేను దానిని బయటకు తీసి చూస్తే అది ఒక 3.5 అంగుళాల పరిమాణంలో ఉన్న మేడి పండు.

నా జీవితంలో అంత పెద్ద మేడి పండుని నేను చూడలేదు. నేను దానిని మరొక భక్తుడికి చూపించాను. ఆమె కూడా చాలా ఆశ్చర్యపడి, “వారు ఇలాంటి పెద్ద మేడి పండ్లు బెలూచిస్తాన్ లో అందుబాటులో ఉంటాయి” అని చెప్పింది. అప్పుడు నేను దాన్ని తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి పాలలో వేసి, ప్రతి భక్తునికి ఒక్కొక్కటి తీర్ధంతో పాటు ఇచ్చాను. యెంత అద్బుతమో!

గిరిజా శాస్త్రి

సర్వం సాయినాథర్పాణమస్తు 

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles