తండ్రి .. …. మహనీయులు – 2020… డిసెంబరు 13



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


జీవిత చరిత్రలు చదవటం జీవితాలను మారుస్తాయా? మధుమోహన్ తనతో “శ్రీకమలాంబికా దివ్య చరితము”ను తీసుకువెళ్లాడు మద్రాసు నుండి చార్మినార్ ఎక్స్ ప్రెస్ లో ప్రయాణమయ్యాడు.

ఆ పెట్టెలో ముస్లింలందరూ నమాజు చేసుకుంటున్నారు. నేను కూడా దైవ చింతన చేసినట్లుంటుందని, ఆ జీవిత చరిత్రలో ఏ పేజీ వస్తే ఆ పేజీ చదవాలని ఒక పేజీ తెరిచాడు.

ఆ పేజీలో దేవీ భక్తురాలు బెహరా కమలమ్మగారు భవాని అనే భక్తురాలితో “నీ గొలుసు, పుస్తెలతాడూ తెగిపోతోంది, చూసుకున్నావా?” అనే సంఘటన ఉంది.

మధుమోహన్ తాను రైలు దిగేలోగా అటువంటిది తనకు జరిగితే, అది యదార్థమని నమ్ముతాను అని అనుకుని నిద్రించాడు.

అది రాత్రి సమయం. అతనికి నిద్రలో ఎవరో “నీ గొలుసు తెగిపోయింది” అని చెబుతున్నారు. వెంటనే అతనికి మెలకువ వచ్చింది. చూసుకున్నాడు.

చేతితో తన గొలుసును తడిమి చూసుకున్నాడు. గొలుసు లేదు. ఒక వైపు గొలుసు తెగి పడిపోయి ఉంది.

ఈ సంఘటన జరిగిన 10 నిముషములలోనే దిగవలసిన స్టేషన్ వచ్చింది. అది అతనికి దైవ లీలపై నమ్మకానికి నాంది అయింది.

మల్లపరాజుగారి భార్యకు పరీక్ష చేసి వైద్యులు కడుపులో బల్ల పెరుగుతోంది. ఆపరేషన్ చేయాలన్నారు.

 “18 నెలలకు ఆడపిల్ల పుడుతుంది. త్రిపుర సుందరి అనే పేరు పెట్టండి” అన్నారు కమలమ్మగారు రాజుగారితో. ఆమె చెప్పినట్లే జరిగింది.

బెహరా కమలమ్మగారు ఈశ్వరానుగ్రహమువలన మహిమాన్విత మైన దైవ లీలలతో సాటి వారి కన్నీరు తుడవటమే కాదు, అందరిలో ఆధ్యాత్మికత చైతన్యాన్ని కలిగించిన మహనీయురాలు.

ఈమె కొక్కొండ వెంకటరత్నం పంతులుగారి కుమార్తె. ఆ కాలంలో స్త్రీలు పాఠశాలలలో విద్య నేర్వటమే గగన కుసుమంగా ఉండేది.

అటువంటి కాలంలో పంతులుగారు “నా తరువాత ఈ పూజా పీఠానికి వారసురాలు ఈమెయే” అని ఆమె బాలికగా ఉన్నప్పుడే ప్రకటించారు. పంతులుగారి వాక్కు సత్య వాక్కు.

ఇక ఆ పీఠమునకు ఆయన కుమార్తెయే వారసురాలయినది. ఆమె అనంతరం పీఠాధిపతులు మహిళలే!

పెద్దబాల శిక్ష సగము చదివిన ఆమెకు వాగ్దేవి, నాలుక మీద నాట్యమాడేది. ఆమెకు భవిష్యత్ దర్శనం, వాక్సుద్ధి కలిగాయి.

అంతేకాదు, ఆమె తన తపస్సును కూడా ధారపోసి భక్తుల సమస్యలను తీర్చేది.

సాయిబాబా వద్దకు సప్తశృంగిదేవి తన పూజారిని పంపి, మనశ్శాంతి పొందుమని ఆదేశించింది.

ఆమె ఒకసారి కన్యాకుమారి యాత్ర చేయుచున్నప్పుడు తమిళ దంపతులు వచ్చి పాద నమస్కారం చేశారు.

అంతేగాక “ఎర్ర చీర ధరించి, ముఖాన పులిపిరికాయలున్న పెద్ద ముత్తయిదువుకు నమస్కరించి ప్రసాదం తీసుకోండి. సంతానం కలుగుతుంది అని అమ్మవారు కలలో కనిపించి చెప్పారు. అందుకని అలా చేశాము” అన్నారు.

తల్లి ఆశీర్వదించింది. వారికి సంతానం కలిగింది. “యథాపిత్ర తధా పుత్రి’ అనునట్లు ఆమె బ్రహ్మ రంధ్రం ఛేదించుకుని,

దేహాన్ని 13 – 12 – 1977 న అమ్మలో లీనమైంది. నేడు ఆమె వర్థంతి. వక్రము లేని మనసే మనకు శ్రీచక్రమగును గాక!

Written by: Mullapudi Panduranga Sainath &  Munnaloori Bose.

Collected and Presented By: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles