అంతే అటు తర్వాత నాకు జ్వరము రాలేదు—Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


This Audio has been Prepared by Mrs Lakshmi Prasanna

  1. Mir-24-fever-Neverget-by-Lakshmi-Prasanna 3:47

ఖమ్మం పట్టణంలో శ్రీమతి దండి విమల అమ్మగారు ఆధ్యాత్మిక సంపన్నులు,

లలితా ఉపాసకురాలు. వారిని నా పెద్ద కుమార్తె ఆశ్రయించుట, తద్వారా మా కుటంబము అమ్మ గారి అనుగ్రహముకు పాత్రులమైతమి.

2007 మార్చి నెలలో నేను సికిందరాబాద్ లో మా పెద్ద అల్లుడు గారి   ఇంటి వద్దకు వచ్చినప్పుడు అచ్చటకు వచ్చిన శ్రీమతి విమల అమ్మగారు నన్ను ఆశీర్వదిస్తూ “

నీవు పలు  గ్రంధములు రాసివుంటావు. సాయితత్వము” అను గ్రంధము వ్రాయము. అని నన్ను ఆదేశించిరి.

ఆలా అమ్మ గారి ఆశీర్వాదముతో గ్రంధమును వ్రాయగా శ్రీ సాయి అవధూత, అనంతుడు,

అఖండ సచిదానందా మూర్తి, ఆయన లీలలు అమోఘము.

సాయి జీవిత చరిత్రను, శ్రీ సాయితత్వము తెలుసుకొని చరిత్ర చదువుట వలన ఉపయోగం ఏమిఉంది, అని ముందు మాటలో అమ్మగారు అనిరి.

ఈ గ్రంధమును గుంటూరు బృందావన గార్డెన్స్ లోని శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవాలయము వద్ద అమ్మగారే, ఆవిష్కరణ చేసిరి.

ఆ గ్రంధము 18 అధ్యములుగా వ్రాయబడినిది. పాఠకుల మన్నల నందినది . అలానే నేను వ్రాసిన “సాయి మహిమ ” అను గ్రంధమును వారి అనుగ్రహతరంగములో సాయి అంటే సత్ చిత్ ఆనందరూపము.

బాబా అంటే తండ్రి, సాయి తండ్రిగా శిక్షణ యిస్తూ, మాయగా నిత్యసత్యస్వరూపుడు. భౌతికదేహం ఉన్నప్పుడు , లేనప్పుడు సజీవుడే. జనన మరణాలు లేని అమరత్వము, దివ్యామృతము సాయి.

మతాలకతీతంగా మహిమాన్వితుడు సాయి. ఆత్మజ్ఞానమే సాయితత్వమని తెలిపిరి. రచయితను

ఆశీర్వదిస్తూ “అమ్మ ఆధారణలో, అఖండభక్తి జ్ఞానవైరాగ్యాలు ప్రాప్తినిచ్చి సాయి కృపకు విశేషముగా పాత్రులు కావాలి అని నా ఆకాంక్ష.” అని ఆశీస్సులు ప్రసాదించిరి.

శ్రీమతి విమల అమ్మగారికి బాబా చూపిన అద్భుతలీలలు తెలుసుకొందాము.
అమ్మగారు ఎలా చెప్పినారు. “కొంత కాలం క్రింద నాకు జ్వరము వస్తూ మూడు నెలలు నుండి 102 డిగ్రీల జ్వరము ఉండి ఎన్ని మందులు వాడిన తగ్గలేదు. మాయింటి ఆవరణలో స్వయంభు నరసింహ స్వామి ఉన్నారు.

ప్రతిష్టించబడిన లలితాదేవి మందిరములో ఉన్నది. ఆమెను ఆరాధిస్తూ యున్నాను. ఒకరోజు ఉదయము గం. 6-30 నిమిషముల ప్రాంతములో మా కోడలు నాకు టీ తెచ్చి ఇచ్చినది. ఆ టీ నేను త్రాగబోతున్నాను.

ఇంతలో “నాపై ఒక పాట వ్రాయి నీ జ్వరము తగ్గుతుంది.” అనే సాయి వాణి నాకు వినిపించింది.

నేను ఆ టీ త్రాగుతూనే బాబా పై ”సాయి – సాయి అంటే చాలు కలుగును మనకు హాయి” అనే పాటను అప్పుడే వ్రాసాను.

అంతే అటు తర్వాత నాకు జ్వరము రాలేదు అని తమ అనుభవము చెప్పారు. (ఆ పాటను సాయి మహిమ పుస్తకము లో చూడవచ్చు).

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Contact No’s  : శ్రీనివాస మూర్తి 9704379333,

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles