Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Voice Support By: Mrs. Jeevani
షిరిడీ ప్రవేశమే సర్వ దుఃఖ పరిహారం అని తెలిసిన వారందరూ షిరిడీకి వెళ్ళి సాయి దర్శనాన్ని చేసుకోవాలని తహ, తహలాడుతారు.
మన కోరిక సాయి ముందు ఏ మాత్రం చెల్లదు. సాయి అనుమతి అయితేనే షిరిడీకి చేరేది, అప్పుడే సాయి దర్శనం కలుగుతుంది.
కుశాల్ చంద్ సాయిబాబాను దర్శిద్దామనుకున్నాడు. అయితే ప్రయాణానికి టాంగా లేదు. నిరాశపడ్డాడు.
ఆ నిరాశ షిరిడీలో ఉన్న సాయికి తెలిసింది. దీక్షిత్ తో బాబా కుశాల్ చంద్ కు గుర్రంబండిని పంపాడు. కుశాల్ చంద్ షిరిడీకి వచ్చి సాయిని దర్శించుకున్నాడు.
రామచంద్ర విఠోబా విద్యార్థి బాబా భక్తుడు. బాపు సాహెబ్ షిరిస్తే కుమారుడు, తన స్నేహితుడు దత్తు షిరిడీ వెళ్ళి సాయిని దర్శించు కుందామనుకున్నారు.
రామచంద్ర విఠోబా కూడా వారితోపాటు వెళదాముకున్నాడు. తన దగ్గర డబ్బులు లేవు. తల్లి వేరే గ్రామంలో ఉంది.
ప్రయాణానికి ఇంకా రెండు రోజుల సమయమే ఉంది. తల్లి ఇంటికి వచ్చింది. విఠోబా తన కోర్కెను తల్లికి చెప్పాడు. ఆమె డబ్బులిచ్చింది. సంతోషంతో సాయిని దర్శించాడు.
గణపత్ దోండ్ కదం కుటుంబంతో షిరిడీకి రైలులో బయలుదేరాడు. ఆ పెట్టెలో ఇంకెవ్వరూ లేరు.
కదులుతున్న రైలులోనికి బిల్లులు (దోపిడీ దొంగలు) చొరబడ్డారు. వారు దోపిడీకి వచ్చారని దొండ్ కు తెలియదు. అంతవరకూ ఆ పెట్టెలో లేని ఒక వృద్ధుడు ఆ బిల్లులను బెదిరించి తరిమివేశాడు.
బోరీబందరు నుండి ఒక లాయర్ షిరిడీకి వెళ్ళి సాయిని దర్శిద్దామనుకున్నాడు. రైలు ఎక్కాడు. టికెట్టు కలెక్టర్ టికెట్ అడిగాడు. అది కనబడలేదు. ఆయనను రైలు నుండి దించివేయటానికి సిద్దమయ్యాడు.
అక్కడే ఉన్న ఒక అపరిచిత వ్యక్తి తాను షిరిడీ యాత్ర చేస్తున్నానని, మిత్రునికి కూడా టిక్కెట్టు కొన్నానని కానీ కొన్ని అవాంతరాల వాళ్ళ అతను రాలేదని ఆ టికెట్టును లాయరుకు ఇచ్చాడు. షిరిడీ యాత్రకు భంగం కలగలేదు.
12 డిసెంబరు 1910 న రావ్ బహదూర్ రాజారామ్ పంత్ దీక్షిత్ నాగపూర్ నుండి పని మీద వేరే ఊరికి బయలు దేరాడు.
కానీ మార్గమధ్యంలో మనసు మార్చుకుని వెంటనే షిరిడీకి వెళ్ళాలని అనుకుని మరుక్షణం షిరిడీకి ప్రయాణమయ్యాడు. సాయిని దర్శించుకున్నాడు అతి సంతసమున.
షిరిడీలో “నిన్ను చూడనీ” అని సాయిని వేడుకుందాం. మిగిలినవన్నీ అయన ఏర్పాటు చేస్తాడు – ఆయనకు అంగీకరమైతే.
Compiled By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరిబోస్
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- నమ్మినవారు నవ్వులపాలు కారు! …..సాయి@366 మే 15….Audio
- సాయిని పస్తులుంచిన డాక్టరు! …..సాయి@366 ఏప్రిల్ 28….Audio
- నిన్ను నిన్నుగా ప్రేమించుటకు…..సాయి@366 జనవరి 3….Audio
- అది మాత్రం అడగకూడదు …..సాయి@366 డిసెంబర్ 30….Audio
- రాత్రి నిద్రించని సాయి…..సాయి@366 డిసెంబర్ 21….Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments