Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Voice Support By: Mrs. Jeevani
భక్తులకు ఆశీర్వాదాన్నిచ్చేటప్పుడు సాయిబాబా సాధారణంగా “అల్లా భలాకరేగా” అనేవారు.
ఏ గొప్పదనాన్ని తనపై ఆపాదించుకునే వారు కాదు. ఎప్పుడూ “అనల్ హాక్” నేనే పరమేశ్వరుడిని అనేవారు కాదు. యాదేహక్ అంటే నేను పరమేశ్వరుడుని స్మరించే వాడిని అని అనేవారు సాయి.
అనల్ హాక్ అని అనుట ముస్లిం మతానికి విరుద్ధం. సాయిబాబా సమకాలికురాలు బాబా జాన్ జన్మదినం జనవరి 28గా మెహర్ బాబా తెలిపారు. అయితే సంవత్సరం తెలుపలేదు.
ఆమె అసలు పేరు గుల్ రుఖ్ అంటే అందమైన పువ్వు! గులాబీ చెక్కిళ్ళు అని అర్ధం. పేరుకు తగ్గట్టుగానే ఆమె రూపం ఉండేది.
చిన్న వయస్సులోనే ఖురాన్ కంఠస్థము చేసింది. ఆధ్యాత్మికంగా ఉండేది, ఒంటరిగా ప్రార్థనలతో గడిపేది.
ఆమెకు వివాహం చేయవలసిన రోజున ఆమె ఇల్లు వదలి వెళ్ళిపోయినది. పంజాబు చేరింది.
ఆధ్యాత్మిక చింతనలో ఉండెడిది. ఒక్కొక్కసారి “ప్రపంచాన్ని సృష్టించినది నేనే” అనేది.
‘అనల్ హాక్’ అనటం అక్కడి ప్రజలకు రుచించలేదు. గతంలో అనల్ హాక్ అనిన వారు చిత్రహింసలకు గురి అయ్యారు.
హల్లజ్ ను ఖండ ఖండాలుగా ఖండించారు.
శామ్స్ తబ్రియేజ్ తోలును వలిచారు.
ఇక ‘గుల్ రుఖ్’ వంతువచ్చింది. ఆమెను బెలూచీ సైనికులు గొయ్యి తీసి పాతిపెట్టారు. తమ మతమును కాపాడుతున్నామని అనుకున్నారు ఆ సైనికులు.
అంతటితో గుల్ రుఖ్ గాథ ముగియలేదు. అయితే ఆమె సజీవ సమాధి చెందలేదు. ఎలా బతికి బట్ట కట్టిందో తెలియదు. చివరకు ఆమె పూనాలో స్థిరపడ్డది.
ఆమెను సజీవ సమాధి చేసిన బెలూచీ సైనికులు ఆమెను గుర్తించారు, ఆశ్చర్యపోయారు, సేవకులుగా, ఆరాధకులుగా అయ్యారు.
ఆమెను “హజరత్ బాబా జాన్” అనేవారు. ఆమె బట్టలు బాగా లేకున్నా తేజస్సు సూర్యకాంతిలా వెలిగిపోయేది.
ఆమె గురువు కాలేదు. ఆధ్యాత్మిక బోధనలు చేయలేదు. ఆమె దర్శనం ఆధ్యాత్మికతను కలిగించేది, ప్రశాంతతను ఇచ్చేది.
సాయి వలె సందర్శకులోని అహంభావాన్ని తొలగించేది. ఒకసారి ఆమె వద్దకు ఒక ధనికుడు వచ్చి తన జేబులోని డబ్బులను గలగలలాడించి ఆమెతో ఒక టీ షాపులో టీ తాగాడు.
డబ్బు ఇవ్వటానికి జేబులో చేయిపెట్టాడు. చేతికి ఏమి తగలలేదు. నవ్వుతూ బాబా జాన్ ఆ టీకి డబ్బు చెల్లించింది.
తీరా ఆమె నివాసానికి వెళ్ళగానే, ఆ ధనికుని జేబులోకి డబ్బులు వచ్చాయి. ఆమె మరలా నవ్వింది.
హనుమంతుని ముందరనా కుప్పిగంతులు.
నేడు జనవరి 28, బాబా జాన్ పుట్టిన రోజు. మనలోని అహంకారాన్ని తొలగింపమని ఆమెను, సాయిబాబాను వేడుకుందాము!
Written by: Mullapudi Panduranga Sainath & Munnaloori Bose.
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- అణువు అణువున పలికిన దేవా!…. మహనీయులు – 2020… మార్చి 29
- అబ్బా! దెబ్బ…..సాయి@366 సెప్టెంబర్ 28….Audio
- తాజుద్దీన్ బాబా…..సాయి@366 జనవరి 27….Audio
- గూడు చేరిన పక్షి…..సాయి@366 జనవరి 26….Audio
- ఆధ్యాత్మిక పథం – ఓ జారుడుబండ … మహనీయులు – 2020 – జనవరి 15
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments