Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Voice Support By: Mrs. Jeevani
బొంబాయి నుండి సాయి భక్తులైన తల్లీకుమారులు షిరిడీకి వచ్చి సాయినాథుని దర్శించారు.
సాయిబాబా ఆ పిల్లవానిని ఒక చాప మీద, తన వద్దే కూర్చోపెట్టుకున్నారు. సాయి ఇలా ఎందుకు చేస్తున్నారో అక్కడ ఉన్న వారెవరికీ అర్థం కాలేదు.
సాయి ఆ బాలునితో తనను అడిగి గాని కాలు కదప వద్దని హెచ్చరించారు. ఎందుకో మాత్రం చెప్పలేదు.
కాలం మెల్లగా గడుస్తోంది.
మధ్యాహ్నం మూడు గంటలైంది. ఒక వికృత ఆకారం కంచె దూకి ద్వారకామాయిలోని ప్రవేశించింది.
ఇదంతా ఆ పిల్లవాడు చూస్తూనే ఉన్నాడు. ఆ వికృత రూపి ”నేను ఈ పిల్లవాడిని తీసుకు పోతాను” అన్నది. సాయి వద్దన్నారు.
ఆ వికృత రూపి సాయి మాటను తెక్క చేయకుండా ఆ కుర్రవాడిని పట్టుకుకోబోయింది. సాయి గట్టిగా ఒక తన్ను తన్నారు. ఆ వికృత రూపం గట్టిగా అరుస్తూ అక్కడ నుండి దూరంగా పారిపోయింది.
సాయి అప్పుడు ఆ వచ్చిన వికార రూపి కలరా దేవత అని చెప్పారు అక్కడున్న వారందరికూ.
సాయి ఆ కలరా దేవత బారి నుండి కాపాడడు ఆ బాలకుడిని. సాయిబాబా మహా సమాధి చెందాడు.
ఆ దినం జూన్ 26, 1980. శ్రీమతి స్నేహ కిరణ్ సోదరుడు తీవ్రమయిన కాలేయపు జబ్బుతో బాధపుతున్నాడు. వారి కుటుంబంలోని అందరు సాయి భక్తులే.
స్నేహ తన సోదరునికి సాయినాథుని ఊది ఇద్దామనుకుంది. అయితే ఆ సోదరుడు వద్దు అన్నాడు.
అందరూ ఇదేమి అనుకున్నారు. అందరూ సాయినాథుని మనసారా ప్రార్ధించటం మొదలు పెట్టారు ఆ విపత్కర పరిస్థితులలో ఏమి చేయాలో అర్థం కాక. కుర్రవానిని వారించే దుష్టశక్తి అది.
మెల్లగా ఆ కుర్రవాడు నిద్రలోనికి జారుకున్నాడు. అతనికి రెండు స్వప్నాలు వచ్చాయి.
ఒక స్వప్నంలో తన మంచం చుట్టూ ఊదిని, వెలుగుతున్న దీపాన్ని, కొబ్బరి కాయను చూచాడు. ఆ స్వప్నం అంతరించింది. మరో స్వప్నం మొదలైంది.
సాయిబాబా రాతిపై ఠీవిగా ఆసీనుడై ఉన్నాడు. ఆయన పాదముల చెంత ఒక భయంకరమైన రూపి కూర్చున్నాడు.
సాయి ”నేను అతనిని (ఆ కుర్ర వానిని) వదలను” అన్నాడు చివరి మాటగా. ఆ స్వప్నం అంతరించింది.
సాయి అపార కరుణకు హద్దు లేదు. పరిరక్షించే సాయి ముందు, ఏ దుష్ట శక్తి ఏమి చేయగలదు?
సాయి మనలను దుష్ట శక్తుల నుండి కాపాడు గాక!
Compiled By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరి బోస్
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- దుష్ట శక్తులు – బాబా వారి వివరణ
- ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ …..సాయి@366 ఆగస్టు 25….Audio
- సాయి నాణెము …..సాయి@366 జూలై 31…Audio
- ఇంటింటికి సాయి పత్రిక…..సాయి@366 జూన్ 1….Audio
- హనుమంతుని ముందరా?…..సాయి@366 సెప్టెంబర్ 26….Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments