తాజుద్దీన్ బాబా…..సాయి@366 జనవరి 27….Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba



Voice Support By: Mrs. Jeevani


సాయిబాబాను పిచ్చివాడు అన్నారు. సాయి సమకాలీకుడైన తాజుద్దీన్ బాబాను పిచ్చివాడు అనటమే కాదు చెరసాలలో కూడా ఉంచారు.

జనులందరిని సన్మార్గంలో పెట్టదలచుకోవటమే పిచ్చి పని ఏ నాడైనా. ఆ విషయానికొస్తే సత్పురుషులందరూ పిచ్చివారుగానే కన్పిస్తారు.

సాయిబాబాను తాజుద్దీన్ బాబా బంగారు మామిడి చెట్టుగా వర్ణించారు.

ఒకసారి సాయిబాబా పక్కనున్న నీటి కుండని పదే పదే తట్టారు. అక్కడ ఉన్నవారికి సాయి అలా ఎందుకు చేస్తున్నాడో ఊహించలేక పోయారు.

“కారణం ఏమిటి?” అని ఎవరో అడిగారు. సాయిబాబా అప్పుడు “నాగపూర్ లోని తాజుద్దీన్ బాబా కుటీరం అంటుకుంటే ఆర్పుతున్నాను” అన్నారు.

ఎక్కడ షిరిడీ, ఎక్కడ నాగపూర్, అక్కడి మంటలను ఇక్కడ ఆర్పటమా? కాని సాయి ఎప్పుడు అసత్యం పలుకడు.

అలా అసత్యం పలికి సద్గురువుగా చలమణి అవుదామన్న కోర్కె ఆయనకు లేదు. ఈ విషయం గురించి వాకబు చేశారు. సాయి చెప్పింది నిజమేనని తేలింది.

తాజుద్దీన్ బాబా నాగపూర్ దగ్గరలో ఉండేవారు. కోటీశ్వరుడైన బుట్టీ కూడా నాగపూర్ నివాసి.

ఒకసారి బుట్టీ తాజుద్దీన్ బాబా సన్నిధికి రాగా ఆయన “నీవు ఇక్కడకు ఎందుకొచ్చావు? నీ గురువు షిరిడీలో నీ కోసం ఎదురు చూస్తున్నాడు. నీ విషయంలో జోక్యం చేసుకోవటానికి నేనెవరిని?

సాధ్యమైనంత తొందరగా అక్కడకు వేళ్ళు” అన్నారు గాని కోటీశ్వరుడైన బుట్టీని తన భక్తులలో చేర్చుకోలేదు ఆయన.

పతితులారా, భ్రష్టులారా, ఏడవకండేడవకండి…

ఎందుకంటే మహనీయుల దగ్గరకు అందరూ మంచి వారే రారు. అపరాధులు, హంతకులు, బందిపోట్లు, దొంగలు, వ్యభిచారులు, రాజకీయ వ్యక్తులు వంటి తమోగుణాలతో మెలిగేవారు కూడా తాజుద్దీన్ బాబాను సేవించి పునీతులయ్యారు.

ఒక మహిళ “పుణ్యాత్ములే ఉన్నారిక్కడ, చెడ్డవారు ఎక్కడకు వెళ్ళాలి?” అనే భావంవచ్చే గీతాన్ని పాడింది.

వెంటనే “మంచి వారంతా అటు వెళ్ళండి, ,చెడ్డవారంతా ఇటు రండి” అన్నారు తాజుద్దీన్ బాబా.

“ఓ దేవా! పుణ్యాత్ములను నీ దగ్గరకు చేర్చుకో, చెడ్డవారు నా దగ్గరుంటే చాలు” అనే తాజుద్దీన్ బాబా కరుణ సముద్రానికి ఎల్లలు లేవు.

ఒకసారి తాజుద్దీన్ బాబా తన దృష్టిని ఆకాశం వైపు మరల్చి “మమ్మల్ని అడగండి?” అన్నారు.

“ఓ ప్రభువా! మమ్మల్ని అడగండి. ఈ భక్తులను ఏమి అడగవద్దు. ఎందుకంటే వీరందరు నా వెంట ఉన్నారు, నా వారు కాబట్టి” అని పలికారు దైవంతో.”

సాయికూడా చాలా సార్లు అనేవారు తన పైసా (భక్తుడు)కు తానే లెక్క చెప్పాలని.

తాజుద్దీన్ జనవరి 1861 లో జన్మించారు. ఈనాడే ఆ సుదినం, జనవరి 27.

Written by: Mullapudi Panduranga Sainath &  Munnaloori Bose.

Collected and Presented By: Mr: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles