Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Voice Support By: Mrs. Jeevani
శ్రీమతి సీతారాం మూర్తి సాయిబాబా భక్తురాలు. అయితే ఆమెకు కృష్ణుడు దైవం.
సాయిబాబా ఎందరెందరికో తమ ఆరాధ్య దైవాలుగా సాక్షాత్కరించాడు. సాయి సాహిత్యం అనేక రూపాలలో సాయినాథుడు దర్శన మివ్వటాన్ని తెలుపుతొంది.
సాయి సచ్చరిత్రలో సాయి డాక్టరుకు రామునిగా కనిపించాడు. మద్రాసీ భజన సమాజం యజమానికి రామదాసుగా కనుల విందు చేశాడు.
అయితే శ్రీమతి సీతారామ మూర్తికి ఒక అనుమానం వచ్చింది. సాయి ఎవ్వరికీ కృష్ణుడుగా దర్శనమివ్వ లేదని, సాయి నేను మురళీధరుడిని కానా ఏమో, అంటాడు – కానీ మురళీధరునిగా దర్శనమివ్వలేదు.
ద్వారక ద్వారకామాయిలోనే ఉన్నదంటాడు సాయి. అయినా కృష్ణుని జాడే లేదు.
సుందరీబాయి క్షీరసాగర్ అంటే రాధాకృష్ణమాయి శ్రీకృష్ణుని భక్తురాలు. ఆమె వద్ద ఒక కాలు ముడుచుకొని ఉన్న శ్రీకృష్ణుని విగ్రహం ఉండేది.
ఆమె ఎప్పుడు ఆ విగ్రహాన్ని వదలి ఉండేది కాదు. భోజనం చేసేటప్పుడు ప్రతి ముద్దను కృష్ణుని పెదవులకు ఆనించి ప్రసాదముగా ఆమె భుజించేది.
అయితే ఆ కృష్ణ విగ్రహంలో సాయిబాబా కనిపించినట్టు లేదు. ఇంకా సాయిబాబా కూడ ఆమెకు కృష్ణునిలా దర్శన మివ్వలేదు.
గీతాచార్యుడు వ్యాఖ్యానం చెప్పినట్లు సాయిబాబా భగవద్గీతకు వ్యాఖ్యానం నానా సాహెబ్ చందోర్కరుకు చెప్పాడంటారు. కానీ, ఆయనకు ఆ గీతా చార్యునిలా దర్శనమిచ్చిన ఉదంతం ఎక్కడా కానరాదు.
కనుక ఆమె అలా నిశ్చయానికి వచ్చి వుండవచ్చును.
ఆ రోజు డిసెంబరు 13 . 1980 . ఆమె అలా ఆలోచిస్తున్నప్పుడు సాయి చిత్రము నీలిరంగుగా మారినది.
మొదట ఆమెకేమియును అర్ధము కాలేదు. కానీ ఎవరో సాయిబాబాకు నీపై ఆగ్రహము వచ్చినది అందువల్లనే రంగు మారినది అన్నారు.
ఆ రాత్రి ఆమెకు స్వప్నం వచ్చినది. ఆ స్వప్నములో సాక్షాత్కరించింది మురళీ కృష్ణుడు కాడు, సాయి బాబాయే.
సాయి ఆమెతో “నాకు కోపం లేదు. రేపు మూడు పుష్పములను నా పటం వద్ద నుంచుము” అన్నాడు. తెల్లవారింది.
భక్తితో ఆమె మూడు పుష్పములను సాయి పటం వద్ద ఉంచింది. బాబా రంగు యధాస్థితికి వచ్చినది.
కృష్ణుని ఛాయ నీలిరంగు. తాను(సాయి) నీలిరంగులో ఆమెకు దర్శనమిచ్చాడు. సాయి కొంచెం చతురతతో ప్రవర్తిస్తాడు భక్తులతో, తనను గుర్తిస్తారో లేదో చూద్దామని.
Compiled By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరిబోస్
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- పాదుకా విజయం…..సాయి@366 జూన్ 13…Audio
- ఒకరు కాదు ఇద్దరు…..సాయి@366 సెప్టెంబర్ 1….Audio
- బాధల బదిలీ…..సాయి@366 డిసెంబర్ 18….Audio
- నమ్మకానికి కిరీటం ….సాయి@366 డిసెంబర్ 11….Audio
- సాయి ఎల్లరకు ప్రభువే!…..సాయి@366 నవంబర్ 29….Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments