సచ్చరిత్ర పారాయణ తర్వాత నాకు జరిగిన అనుభవం ……..!



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


మా వారికి వేరే అమ్మాయితో సంబంధం వుందని నాకు తెలిసిన తర్వాత మా వారి ఆగడాలు ఇంకా  శృతి మించి పోయాయి.

నన్నెందుకు పెళ్ళి చేసుకున్నావు, చేసుకొని ఈ కొట్టడాలు, గర్భాలు పోవడాలు అవసరమా అని అడిగాను.

“నన్ను ఇలా అడగడానికి నీకు ఎంత ధైర్యం, ఈ ధైర్యాన్ని ఎవరు నూరి పోసారు”? అంటూ నన్ను గదిలో పెట్టి తాళం వేసాడు.

ఆ పక్కవాళ్ళు, ఈ పక్క వాళ్ళు మాట్లాడతారు అని కిటికీలకి కూడా మేకులు  కొట్టాడు.

నేను ఎవరికైనా ఫోన్చేసి సమాచారం ఇస్తానేమోనని ఎవరైనా నీకు ఫోన్‌ ఇచ్చారా అంటూ రోజూ ఉప్పులు, పప్పులు, బియ్యం అన్నీ పారబోసి డబ్బాలలో పెట్టానేమో అని వెతికేవాడు.

మా అమ్మ తమ్ముడు  ఇంటికి వస్తే వాళ్ళతో నీచాతి నీచంగా మాట్లాడేవాడు. ఉచ్చనీచాలు లేకుండా ప్రవర్తించేవాడు.

నన్ను ఇంట్లో  పెట్టి తాళం వేసి మా పాపని తన స్కూలుకి తీసుకెడతాను అని చెప్పి తీసుకెళ్లి స్కూలుకి కాకుండా ఆమె ఇంటికి  తీసుకు వెళ్లి సాయంత్రం దాకా పనులన్నీ చేయించుకొని,

వంట కూడా పసిదాని చేత చేయించుకుని అది సరిగా చేయలేకపోతే దాన్ని కొట్టి నరకం చూపించి, రాత్రి అయ్యాక ఇంటికి తీసుకొచ్చాడు,

ఇదేమిటి ఇంత  ఆలస్యం అయింది అని అడిగితే. నాకు మళ్ళీ సన్మానం మొదలు.

ఒకసారి ఏమనుకున్నాడో. కాని నన్ను బాబా గుడికి తీసుకెళ్లాడు. అక్కడ ఒకామె నాకు ఎదురై “శ్రీసాయి సచ్చరిత్ర పుస్తకం” నాచేతుల్లో పెట్టి, నీకు చాల కష్టాలు వున్నాయిగా. అమ్మా! నువ్వు ఇది ‘చదువుతే నీ కష్టాలన్నీ తీరిపోతాయి అని చెప్పి నాకు ఆపుస్తకం  ఇచ్చింది.

అది నేను తీసుకున్నానని అది ఎవరు? దానికి నీకు ఏంటి సంబంధం?,  దానితో నీపరిచయం  పెంచుకొని ఇంకేమైనా. చేద్దాం అనుకుంటున్నావా? అంటూ అడిగాడు, ఛీ! అనుకున్నాను..

ఇతని గురించి  ఆలోచించే కంటే బాబా గురించి అలోచించి పారాయణం చేసుకుంటే కొంతైనా మనఃశాంతి ఉంటుందనిపించింది, పారాయణం మొదలుపెట్టాను.

నాకు అప్పటికి హారతులు రావు, పట్టుదలతో 4 హారతులు 15 రోజులలో నేర్చుకున్నాను.

ఒక వారంలో బాబా చరిత్ర చదవటం పూర్తి చేసాను. నాకు కొంచెం ధైర్యం వచ్చింది.

మా  ఆయనంటే భయం, వణుకుపోయి ఎదురు నిలపడుతున్నాను. వస్తాడు, తింటాడు, తిడతాడు, కొడతాడు. ఇదేగా  ఇతను చేసే పని అనుకున్నాను నిర్లిప్తంగా.

“బాబా రెండురోజులు నన్ను ఇతను కొట్టకుండా వుంటే నిన్ను నేను  మరింతగా నమ్ముతాను” అనుకున్నాను ఓ రోజు.

ఆరోజు మాఆయన తాగి వచ్చాడు కానీ ఏమనుకున్నాడో  ఏమో మన్ను తిన్న పాములాగా ఒక పక్కకి పోయి పడుకున్నాడు. మర్నాడు’కూడా అలాగే అయింది.

బాబా నువ్వ  నాయందువున్నావయ్యా అనుకొని కళ్ళు తుడుచుకున్నాను. నేను మాత్రం బాబా ధ్యాసలోనే ఎక్కువ సమయం  గడుపుతూ వచ్చాను.

ఒకసారి తాగివచ్చి బాగాకొట్టాడు, అలాకొట్టే సరికి ఆ దెబ్బలకి నాకు బాగా నడుము నెప్పి వచ్చింది. ఆ నడుము నెప్పి ఎన్ని రోజులు అయినా తగ్గలేదు.

వంగి వంగి పనులు చేసుకోవలసి వచ్చేది. దాక్టర్ ‌దగ్గరికి తీసుకుపో అంటే వినేవాడు కాదు.

ఈసారి అని విధాలుగా ఇంక నాకు బాబాయే దిక్కు అనిపించి నేను బాబా చరిత్ర పారాయణం చేసి పది మందికి ఆయన చూడకుండా భోజనాలుపెట్టాను.

అయినా నాకే గుణం  కనిపించలేదు. ఆనెప్పి బాధని భరించ లేక ఒకరోజు బాబా విగ్రహం ముందు పాదాలపై తలపెట్టి బాగ  ఏడ్చాను పది నిముషాలు అలాగే వున్నాను.

ఉన్నట్టుండి నా నడుము మీదకి చల్లగా ఐస్‌ లాగా తగిలి  ఆచల్లదనం ఒళ్ళంతా పాకింది. నాకు స్పష్టంగా తెలుస్తోంది అది బాబా చెయ్యి అని, అంతే! ఆ తర్వాత  నొప్పి తగ్గిపోయింది.

The above miracle has been typed by: Mrs. Raja Rajeswari Sainathuni

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles