ఆరతుల భావము…..సాయి@366 ఏప్రిల్ 9….Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba



Voice Support By: Mrs. Jeevani


తాజ్‌మహల్‌ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీల పేర్లు తెలియవు. అట్లాగే సాయి సాహిత్యంలో కూడా కొందరి పేర్లు తెలియవు. వారు చేసిన కృషి మిగిలిపోతుంది.

అంటే వారు కీర్తిశేషులు కాదు – ఎందుకంటే పేరు తెలిస్తే గదా ఆయనను కీర్తిశేషుడనేది.

ఆ కోవకు చెందిన వారే శ్రీ ద్వివేది వేంకటేశ్వర శర్మ గారు. నిజామాబాద్‌ జిల్లావాసి. సంస్కృత, ఆంధ్ర, మరాఠీ, తెలుగు భాషలలో పాండిత్యం సంపాదించిన శర్మ గారు శ్రీశ్రీశ్రీ విమలానంద భారతీ స్వాముల వారికి (కుర్తాళం) రచనలలో తోడ్పడేవారు కూడా. కీర్తి అపేక్షించని వ్యక్తి ఆయన.

ఆయనకు తెలుగు వారికి సాయిబాబా అంటే ఎంత భక్తి ప్రపత్తులో తెలుసు.

షిరిడీలో నాలుగు వేళలా పాడే ఆరతులను మరాఠీ భాష తెలియక పోయినా కొద్దో గొప్పో నేర్చుకుని సాయిబాబా ముందు ఆ ఆరతులను గృహాలలోను, సాయి మందిరాలలోను ఇచ్చేవారు తెలుగు వారు.

అన్ని ఆరతులను తెలుగు లిపిలోనే కాకుండా, వాటి భావాన్ని కూడా తెలుసుకుంటే బాగుంటుందని సికిందరాబాదు లోని నల్లగుట్ట సాయి మందిర స్థాపకుడైన శ్రీ దేవరశెట్టి అంజయ్య గారికి ఆలోచన వచ్చింది.

అయితే అటువంటి ఆలోచన ఎందరెందరికో కూడా వచ్చి ఉంటుంది. సాయి మాటలలో చెప్పాలంటే మామిడి పూత అంతా మామిడి పండ్లు కావు కదా!

శ్రీ దేవరశెట్టి అంజయ్య గారు శ్రీ ద్వివేది వేంకటేశ్వర శర్మగారిని కోరారు. అది సాయి సంకల్పం, సత్సంకల్పం.

దానికి శర్మ గారు అంగీకరించారు. అంత మాత్రంతోనే సరికాదు, అందుకు షిరిడీ సంస్థానం వారు పచ్చ జెండా ఊపాలి. శ్రీ కే.యస్‌. పాఠక్‌ అలనాటి కోర్టు రిసీవరు గారు అంగీకరించారు.

శ్రీ శర్మగారి ”శ్రీ సాయి బాబా పూజా విధి (సగుణోపాసన)” షిరిడీలో జరుగునట్లు తెలుగు లిపిలో అనువాదమును రచించినారు.

దానిని షిరిడీ సంస్థానం వారి అనుమతితో నల్లగుట్ట బాబా మందిరం వారు ముద్రించారు. ఆ గ్రంథంము 1976 శ్రీరామనవమి రోజున అటు షిరిడీలోను, ఇటు సికిందారాబాదులోను ఏప్రియల్‌ 9, 1976 నాడు విడుదల చేశారు.

ఆ గ్రంథంము మొదటగా పూజావిధితోపాటు, ఆరతులను తెలుగు లిపిలోనే కాకుండా వాటి తాత్పర్యమును కూడా ఇచ్చినది.

శ్రీ ద్వివేది వేంకటేశ్వర శర్మగారు ఎవరో సాయి భక్తులకు తెలియక పోవచ్చును గాని, వారి రచన చిరంజీవి!

Compiled  By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరి బోస్

Collected and Presented By: Mr: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles