Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Voice Support by: Mrs. Jeevani
ఒకసారి రామచంద్ర ఆత్మారాం తర్కడ్, తన స్నేహితులతో, కుటుంబంతో సాయినాథుని దర్శించటానికి రైలులో ప్రయాణం చేస్తున్నాడు.
రైలు నాసిక్ రోడ్ స్టేషన్ దాటింది. తలకు తెల్లని గుడ్డ కట్టుకున్న ఒక ఫకీరు రైలుపెట్టెలోనికి వచ్చి భిక్షను అడుగుచుండెను.
రామచంద్ర ఆత్మారాం తర్కడ్ ఆ ఫకీరుకు ఒక వెండి నాణెమును ఇచ్చి వెళ్ళమన్నాడు. ఫకీరు ఎందుకో సంశయించు చుండగా,
ఆ వెండి నాణెము అసలైనదేనని, జార్జిల బొమ్మ అచ్చువేసి ఉన్నదని తెలుపగా, ఆ ఫకీరు ఆ నాణెమును తీసుకుని వెళ్ళిపోయాడు.
తర్కడ్ కుటుంబం, స్నేహితులు ద్వారకామాయిలోనికి వచ్చి సాయిని దర్శించుకున్నారు.
రామచంద్ర ఆత్మారాం తర్కడ్‌ను చూచి ”నన్ను గుర్తించావా?” అని ప్రశ్నించాడు సాయి. ”లేదు” అని జవాబిచ్చాడు తర్కడ్.
సాయి తన జేబులో చేయిపెట్టి వెండి నాణెము తీసి ”ఇది అసలైనదేనని, జార్జిల బొమ్మ అచ్చువేసి ఉన్నదని ఒక ఫకీరుకు ఇచ్చితివి కదా” అని తర్కడ్‌కు చెప్పాడు.
వెంటనే తర్కడ్‌కు అంతా జ్ఞాపకం వచ్చింది. ”రైలులో కనబడిన ఫకీరు, నేను ఒక్కటే” అని సాయి పలికాడు. అప్పుడు అక్కడున్న వారందరకు సాయినాథుని మహిమ అర్థం అయ్యింది.
ఆ నాణెముపై ముద్రించి ఉన్న జార్జి-V మరణించాడు. జార్జి కుమారుడు కూడా మరణించాడు. జార్జి- V మనుమరాలు ఎలిజబెత్-||.
నూయీ దేశం ఒకద్వీపం. ఇది న్యూజిలాండుకు ఈశాన్య దిశలో ఉన్నది. ఆ ద్వీపం 2015 గురుపూర్ణిమ పర్వదినాన వెండి నాణేన్ని విడుదల చేసింది – ఆ రోజు 31 జూలై, 2015.
ఆ నాణానికి ఒకవైపు సాయిబాబా బొమ్మ, రెండవవైపు ఎలిజబెత్-|| బొమ్మను ముద్రించారు. దీనిని స్విట్జర్లాండ్‌లో ముద్రించారు.
ఇది ఒక ఔన్సు బరువు ఉన్న వెండి నాణెము.
దీని విలువ న్యూజిలాండ్ డాలరు.
ఒకప్పుడు తన తాతగారి (జార్జి V ) నాణేన్ని తీసుకున్న ఫకీరు రూపి సాయి, నేడు ఆ దేశపు వెండి నాణెంలో తనతోబాటుగా (ఎలిజబెత్ ) ముద్రింపబడటం అందరకూ ఆశ్చర్యకరము – సాయి భక్తులకు ఆనందదాయకము కూడా.
సాయినాథుడు దేశ, మాన, కాల పరిస్థితులకు అతీతుడు.
Compiled By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరి బోస్
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- కథలు – గాథలు …..సాయి@366 జూన్ 15…Audio
- సాయి వేసిన బేడీ…..సాయి@366 నవంబర్ 23….Audio
- భాగ్యనగరిలో సాయి ఫకీరు…..సాయి@366 జూన్ 14….Audio
- పడనీయను …..సాయి@366 జూలై 14….Audio
- ప్రకృతిని శాసించే సాయి …..సాయి@366 జూలై 12….Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments