Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Voice Support By: Mrs. Jeevani
మెహర్ బాబాకు పంచ సద్గురువులున్నారు. వారు బాబా జాన్, సాయిబాబా, ఉపాసనీ బాబా, తాజుద్దీన్ బాబా, నారాయణ మహారాజ్.
ఉపాసనీ మహారాజ్ ను గూర్చి మాట్లాడుతూ మెహర్ బాబా ” ఆయన ఎంత గొప్ప వారంటే, ఆయన అనుగ్రహం ప్రసరిస్తే ధూళి రేణువు కూడా దైవంగా మారిపోతుంది” అన్నారు.
ఉపాసనీ మహారాజ్ సాకోరీలో మహాసమాధి చెందారు. ఆయన సజీవులుగానే ఉన్నప్పుడు చెక్కబడిన పాలరాతి విగ్రహం గోదావరి మాత చేతుల మీదుగా జనవరి 13, 1942 న పింజరాలోప్రతిష్టించారు. పాదుకలు కూడా ప్రతిష్టించారు.
సాయిబాబా వలే ఉపాసనీ మహారాజ్ కూడా మహాసమాధి అనంతరం అనేక లీలలను చూపారు.
దేహ భావాన్ని విడనాడాడు ఉపాసనీ మహారాజ్. ఆయనకు జీర్ణకోశం దెబ్బతింది. ఆపరేషన్ చేయాలని డాక్టరు సలహా ఇచ్చారు.
భక్తులందరూ ఆయనను ఆపరేషన్ చేయించుకొమ్మన్నారు కూడా. వారి మాటను కాదన లేదు. దేహంపైన భ్రాంతి లేదు ఆయనకు.
చివరకు వార్దాకు చెందిన ఒక పార్శీ సర్జనును ఖరారు చేశారు. ఉపాసనీ తనకు క్లోరోఫారం గాని, ఏ ఇతర మత్తు పదార్థంగాని ఇవ్వనవసరం లేదన్నాడు.
ఆ సర్జను మొల్లలను కత్తిరించి, ఎర్రగా కాలే ఇనుప కమ్ములతో కాల్చి, కుట్టు లేశాడు. ఇదంతా అరగంట పైననే పట్టింది. దీనిని ఉపాసనీ ఓర్చుకున్నారు.
అమ్మ, అబ్బా, అనలేదు. ఇంకా విచిత్రం ఏమిటంటే ఆ సర్జనునే ” ఊ! కానీయండి డాక్టర్, ఏం పరవాలేదు” అని ప్రోత్సహించారు. ఆయన ఓరిమికి అందరు అచ్చెరువొందారు.
సాయిబాబా మహాసమాధి చెందాడు – తత్వం తెలియని వారికి సాయి లేడు.
1927లో తారాబాయి తన కుటుంబంతో షిరిడీకి వచ్చింది. అప్పుడు ఆమె గర్భవతి. షిరిడీ చేరిన తరువాత ఆమె గర్భములో ఉన్న శిశువు మృతి చెందెను.
ఆమె భర్త సదాశివ తర్కడ్ సాకోరి వెళ్ళి ఉపాసనీ మహారాజ్ ను వేడుకున్నాడు.
ఉపాసనీ మహారాజ్ “నీకు షిరిడీలో ఉత్తమోత్తమ వైద్యుడు, మంత్రసాని గలరు. నా దగ్గరకు ఎందుకు వచ్చావు?” అని షిరిడీకి పంపివేశాడు.
సాయి మహాసమాధి చెందాడు అనునది భావన మాత్రమే. తారాబాయికి సాయి ఆదేశము ఇచ్చాడు. ఆ ప్రకారమే చేశారు తారాబాయికి.
ఆమె తిరిగి ఆరోగ్యం పొందింది. అటువంటి కాలాతీతుడైన సాయినాధుని ఉన్నత సృష్టి అయిన ఉపాసనీ మహారాజ్ ను స్మరించెదము గాక!
Written by: Mullapudi Panduranga Sainath & Munnaloori Bose.
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- సాయి తారక మంత్రము…. మహనీయులు – 2020… మే 15
- గురుత్వాన్నిచ్చిన సాయి…..సాయి@366 జూలై 27….Audio
- గంగం గణాంబొతే – గం గం గోదావరి …..సాయి@366 డిసెంబర్ 24….Audio
- భగవానుని పాదుకలు …..సాయి@366 ఆగస్టు 27….Audio
- నడిపించే అదృశ్య శక్తి…..సాయి@366 జూలై 6….Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments