నేనున్నాను …..సాయి@366 డిసెంబర్ 31…Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba



Voice Support By: Mrs. Jeevani


సాయి మహా సమాధికి పూర్వం

సాయిబాబాను  దర్శించి తిరిగి వెళుతున్న ఒక కొంకణదేశ భక్తునితో సాయి “రైలులో నీ దగ్గర కూర్చోవటానికి జానెడు స్థలం అడిగిన వ్యక్తికి ఈ ఊదీ పొట్లం ఇవ్వు” అని ఊదీ పొట్లాన్ని ఇచ్చారు.

“అలా ఎవరూ రాకపోతే, ఆ సంగతి మీకు ఉత్తరంలో రాస్తాను” అని ఆ కొంకణ దేశస్థుడు ఊదీ పొట్లాన్ని తీసుకుని బయలుదేరాడు.

రైలెక్కాడు. తాను దిగవలసిన స్టేషన్ వచ్చే స్టేషన్. ఎవ్వరూ ఇక రారని సాయికి ఉత్తరం రాయబోతుంటే ఒక వ్యక్తి ఆదరాబాదరాగా రైలు ఎక్కి తనకు ఆరోగ్యం బాగోలేదని, కూర్చోవటానికి ఒక జానెడు స్థలం ఇమ్మని అడిగాడు.

కొంకణ భక్తుడు జానెడు స్థలమే కాకుండా బాబా ఇచ్చిన విభూతి పోట్లాము   కూడా ఇచ్చి తనను జానెడు స్థలం అడిగిన వ్యక్తికి ఇమ్మని బాబా చెప్పారన్నారు.

అన్ని స్టేషనులు అయిపోయాయని, చివరి స్టేషన్ లో కూడా ఎవరూ ఎక్కకుంటే, ఉత్తరం రాయబోతున్నానని, ఎదుకంటే వచ్చే స్టేషన్ లోనే తాను దిగేది అన్నాడు.

ఊదీ పొట్లం తీసుకున్న వ్యక్తి పేరు జోషి, కళ్ళనుండి ఆనంద భాష్పాలు కారుతుండగా ఊదీ పొట్లము     తీసుకుని తాను ఎంత ప్రయత్నించినా షిరిడీకి వెళ్ళలేకపోయాననే చింతలో ఉన్నానని, సాయి తనపై ఆచూపిన వాత్సల్యానికి కొలత లేదని ఆనందంతో చెప్పాడు.  భక్తి చాలును సాయికి.

మహా సమాధి అనంతరం.

31  డిసెంబరు, 1951 న ప్రమాదం కారణంగా గాయంతో ఆసుపత్రిలో ఉన్నాడు శ్రీపాద కృష్ణ దేవ్.

అతడు ఎవరో కాదు శ్రీ బాల కృష్ణ విశ్వనాధ్ దేవ్ కుమారుడే. ఆ తండ్రీ తనయులిరువురు  సాయి అంకిత భక్తులే.

ఒకరిని మించిన వారు మరొకరు సాయి భక్తిలో. శ్రీ పాదను ఎందరో సాయి భక్తులు, స్నేహితులు ఆసుపత్రికి వచ్చి పరామర్శించసాగారు.

శాంతారాం అనే స్నేహితునితో శ్రీపాద “1905 లో సాయిబాబా ఊదీ పంపిన నానా సాహెబ్ కుమార్తె అంత అదృష్టవంతుడినైతే ఎంత బాగుండును?” అన్నాడు.

“మీ నాన్న, నీవు సాయి భక్తులే, బాబా నీకోసం ఊదీ ఎందుకు పంపడు?” అన్నాడు శాంతారాం.

మరునాడు శంకరరావు అనే వ్యక్తి వచ్చి “నేను నిన్న షిరిడీలో మన స్నేహితుడు విఠలరావుకు నీకు జరిగిన ప్రమాదం గురించి చెప్పగానే అతను ఊదీ ఇచ్చి నీకు ఇవ్వమన్నాడు” అని ఊదీని ఇచ్చాడు.

సాయి అప్పటికి 33  ఏండ్ల క్రిందట సమాధి చెందినా భక్తులను ఎల్లప్పుడూ ఎప్పటికి “నేనున్నాను” అంటూనే ఉంటాడు సాయి.

నమామీశ్వరం సద్గురం సాయినాథం

Compiled  By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరిబోస్

Collected and Presented By: Mr: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles