ఇంపు – కంపు.. …. మహనీయులు – 2020… డిసెంబరు 12



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


సాయిబాబా “అక్కడ (బీడ్) నాకు జరీ పని అంటే బంగారు, వెండి దారాలతో వస్త్రాలు నేసే పని దొరికింది. నేను కూడా విరామం తీసుకోకుండా పని చేశాను” అన్నాడు.

ఇంకా, మహారాష్ట్రలో జిప్రు అన్నా అని పిలవబడే ఒక మహనీయుడు కూడా అదే పని చేసేవాడు.

జలగంలోని నసీరాబాద్ ల మీరారాం, కాశీబాయి (సావిత్రీబాయి) దంపతులకు జన్మించాడు జిప్రు అన్నా.

దాదాపు 14 ఏండ్లు నేత పని చేశాడు. ఎంతో చక్కని పేరు తెచ్చుకున్నాడు ఆ వృత్తిలో.

సంత్ కళ్యాణదాసు అనే సత్పురుషుడు జిప్రుకు దీక్ష ఇచ్చాడు.

ఆధ్యాత్మికత ఆయనను ఆవహించింది. ఇంటిని వదిలివేశారు. ఇంటినేమిటి వస్త్రాలను కూడా వదిలేశాడు. ఆ దిగంబరికి నివాసం అంటూ ఏది లేదు.

అయన విశ్వాన్ని ప్రేమించే వారు. విశ్వం ఆయనను కప్రేమించేది.

ఆయనను పిచ్చివాడుగా గాక సత్పురుషునిగా ఎందరో ఆరాధించారు, అయన వద్ద దీక్షను తీసుకుందామనుకున్నారు కూడా – అందులో ఒకరు సాయి భక్తుడు శ్రీ బీ.వి. నరసింహస్వామి.

జిప్రు అన్నా వద్దకు నరసింహస్వామి వెళ్లాడు.

జిప్రు ఒక పెద్ద పెంటకుప్పపై కూర్చున్నారు కానీ, ఆయన శరీరం నుండి ఎటువంటి దుర్గంధం రావటం లేదు.

“నేను నీ గురువును కాను” అన్నాడు జిప్రు నరసింహస్వామితో.

“నాకు తల నొప్పిగా ఉంది” అన్నారు స్వామి. స్వామిని తన తొడపై కూర్చుండబెట్టుకుని స్వామి తలను నాకారు. చూచే వారికి, వినే వారికి జుగుప్స కలిగిస్తుందాచార్య. స్వామిగారి తలనొప్పి మాయమైంది.

ఆయన దేహాన్ని విడిచిన తీరే విచిత్రంగా ఉంటుంది.

ఒక గృహస్తు ఇంటి తలుపు తట్టి లోపలకు వెళ్లారు. ఆ ఇంటిలోని వారంతా ఆయన రాకకు సంబరపడ్డారు.

తలంటుకున్నాడు జిప్రు. భోజనం తయారు చేసింది గృహిణి. తృప్తిగా తిన్నాడు. “జిప్రు వెళ్లిపోతున్నాడు, ఇక బాధపడండి” అని కళ్లు మూసుకున్నారు. అనంతంలో లీనమయ్యారు.

ఆయనకు హిందువులు, ముస్లింలు భక్తులే.

నసీరాబాద్ లోని ఆయన సమాధిని వేలాది మంది దర్శిస్తుంటారు.

డిసెంబర్ 12 (1877)న ఆయన జయంతి.

ఆయనను స్మరిద్దాం – ఆయన స్మరణతోపాటు అంతరంగాన్ని పరిశుద్ధంగా ఉంచుకొందాం.

అదే ఆయన కోరేది.

Written by: Mullapudi Panduranga Sainath &  Munnaloori Bose.

Collected and Presented By: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles