భోళా సాయి! …..సాయి@366 మే 31…Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba



Voice Support By: Mrs. Jeevani


గతంలో సాయిబాబా పేరు వినని వారు, సాయి భక్తులుగా మారటం సాయి సాహిత్యంలో గమనించదగిన అంశం.

శ్రీ జగదీశ్‌ మున్షీ బొంబాయిలో అడ్వకేటు. ఘనత వహించిన శ్రీ కే.యం. మున్షీ కుమారుడు.

జగదీశ్‌ మున్షీ, ఆయన కుటుంబంతో ఒకసారి ప్రయాణం చేస్తుంటే (1948)లో రజాకర్లు ఆయన ప్రయాణం చేస్తున్న రైలును సర్వనాశనం చేయటం,

తాము ఉన్న పెట్టె మాత్రం సురక్షితంగా ఉండటం, కేవలం సాయినాథుని కృప అని గ్రహించాడు.

అంతమాత్రాన ఆయన సాయి భక్తుడు కాలేదు.

1953లో కుటుంబంలోని కలతల వలన, ఆ కలతలను సాయి బాబా తొలగించగలడని, సాయిబాబా ఫోటోను తెచ్చి పూజించసాగాడు.

ఆయన ఆర్తిని, నమ్మకమును సాయి గమనించాడు. చిక్కులు తొలగినవి. సాయిబాబా భక్తుడైనాడు.

జగదీశ్‌ మున్షీ. కాకతాళీయంగా చిక్కులు తొలగినవేమో అని శంకించుట మానలేదు ఆయన. ఇంకో రెండేండ్లు గడిచాయి. ఆయనలో ఏ మార్పు రాలేదు.

మే నెలలో ఒకనాడు ఆయన సూరత్‌ నుండి బొంబాయికి రైలులో బయలుదేరాడు మొదటి తరగతిలో. రైలు ప్రయాణిస్తోంది.

జగదీశ్‌ ఉదరంలోని రాళ్ళు ఆయనను బాధపెట్టసాగాయి. నిలబడలేక, పరుండలేకపోయాడు. ఏమి చేయాలో అర్థంకాని అయోమయంలో ఉన్నాడు.

అర్ధరాత్రి సమయానికి నెప్పి ఎక్కువైంది. మూత్రముతోపాటుగా రక్తం కూడా వస్తోంది. తట్టుకోలేక, ప్రక్కనే నిద్రిస్తున్న తోటి ప్రయాణికుడిని లేపి తన పరిస్థితి చెప్పి, గార్డును తీసుకు రమ్మన్నాడు.

గార్డు రైలులో ఎవరైనా డాక్టరు ఉన్నాడేమో అని ప్రయత్నించాడు. ఎవరూ లేరు.

వచ్చే పాల్ ఘర్ స్టేషన్‌లో దిగి, అక్కడ ఉండే డాక్టర్లచే చికిత్స పొందమన్నాడు. జగదీశ్‌ దిగాడు. స్టేషన్‌లో డాక్టరు లేడు. జగదీశ్‌ బాధతో మెలికలు తిరిగిపోసాగాడు.

డాక్టరుకు కబురు పంపితే రానన్నాడు. కారు లాంటి ప్రయాణ సాధనం లేదు. చివరకు ఒంటెద్దు బండిలో డాక్టరు వద్దకు బయలుదేరాడు.

దారిలో ఇక ఎవ్వరూ ఏమీ చేయలేరని గ్రహించి బాబాను ప్రార్ధించాడు జగదీశ్‌. అదృష్టం బాగుంది. డాక్టరు ఇంట్లో ఉన్నాడు. చికిత్స చేశాడు. జగదీశ్‌ కోలుకున్నాడు.

తనను శరణంటే చాలు, సాయిబాబా తనను నమ్మిన వారిని, నమ్మని వారిని కూడా కాపాడతాడు – భోళా శంకరుని వలె. సాయి భోళా సాయిబాబా.

Compiled  By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరి బోస్

Collected and Presented By: Mr: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles