నిరీక్షణలో ఆనందం. …..సాయి@366 జనవరి 12….Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba



Voice Support By: Mrs. Jeevani


అది బొంబాయి పరిసర ప్రాంతము బాంద్రా. హేమాడ్  పంత్ అని పిలువబడే సాయి భక్తుడు కళ్ళలో ఒత్తులు పెట్టుకుని చూస్తున్నాడు – సాయి రాక కోసం.

అది దహను గ్రామం. ఆ గ్రామంలో బాలకృష్ణ విశ్వనాధ దేవ్ అనే బాబా భక్తుడు సాయి రాక కోసం ఎదురు చూస్తున్నాడు – “మీ ఇంటికి భోజనానికి వస్తున్నాను” అన్న సాయి మాట మీద.

ఇక ఆంద్రప్రదేశ్ కల్లూరు గ్రామం (కర్నూలు జిల్లా). ఆ దినం రామిరెడ్డి తాత కల్లూరు గ్రామ సరిహద్దులలో నిలబడి ఎదురు చూస్తున్నాడు.

ఆయనకు ఎవరినుండి, ఎట్టి సమాచారమూ లేదు – తాము వస్తున్నామని, మరి అయన ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు?

షిరిడీలోని శ్రీ శివనేశన్ స్వామీజీకి ఒక భక్తుడు లండన్ లో తయారు చేయించిన “ద్వారకామాయి సాయిబాబా” నిలువెత్తు ఫోటోను సమర్పించగా, ఆయన కల్లూరులోని రామిరెడ్డి తాత గారి నివాసమే సరియగు స్థలమని నిర్ణయించుకొని, ఆ పటమును రామిరెడ్డి తాత గారికి చేరు ఏర్పాట్లను చేశారు.

ద్వారకావాసి సాయి కర్నూలు దాకా వచ్చారు రైలులో. ఇక అత్యంత వైభవముగా అలంకరించిన వాహనములో మంగళవాయిద్యములతో కల్లూరుకు వేంచేస్తున్నాడు ద్వారకా వాసి సాయి.

సాయి చిత్రపటమునకు సాయికి తేడా లేదనునది ప్రాధమిక సూత్రము.

కల్లూరు గ్రామ సరిహద్దులలో నిలబడిన శ్రీ రామిరెడ్డి తాత గృహమునకు విచ్చేయు సాయిని స్వయముగా స్వాగతించుటకే.

ఒక అవధూత (రాక) కొరకు ఎండలో నిలబడి నిరీక్షించు దృశ్యమును చూచిన, ఆ భక్తులందరకూ ఆనందం కలిగింది. రోడ్డు మీదనే ఆ ఇరువురుకు సాస్టాంగ నమస్కారాలు గావించారా భక్తులు.

సాయిబాబా మహాసమాధి చెందక పూర్వమే కాదు, అనంతరము సగటు మనుజులకే కాదు, మహనీయులకు, సత్పురుషులకు, అవధూతలకు శిరోధార్యమే అయ్యాడు.

రామిరెడ్డి తాత తన వద్దకు వచ్చిన వారిని సాయిని చూపి పూజింపమనే వారు.

ఆయన ఆరతులలోని భాగములను స్వయముగా గానం చేసేవాడు. మందిరములకు, సప్తాహములకు, ప్రారంభోత్సవ, ప్రతిష్టలకు లెక్కలేదు.

ఒకసారి రామిరెడ్డి తాత షిరిడీని జనవరి 12, 1992న దర్శించారు.

అప్పుడు స్వయంగా శ్రీ శివనేశన్ స్వామి ఆయనను స్వాగతించటమే గాక ఏ మహనీయునకు జరగని గ్రామోత్సవం రామిరెడ్డి తాతగారికి జరిపించారు.

Written by: Mullapudi Panduranga Sainath &  Munnaloori Bose.

Collected and Presented By: Mr: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles