తరగని నిధి …..సాయి@366 డిసెంబర్ 14….Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba



Voice Support By: Mrs. Jeevani


సాయిబాబా డిసెంబరు 14 ,  1911 “దేవుడిచ్చింది పోదు, మానవుడిచ్చింది నిలువదు” అన్నారు. సాయి జీవితమే అందుకు తార్కాణం.

సాయిబాబాకు గాని ఇతరులకు గాని దైవం ఇచ్చినవేమిటి? అని ఆలోచిస్తే ఎన్నో ఉన్నాయి. వాటిలో ఒకటి క్షమాగుణం.

సాయి తనను అంతమొందించడానికి వచ్చిన పఠాన్ ను క్షమించి వదలి వేశాడు.

దయానంద సరస్వతి పేరు విననివారుండరు. ఒకసారి జోధ్ పూర్ మహారాజు యశ్వంత్ సిన్హాగారు ఆహ్వానిస్తే వెళ్ళారు.

ఆ మహారాజు ఒక వేశ్యకు దాసుడవటం గమనించారు దయానందులు. మహారాజు అలా వేశ్యలకు దాసులు కాకూడదన్నారు.

ఆ వేశ్య పగపట్టింది దయానందుల మీద. జగన్నాధుడు అనే వంట వానితో కుమ్మకైంది. వానిని లోబరచుకున్నది.

పాలలో సీసపు  పొడిని కలిపించి, నమ్మకంగా దయానందులచే త్రాగింపచేసింది. శరీరమంతా ఒకటే బాధ దయానందులకు.

కారణం గ్రహించాడు తన యోగ శక్తిచే, అయితే నివారణ చేసుకొనే సమయం దాటిపోయింది

జగన్నాథుని ఒంటరిగా పిలిచాడు దయానందులు. నేడో, రేపో అసలు కారణం మహారాజుకు తెలుస్తుందని, వంటవానికి దారుణమైన శిక్ష వేస్తాడని దయానందులకు తెలుసు.

తనవద్ద నున్న 500 రూపాయలను వంటవానికి ఇచ్చి, ఈ రాజ్యం నుండి నేపాల్ కు పోయి ప్రాణాలు కాపాడుకొమ్మన్నారు.

తన ప్రాణం తీసిన వానిని కూడా క్షమించి, జీవింపచేసే సంస్కారవంతుడు దయానంద సరస్వతి. అయన దయానందుడు కాదు – దయాసాగరుడు.

ఈ క్షమా గుణాన్ని ఇచ్చింది దైవమె కానీ, ఇతరులు కాదు. “నేనే సత్యాన్ని” అని చెప్పాడు హల్లజ్.

ఆయనను వాళ్లకు వ్యతిరేకిగా భావించి మరణ దండను విధించాడు రాజు. ఆయనని ఖండ ఖండాలుగా కోసి ఖననం చేసి ఆ ఖండాలను బుగ్గి చేసి టైగ్రిన్ నదిలో పారవేశారు.

ఆ నది పెద్ద ఎత్తు అలలుగా లేచి ఆ రాజ్యాన్ని ముంచివేయ వస్తోంది. ఇదంతా చూస్తున్న హల్లజ్ సేవకుడు వెంటనే ఇంటికి వెళ్ళి హల్లజ్ ధరించే బట్టను ఆ నది ముందుంచాడు.  అలలు చిత్రాతి చిత్రంగా ముందుకు సాగకుండా ఆగిపోయాయి.

హల్లజ్ గతంలోనే తన అనునాయునికి ఇలా జరుగుతుందని చెప్పి తాను ధరించిన బట్టను నది ముందుంచితే అది శాంతిస్తుందని చెప్పాడు. హల్లజ్ ఆ రాజ్యాన్నే కాపాడాడు. అదే క్షమాగుణం.

మానవుడిచ్చినది నిలువదు, భగవంతుడిచ్చినది పోదు అనటానికి శ్రీనాథుని చివరి రచనలే సాక్ష్యం. మనం దేనికోసం పరితపించాలి?

Compiled  By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరిబోస్

Collected and Presented By: Mr: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles