నడిపించే అదృశ్య శక్తి…..సాయి@366 జూలై 6….Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba



Voice support by: Mrs. Jeevani


రాహూరీ  గ్రామములోని కులకర్ణి ఉపాసనీని తప్పకుండా షిరిడీకి వెళ్ళి బాబాను దర్శించమని చెప్పాడు.

ఉపాసనీ జూన్‌ 27, 1911లో షిరిడీకి వెళ్ళి బాబాను దర్శించాడు. ఆ రోజు మంగళవారం. రెండు రోజులు సాయి సన్నిధిలో గడిపాడు ఉపాసనీ.

ఇంటికి తిరిగి వెళ్ళటానికి అనుమతి అడిగాడు సాయిని. ”అప్పుడే వెళ్ళుటయా? మరల ఎప్పుడు వచ్చెదవు” అన్నాడు సాయి.’‘తిరిగి వచ్చుటకు సాధ్యము కాదు” అన్నాడు ఉపాసనీ.

”ఇక్కడే ఉండుము. వెళ్ళ వలదు. ఇప్పుడు వెళ్ళెదవేని వారము రోజులలో తిరిగి రమ్ము” అన్నాడు సాయి. ఏమి చేయుటా? అని ఆలోచింపసాగాడు ఉపాసనీ.

”సరే వెళ్ళుము – నా చేతనగు పనిని నేను చేసెదను” అని పలికాడు సాయి.

అదియే అనుమతిగా భావించి షిరిడీ నుండి బయలు దేరాడు. ఆ దినము 29.6.1911, గురువారం – సమయం మధ్యాహ్నం 3 గంటలు.

ఉపాసనీ దారిలో గ్రామాలలో ఆగుతూ, విశ్రాంతి తీసుకుంటూ ఇంటిదారి పట్టాడు. ఏడు రోజులు గడిచాయి. అది ఎనిమిదవ రోజు.

ఆ రోజున విచారిస్తే, తాను షిరిడీ నుండి 8 మైళ్ళు మాత్రమే నడిచానని ఆశ్చర్యపోయాడు. ఈ ఎనిమిది దినములలో తాను పయనించింది కేవలము 8 మైళ్ళేనా? కోపర్‌గాంలో బ్రహ్మచారి బువాను కలిశాడు.

ఆయన ”షిరిడీకి వెళ్ళి సాయిని దర్శించుకో” అని ఉపాసనీకి సలహా ఇచ్చాడు. అది నచ్చలేదు ఉపాసనీకి.

ఎవరో యాత్రికుల బృందం షిరిడీకి పోతుంటే వారితో తప్పని సరిగా వెళ్ళ వలసి వచ్చింది ఉపాసనీకి. ఆ దినం జూలై 6, 1911 గురువారం.

సాయి బాబా ”వచ్చావా? ఎప్పుడు వెళ్ళావు?” అని అడగగా ఉపాసనీ ”పోయిన గురువారం 3 గంటలకు అని బదులిచ్చాడు”.

సాయి : ఇక్కడ నుండి బయలు దేరి ఎన్ని రోజులయింది?

ఉపాసనీ: వారం. ఈ రోజుకు 8 రోజులు.

సాయి : 8 దినములలో తిరిగి రానంటివే?

ఉపాసనీ: ఇది ఎలా జరిగిందో నాకు తెలియటం లేదు. ఇదంతా మీరు చేసిన పనే.

సాయి : చూడు. ఈ 8 రోజులు నేను నీలోనే ఉన్నాను. పో.

పోయి వాడాలో ఉండు.

ఉపాసనీకి అర్థమైంది సాయినాథుని అద్భుత శక్తి.

ఆ తండ్రికి శరణాగతుడయ్యాడు – ఆ దినం 6 జూలై, 1911.

మనమూ సాయికి శరణాగతుల మవుదాం.

Compiled  By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరి బోస్

Collected and Presented By: Mr: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles