Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Voice Support By: Mrs. Jeevani
సాయిబాబా వర్ధంతి కార్యక్రమాలు కాశీలో జరుపుదామని ఉపాసనీ బాబాకు ఆలోచన వచ్చింది.
1920 ఏప్రిల్ నెలలో హనుమజ్జయంతికి ఆ కార్యక్రమాలు ముగిసాయి. 11 రోజులపాటు ఘనంగా జరిగిన ఆ కార్యక్రమాలు ఏప్రియల్ 3, 1920న హనుమజ్జయంతితో ముగిసినవి.
12వ రోజున సంతర్పణ కార్యక్రమం ఉన్నది. దానికి రావ్ సాహెబ్ సాఠే, బాపూ సాహెబ్ జోగ్, యశ్వంతరావ్ బోరవేకే, మెహర్ బాబా, దుర్గాబాయి మొదలైన వారు విచ్చేసారు.
ఉపాసనీ మహారాజు అందుకుగాను కాశీలో ఒక హనుమాన్ మందిరం వద్ద ఏర్పాట్లు చేయించారు.
శతచండీ యాగాన్ని నిర్వహించారు. నలభైమంది బ్రాహ్మణులుతో భగవద్గీత, రామగీత, సప్తశతి, ఆధ్యాత్మ రామాయణము, విష్ణు సహస్ర నామము పారాయణ చేయించారు ఉపాసనీ.
సాయిబాబాకు ఇతర గురువులకు ఉత్తర క్రియలు జరిపారు ఆయన.
పరిసమాప్తి కార్యక్రమంగా అన్న దానము ఏర్పాటు చేశారు. కొన్ని వేలమందికి సంతర్పణ ఏర్పాట్లు ఘనంగా చేశారు.
సాయిబాబా పెద్ద చిత్రపటం అందరి దృష్టిని ఆకర్షించిందని వేరుగా చెప్పనక్కర లేదు.
సాయిబాబా ఫోటోను చూచిన కొందరు ఛాందసులు ”సాయిబాబా మహమ్మదీయుడు. మహమ్మదీయుని పేరున జరిగే అన్న సంతర్పణలో మేము భుజించము” అన్నారు. వారిని చూచి మిగిలిన వారు వంత పాడరు.
ఇది ఉపాసనీకి పరీక్ష వంటిది అయింది.
ఉపాసనీ తాను కూడ ఒక బ్రాహ్మణుడేనని, సద్గురుమూర్తి సాయిబాబా సకల మతాతీతుడని వారికి ఎంతగానో నచ్చచెప్పాడు.
కానీ, ఆ బ్రాహ్మణులందరు ఒకే మాట మీద ఉన్నారు. ఉపాసనీ దక్షిణగా రూ.5/- బదులు రూ.15/- ఇస్తానన్నాడు. వారు కొంత మెత్తబడ్డరు.
సాయి ఫోటోను కిందకి దింపితే చాలు అన్నారు. ఫోటోనే గదా కాసేపు ప్రక్కన పెడదాం అనే ఆలోచనే రాలేదు ఉపాసనీకి.
పరబ్రహ్మ స్థాయిలోని సాయిని నేలబారుగా దిగజార్చలేదు. మీరు భోజనం చేయకపోయినా ఫరవాలేదు, అని గంగ ఒడ్డున జరిగే అన్న దానానికి రమ్మని కాశీలో చాటింపు చేయించాడు..
ఆ చాటింపు విని సుమారు 15 వేల మంది వచ్చి భోజనం చేశారు. కాశీ పండితులు బేరానికి వచ్చారు. వారికి ఉపాసనీ లొంగలేదు.
సాయి ప్రసాదం ఎవరికి ప్రాప్తమో ఎవరికి ఎరుక?
Compiled By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరి బోస్
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- గురుత్వాన్నిచ్చిన సాయి…..సాయి@366 జూలై 27….Audio
- ఉపాసనీ మహారాజ్ విగ్రహం …..సాయి@366 జనవరి 13….Audio
- సాయి తారక మంత్రము…. మహనీయులు – 2020… మే 15
- దీక్షిత్ వాడా …..సాయి@366 ఏప్రిల్ 7….Audio
- నడిపించే అదృశ్య శక్తి…..సాయి@366 జూలై 6….Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments