Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
సాయిబాబా మన్సూర్ హల్లజ్ ను గూర్చి పలికేవారు. అతడు సూఫీ యోగి, తత్వవేత్త, నిర్భయుడు.
“నేను నా యజమానిని హృదయ నేత్రంతో దర్శించాను. ‘నీవెవరివి?’ అన్నాడు ప్రభువు. నీవు అన్నాను నేను” అని మన్సూర్ హల్లజ్ వ్రాశాడు.
అంతకంటే వేరే సత్యమేముంటుంది? హల్లజ్ భావావేశములో అనల్ హాక్ (నేనే సత్యమును) అనేవాడు.
అనల్ హాక్ అనునది దైవమునకున్న 99 నామములలో ఒకటి. అల్లాను తానే అని ప్రకటించుకొనుచున్నాడని వదంతి వ్యాప్తి చెందింది. ఆయనను ‘అనల్ హాక్’ అనే పదాన్ని వెనుకకు తీసుకొమ్మని ఒత్తిడి వచ్చింది.
ఆయన వెనకకు తీసుకునేందుకు అంగీకరించలేదు. చెరసాల పాలైనాడు.
చెరసాలలోని ఖైదీలను చూచి “మీకు విముక్తి కల్గించేదా?” అన్నాడు. “సరే” అన్నారు ఖైదీలు. ఖైదీల బంధనాలు తొలగిపోయాయి. వారు పారిపోయారు.
ప్రభుత్వం బెదిరిపోయి హల్లజ్ కు ఉరిశిక్ష విధించింది. అయితే తాను పలికిన అనల్ హాక్ ను వాపసు తీసుకుంటే శిక్ష రద్దు అన్నది ప్రభుత్వం.
హల్లజ్ అంగీకరించలేదు. ఆ దినం మార్చి 29, 913 సంవత్సరం. హల్లజ్ శిక్షకు గురికావలసిన దినం. నేల ఈనినట్లు జనం వచ్చారు. మొదట ఆయన కాళ్ళను నరికివేశారు. ‘అనల్ హాక్’ అన్నాడు హల్లజ్.
ఇక చేతులను ఖండించారు. శిరస్సును ఖండించబోతున్నారు. ప్రజలు వద్దన్నారు ప్రభుత్వాన్ని, కానీ ప్రభుత్వం అంగీకరించలేదు. ప్రజలందరూ ‘అనల్ హాక్’ అని బిగ్గరగా అరిచారు. అది చాలు హల్లజ్ కు.
ప్రజలు సత్యం దగ్గరకు చేరువవుతున్నారు. శిరచ్చేదం చేసారు. స్రవిస్తున్న రక్తం నుండి ‘అనల్ హాక్’ అనే మాటలు వినబడ్డాయి.
అతనిని శిక్షకు గురిచేస్తున్నంతసేపు ‘తనయా, హల్లజ్ భయపడకు” అనే మాటలు శిక్షకు గురిచేసే వారికి వినబడ్డాయి.
శరీరాన్ని కాల్చివేశారు. బూడిద అనల్ హాక్ అనసాగింది. అది విన్న ప్రభుత్వం ఆ బూడిదను టైగ్రిన్ నదిలో కలిపించింది.
టైగ్రిన్ ఉప్పొంగింది. నగరాన్ని ముంచివేయటానికి పెద్ద పెద్ద అలలతో వస్తోంది జలప్రవాహము.
ఇదంతా జరుగుతుందని, జల ప్రవాహాన్ని అరికట్టాలంటే తాను వాడే దుస్తులను నది అలల ముందు ఉంచండి అని ముందుగానే హెచ్చరించాడు తన స్నేహితునకు.
ఆ స్నేహితునకు జ్ఞప్తికి వచ్చి హల్లజ్ ధరించిన దుస్తులను నగరాన్ని కబళించవస్తున్న అలల ముందు ఉంచాడు. నది పరమ శాంతమూర్తియై వెనుకకు మరలింది.
ఆ అద్వైతి అనంతునిలో లీనమైన దినం మార్చి 29.
ఆ అనంత సత్యాన్ని ఆకళింపు చేసుకుందుము గాక!
Written by: Mullapudi Panduranga Sainath & Munnaloori Bose.
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- బాబా …..సాయి@366 జనవరి 28….Audio
- తరగని నిధి …..సాయి@366 డిసెంబర్ 14….Audio
- ఓం చితంబరాయ నమః…. మహనీయులు – 2020… మార్చి 7
- జీవన్ముక్తుడు.. …. మహనీయులు – 2020… డిసెంబరు 7
- సేవ చేసే విధము తెలియండి…. మహనీయులు – 2020… మార్చి 14
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments