Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Voice support by: Mrs. Jeevani
ఒకసారి రామచంద్ర ఆత్మారాం తర్కడ్ కుమారుడు జ్యోతీంద్ర తర్కడ్ బాబా వద్దకు వచ్చి ”నీవు మానవ మాత్రుడవని, దైవానివి కావు అని ఇతరులు పలుకుచున్నారు” అన్నాడు.
సాయి అందులకు ”అవును. దానిలో అసత్యము ఏమి కలదు? ఆహా! నేనెవరను? ఒక పేద ఫకీరును. నేను దైవమును కాను. దేవుడెంతో గొప్పవాడు! దైవముతో నెవరూ పోల్చుకొన దగరు” అన్నాడు.
జ్యోతీంద్ర ”సాయిబాబా! నీవు అట్లు పలుకుచు మమ్ములను మోసపుచ్చు తున్నావు. నీవు దేవుడవని మేము సంపూర్ణముగా విశ్వసింతుము” అన్నాడు సాయితో.
అదే సమయంలో ద్వారకామాయిలోనికి ఇరువురు వచ్చి సాయి బాబా పాదములకు మొక్కిరి.
వచ్చిన ఆ ఇరువురితో సాయిబాబా ”నా భక్తులను గూర్చి నేను జాగ్రత్త పడవలయును. నా భక్తుడు ఎవడైనను కూలుచున్న, నా నాలుగు చేతులు చాచి వానిని లేవనెత్తి వానిని నేను ఆదుకొన వలయును. నా వానిని ఎందునూ పడనీయను, చెడనీయను” అన్నారు.
జ్యోతీంద్ర ”బాబా ఇప్పుడే నేను దేవుడను కాను నేనొక పేద పకీరును అంటివే! అట్టి ఎడల నీ వెట్లు నాలుగు చేతులు కలిగి యున్నావు?” అని చనువుగా ప్రశ్నించాడు.
సాయి సమాధానము చెప్పక చిరునవ్వు నవ్వాడు. సాయి దైవమే. సందేహం లేదు. అయితే తానే పడువాడిని పట్టుకొనడు!
పడనీయడు!!
సపత్నేకర్ దంపతులకు సంతానం లేదు. ఆ దంపతులు సాయిని శరణు జొచ్చారు.
సాయి సపత్నేకర్ భార్యతో ”తీసుకో ఒకటి, రెండు, మూడు, నాలుగు నీకెన్ని కావాలో అన్ని” అన్నాడు భావగర్భితంగా.
అంటే సాయి వారిని కరుణించాడు. పుట్టిన పసి బిడ్డలతో సాయిని దర్శించేవారు ఆ దంపతులు.
14 జూలై, 1918న వారికి దినకర్ పుట్టాడు. రెండు, మూడు నెలల వయసున్నప్పుడు సాయి దర్శనానికి పిల్లవానిని షిరిడీ తీసుకు వెళ్ళారు. దినకర్‌ను సాయి పాదాలచెంత ఉంచారు.
సాయి ఆ పసి వాడిని ఎత్తుకుని పైకెగర వేశారు, పట్టుకోవానికి ప్రయత్నించలేదు. ఎవరో భక్తుడు పట్టుకున్నాడు. ఆ తల్లి కూడా నిశ్చింతగా ఉంది.
సాయి సన్నిధిలో ఎటువంటి ఆపద కూడా జరగదని ఆ తల్లే అన్నది.
ఒక భక్తుడు పసివాడిని పట్టుకుంటాడని సాయిబాబాకు ముందే తెలుసు. అందుకే ఆయన ప్రయత్నించలేదు! సాయిపై ఎంతటి భక్తి, విశ్వాసం.
అట్టి నమ్మకము మనకు కూడా అలవడును గాక!
Compiled By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరి బోస్
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- కథలు – గాథలు …..సాయి@366 జూన్ 15…Audio
- భాగ్యనగరిలో సాయి ఫకీరు…..సాయి@366 జూన్ 14….Audio
- పట్టించుకోవటం లేదు…..సాయి@366 నవంబర్ 14….Audio
- నడిపించే అదృశ్య శక్తి…..సాయి@366 జూలై 6….Audio
- నాస్తికులకు సాయే శరణం…..సాయి@366 ఆగస్టు 14….Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments