Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Voice Support By: Mrs. Jeevani
సాయిబాబా వద్దకు సామాన్య ప్రజానీకమే కాక, పేరుపొందిన ప్రముఖులు కూడా దర్శనానికి వచ్చేవారు.
ఆయనకు తెలియకుండా ఎవరు షిరిడీలో కాలుమోపలేరు గదా! కొన్ని కొన్ని సందర్భాలలో తన వద్దకు వచ్చేవారిని గూర్చి సాయి ముందుగానే తెలిపేవారు.
“నా దర్బారు జనులు వస్తున్నారు” అన్నారు సాయిబాబా తన వద్దకు రాబోతున్న దురంధర్ సోదరులను గురించి.
కర్టిన్ దంపతులు వస్తున్నప్పుడు సూచించారు సాయి, తిలక్ వచ్చేటప్పుడు కూడా అంతే.
ఒకసారి నానా సాహెబ్ 1906 లో క్రిస్మస్ సెలవులయిపోతున్నాయి, సాయిబాబాను అనుమతి అడిగారు షిరిడీ విడచి వెళ్ళటానికి.
“రేపు పొదువుగానిలే” అన్నాడు సాయి. నానా ఆ రోజు ఉండిపోయాడు షిరిడీలో, తెల్లవారింది.
సాయి దగ్గరకు వెళ్ళి మరల అనుమతిని అడగగా “ఎక్కడికి పోతావు? నీ లావుపాటి స్నేహితుడు వస్తున్నాడు” అన్నారు బాబా.
నానా ఆలోచనలలోపడ్డాడు. లావుపాటి స్నేహితుడు ఎవరా అని, కొంచెం సమయం గడిచింది.
చిన్ననాటి నుండి స్నేహితుడు అయిన చింతామణి వినాయక్ వైద్య సాయి దర్శనం కోసం వచ్చాడు షిరిడీకి.
వైద్య వస్తాడని నానాకు, నానా అక్కడే ఉంటాడని వైద్యకు తెలియదు. అందుకే ఇద్దరూ ఆశ్చర్యపోయారు ఒకరిని చూసి వేరొకరు.
చింతామణి వినాయక్ వైద్య ప్రసిద్ధ మరాఠీ వాజ్ఞయకారుడు, దేశ భక్తుడు, తిలక్ అనుచరుడు.
1909 డిసెంబరు 26 నుండి 29 వరకు కలకత్తాలో జరిగిన కాంగ్రెస్ మహాసభకు హాజరయ్యాడు.
అక్కడ నుండి బయలుదేరి, దారిలో ఉన్న షిరిడీ సాయిని దర్శిద్దామని షిరిడీకి వచ్చాడు.
ఆ స్నేహితులు ఇద్దరూ ఎంతగానో సంతోషించారు. నానాకు అంతకు ముందు రోజే అనుమతి ఇస్తే, వెళ్ళిపోయేవాడు.
కొద్దీ నిమిషాల ముందు అనుమతిని ఇచ్చినా నానా వెళ్ళిపోయేవాడు. మరల ఆ ఇద్దరు స్నేహితులు కలిసేది ఎప్పుడో! ఇదంతా సాయికి తెలుసు.
అందుకే నానాను అక్కడే ఉంచి, ఆశ్చర్యానందాలు కలిగించాడు ఆ స్నేహితులకు.
ఎవరు, ఎప్పుడు, ఎక్కడ కలవలో సాయి ముందుగానే నిర్ణయిస్తాడు. అంతా ఆయన ప్రణాళిక ప్రకారమే జరుగుతుంది.
సాయి ఎవరి కోరికనయినా తీర్చకుండా ఉంటె కారణం ఎదో ఉంటుంది. అది మాత్రం సాయి బయటకు చెప్పడు!
Compiled By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరిబోస్
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- సాయి ‘పిచ్చుక’ నానా …..సాయి@366 ఆగస్టు 21….Audio
- హనుమంతుని ముందరా?…..సాయి@366 సెప్టెంబర్ 26….Audio
- సలహా…..సాయి@366 ఏప్రిల్ 22….Audio
- అది నేనే…! …..సాయి@366 డిసెంబర్ 3….Audio
- మనసెరిగిన వాడు మా దేవుడు…..సాయి@366 ఆగస్టు 22….Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments