Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా.
శ్రీమతి విమల అమ్మగారు – ఖమ్మం
ఖమ్మం పట్టణంలో శ్రీమతి దండి విమల అమ్మగారు ఆధ్యాత్మిక సంపన్నులు, లలితా ఉపాసకురాలు. వారిని నా పెద్ద కుమార్తె ఆశ్రయించుట, తద్వారా మా కుటుంబము అమ్మగారి అనుగ్రహమునకు పాత్రులమైతిమి.
2007 మార్చి నెలలో నేను సికింద్రాబాద్ లో మా పెద్ద అల్లుడుగారి ఇంటి వద్దకు వచ్చినప్పుడు అచ్చటకు వచ్చిన శ్రీమతి విమల అమ్మగారు నన్ను ఆశీర్వదిస్తూ “నీవు పలు గ్రంధములు వ్రాసియుంటివి. సాయి స్మరణతో అంతర్ముఖమగుచున్నావు. సాయితత్త్వము అను గ్రంధము వ్రాయుము అని నన్ను ఆదేశించిరి.
అలా అమ్మ గారి ఆశీర్వాదంతో గ్రంధమును వ్రాయాగా శ్రీ సాయి అవధూత, అనంతుడు, అఖండ సచ్చిదానందమూర్తి, అయన లీలలు అమోఘము.
“సాయి జీవితచరిత్రను, శ్రీ సాయితత్త్వము తెలుసుకొని చరిత్ర చదువుట వలన ఉపయోగముంది” అని ముందుమాటలో అమ్మగారు అనిరి.”
ఈ గ్రంధమును గుంటూరు బృందావన్ గార్డన్ నులోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయము వద్ద అమ్మ గారే, ఆవిష్కరణ చేసిరి. ఆ గ్రంధము 18 అధ్యాయములుగా వ్రాయబడినది. పాఠకుల మన్నల నందినది.
అలానే నేను వ్రాసిన “సాయి మహిమ” అను గ్రంధమున వారి అనుగ్రహతరంగములో సాయి అంటే సత్ చిత్ ఆనందరూపము. బాబా అంటే తండ్రి, సాయి తండ్రిగా శిక్షణ యిస్తూ, మాయిగా నిత్యసత్యస్వరూపుడు.
భౌతిక దేహమున్నప్పుడు, లేనప్పుడు సజీవుడే. జనన మరణాలు లేని అమరత్వం, దివ్యత్వము సాయి. ఆత్మజ్ఞానమే సాయితత్త్వము అని తెలిపిరి.
రచయితను ఆశీర్వదిస్తూ ” అమ్మ అదరణలో, అఖండభక్తి, జ్ఞాన వైరాగ్యాలు ప్రాప్తిమ్చి సాయికృపకు విశేషంగా పాత్రులు కావాలని నా ఆకాంక్ష” అని ఆశీస్సులు ప్రసాదించిరి.
శ్రీమతి విమల అమ్మగార్కి బాబా చూపిన అద్భుతలీలలు తెలుసుకుందాము.
అమ్మ గారు ఇలా చెప్పారు. ” కొంత కాలం క్రిందట నాకు జ్వరము వస్తూ మూడు నెలల నుండి 102 డిగ్రీల జ్వరము ఉంది ఎన్ని మందులు వాడినా తగ్గలేదు.”
మా యింటి ఆవరణలో స్వయంభు నరసింహస్వామి ఉన్నారు. ప్రతిషంచబడిన లలితాదేవి మందిరములో ఉన్నది. ఆమెను ఆరాధిస్తూ యున్నాను.
ఒక రోజు ఉదయం గం.6 .30 నిముషముల ప్రాంతములో మా కోడలు నాకు టీ తెచ్చి ఇచ్చినది. ఆ టీ నేను త్రాగబోతున్నాను. ఇంతలో “నాపై ఒక పాట వ్రాయి నీ జ్వరం తగ్గుతుంది.” అని ‘సాయివాణి’ నాకు వినిపించింది.
నేను ఆ టీ త్రాగుతూనే బాబాపై “సాయి….సాయి…అంటే చాలు కలుగును మనసుకుహాయి” అనే పాటను అప్పుడే వ్రాశాను.
అంతే అటు తరువాత నాకు జ్వరము రాలేదు అని తమ అనుభవము చెప్పారు.(ఆ పాటను సాయి మహిమ పుస్తకములో చూడవచ్చు).
శ్రీమతి విమల అమ్మగారు నా పిల్లలతో “మీ నాన్న గారు ఆధ్యాత్మిక మార్గములో యున్నారు. వారిని మీ వద్దకు రమ్మనవద్దు. ఒక్కరినే పొన్నూరులో వుండనివ్వండి” అని చెప్పిరి.
అలా సాయి బాబా మార్గములో నిరంతర సాయి స్మరణతో జీవించే భాగ్యము నాకు(రచయిత) కలిగించిన శ్రీమతి విమల అమ్మగార్కి సహస్రనమస్కారములు తెలుపుకొనుచున్నాను.
శ్రీ ఆలూరు గోపాలరావు గారి విరచిత శ్రీ సాయి బాబా సత్ చరితము
సంపాదకీయం: సద్గురులీల ( జనవరి – 2016)
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- సాయి మార్గములో పెద్దలు(జిల్లెళ్ళమూడి అమ్మగారు)
- అంతే అటు తర్వాత నాకు జ్వరము రాలేదు—Audio
- సాయి మార్గములో పెద్దలు(శ్రీ కుర్తాళం పీఠాధిపతి)
- సాయి మార్గములో పెద్దలు (శ్రీ అచలానంద సరస్వతి, బషీర్ బాబా)
- సాయి మార్గములో పెద్దలు(శ్రీ పూర్ణానంద స్వామి – శ్రీశైలం)
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments