Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Voice Support By: Mrs. Jeevani
1978 సంవత్సరములో సాయినాథుని పుణ్య తిథిని పురస్కరించుకొని షిరిడీలో సాయినాథుని చిత్ర సాహిత్య ప్రదర్శనను ఏర్పాటు చేశారు సాయి సంస్థానం వారు – సాయినాథుని సమాధి మందిరంలో.
నవంబరు 9, 1978, గురువారం నాడు ఉదయం పది గంటలకు శ్రీ సాయి పాదానంద ప్రారంభించారు ఆ ప్రదర్శనను.
అది 9 నవంబరు నుండి 13 నవంబరు 1978 వరకు సాగింది. అనేక వేలమంది ఆ ప్రదర్శనను తిలకించారు. 40పైగా ఫొటోలు ప్రదర్శించారు.
ఆ ఫొటోలు భారత దేశంలోని నలుమూలల నుండి ఆయా ప్రదేశాలలోని సాయినాథునివి, సాయి మందిరాలవి. దీనినిబట్టి సాయి భారత దేశంలో ఇంటింటి దైవమైనాడని తెలుస్తోంది.
అలనాటి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన శ్రీ బదరీ నారాయణ శర్మ గారు ఇస్సామియా బజారు, హైదరాబారు నుండి, పిక్ట్ సాయి మందిరం, సికిందరాబాదు నుండి, శ్రీ సాయి బాబా మందిరం సాలూరు నుండి ఫొటోలను ప్రదర్శించారు.
ఆంధ్రప్రదేశ్ నుండి మూడు మందిరములు, ఇతర ప్రదేశముల నుండి 28 మందిరముల ఫొటోలు ప్రదర్శనలో ఉంచారు.
బహుశ 1978లో జరిగినదే ప్రథమ సాయినాథుని చిత్ర సాహిత్య ప్రదర్శన కావచ్చును. అనంతరం అనేక ప్రదర్శనలు జరిగాయి.
వాటిలో ఒక ప్రదర్శనను గురించి క్లుప్తంగా: షిరిడీకి చెందిన డాక్టర్ విన్నీ చిట్లూరి గారు 1999 సంవత్సరం మధ్యలో చూడ చక్కని, బాబాకు సంబంధించిన పూర్తి వివరములతో ఒక ఫొటో ప్రదర్శనను షిరిడీ, బెంగుళారు, పూనా తదితర పట్టణాలలో ప్రదర్శించారు.
ఆ ప్రదర్శనలో షిరిడీ లో గల ద్వారకామాయి, చావడి, గురుస్థాన్, సమాధి మందిరము, లెండీ బాగ్లలో గల ప్రతి వస్తువును ఫొటో రూపములోనే గాక దానికి సంబంధించిన పూర్తి సమాచారము ఇచ్చారు.
అంతే గాక షిరిడీలో బాబా బిక్ష చేసిన గృహాలు, లెండీ యాత్ర, చావడి ఉత్సవం, బాబా భక్తుల గృహాల వివరాలను పొందుపరిచారు.
అరుదుగా బాబా వెళ్ళిన రహతా, నీంగాం అచట గల భక్తుల గృహాలు, వారి వివరాలను కూడా వివరించారు. ఈ ప్రదర్శన అసంఖ్యాక భక్తుల హృదయాలను చూరగొన్నది.
ఆ వివరములనే అత్యంత సుందరంగా, కలరు ఫొటోలతో ‘అంబ్రోషియా ఇన్ షిరిడీ’ అనే పేరుతో పుస్తకరూపంలో భక్తులను అలరించింది.
ఈ గ్రంథాన్ని, తెలుగు, కన్నడ భాషలలోకి కూడా తర్జుమా చేశారు.
Compiled By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరిబోస్
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- ప్రదర్శన కాదు సందర్శన…..సాయి@366 అక్టోబర్ 23….Audio
- కర్రలతో కొడతాను…..సాయి@366 నవంబర్ 5….Audio
- వైద్యులకే వైద్యుడు! …..సాయి@366 మే 9….Audio
- మోక్ష గురువు …..సాయి@366 జూన్ 9…Audio
- దుష్ట శక్తులు…..సాయి@366 జూన్ 26….Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments