సాయీ అంటే ఓయీ అని పలికే సాయి–Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

This Audio Prepared by Mrs Lakshmi Prasanna

  1. Mir-183-1812-పలికే సాయి 2:47

మాకుటుంబంలో మేమంతా సాయి భక్తులం.

బాబా దయవల్ల సంవత్సరాల తరబడి మాకెన్నో అనుభవాలు కలుగుతూ ఉన్నాయి.

ఈ మధ్యనే మా అమ్మగారికి బాబా చూపించిన అనుభూతి మరపురానిది.

బాబా బోధించిన వాటిని మా అమ్మగారు తూచా తప్పకుండా పాటిస్తూ ఉంటారు. కారణం బాబా అంటే విపరీతమయిన భక్తి.  ఆవిడ ధృఢమయిన  భక్తికి మా అమ్మగారిని అభినందించకుండా ఉండలేను.

ఆవిడ చేసే ప్రార్ధనల వల్ల మాకెన్నో సత్ఫలితాలు కలిగాయి.

నోయిడాలో ఉన్న సాయిబాబా మందిరానికి మా అమ్మగారు ప్రతిరోజూ రెండు సార్లు వెడుతూ ఉండేవారు.

ఆరోజు నవంబరు 25వ.తారీకు 2004వ.సంవత్సరం  సాయిబాబా విగ్రహ ప్రతిష్ట జరిగిన రోజు.  బాబాకు క్షీరాభిషేకంతో ఉత్సవాలు ప్రారంభమయే రోజు. ఆసందర్భంగా మా అమ్మగారు బాబా క్షీరాభిషేకానికి ఒక పాల పాకెట్ సమర్పించుదామనుకొన్నారు.

క్షీరాభిషేకం ప్రారంభమవడానికి ముందుగానే బాబా మందిరానికి చేరుకుందామనే ఉద్దేశ్యంతో, ఉదయాన్నే కాస్త తొందరగా పాలు తీసుకు రమ్మని మాకు ప్రతిరోజు పాలు తెచ్చే అతనికి చెప్పింది.  కాని మా పాలతను చెప్పిన సమయానికి ఉదయాన్నే పాలు తీసుకురాలేదు.

ఇక ఆలశ్యమయిపోతుందని మా అమ్మగారు ఉదయం గం.6.30 ని.కల్లా గుడికి బయలుదేరారు.

బాబా గుడికి వెడుతున్నంత సేపూ క్షీరాభిషేకం చేయించాలనె తన కోర్కెను ఎలాగైనా తీర్చమని దారంతా బాబా ని ప్రార్ధిస్తూ ఉన్నారు.

ఇక గుడి దగ్గరకు చేరుకోవడానికి కొద్ది దూరం ఉండగా ఆమె ప్రక్కకు ఒక కారు వచ్చి ఆగింది.  కారులోనుండి ఒక స్త్రీ  దిగి ఒక పాల పాకెట్టు మా అమ్మగారికిచ్చి బాబాకు క్షీరాభిషేకానికి సమర్పించమని చెప్పింది.  అలా చెప్పి ఆమె కారులో వెళ్ళిపోయింది.  మా అమ్మగారికి ఆశ్చర్యంతో నోట మాట రాలేదు.

కళ్ళలో ఆనందభాష్పాలు నిండిపోయాయి.  బాబా తన మనసులోని కోరికను ఈవిధంగా తీర్చినందుకు బాబాకు కృతజ్ఞతలు తెలుపుకొన్నారు.

కారులో వచ్చినామెకు తాను సాయిబాబా గుడికి వెడుతున్నానని ఎలా తెలుసు?

సాయీ అంటే ఓయీ అని పిలిస్తే పలుకుతాననే తానిచ్చిన మాటను అక్షరాలా నిజం చేసి చూపించారు.

కూర్పు: జ్యోతిరాజన్ రౌత్

సీమా వర్మ, 148/H – 19

సెక్టర్ 7, రోహిణి, న్యూడిల్లి – 110 085

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Have any Question or Comment?

0 comments on “సాయీ అంటే ఓయీ అని పలికే సాయి–Audio

Sai Suresh

భక్తితో ఆరాటపడే భక్తుల కోర్కెలు సాయి తీరుస్తారు

Comments are closed for this post !!

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles