Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Voice Support By: Mrs. Jeevani
సాయి సచ్చరిత్ర పారాయణంతోనే సాయి సాహిత్యం సంపూర్ణం కాదు.
సాయిపై భక్తి భావాన్నిఅంకురింప చేయాలని, విస్తరింప చేయాలని, ఏకత్వాన్ని గ్రహించాలని అనేక ప్రక్రియలు ముందుకు వచ్చాయి.
అందులో ఒకటి ‘సాయి లీల’ పత్రిక. ఇది అనేక విధాలుగా సాయి భక్తిని పెంపొందింప చేసింది.
అలనాటి నుండి ఎందారో సంపాదాకులు ఆ పత్రికను నడిపారు.
అయితే మరాఠీ వారికే గాక ఇతరులకు అంటే ఆంగ్లము వచ్చిన వారి కోసం కూడా ఆ పత్రికను ప్రత్యేకంగా నడిపించి విశ్వ విఖ్యాతిని తెచ్చిన సంపాదాకుడు శ్రీ డి.డి. పరుచూరి.
ఏప్రిల్ 1973 నుండి ఆంగ్ల, హిందీ సాయి లీలను ప్రచురించారు ఆయన విశేష శీర్షికలతో.
వృత్తి రీత్యా ఆయన గణిత శాస్త్రంలో ఆచార్యుడు. ప్రవృత్తి రీత్యా ఆధ్యాత్మికుడు, సాయి భక్తుడు.
అనేక భజన గీతాలను సాయిపై వ్రాసి విఖ్యాతుడైనాడు.
వయసు వచ్చిన వారికి, వయోవృద్దులకు మాత్రమే కాదు, చిన్న పిల్లలు సైతం సాయి లీలా మహత్యాన్ని గ్రహించి ముగ్ధులవ్వాలని ఆయన తన మాతృ భాషలో రచించటమే కాక, ఆంగ్లములో ”చిల్డ్రన్స్ సాయిబాబా” రచించారు.
ఇది అనేక భాషలలో (తెలుగులో సైతం)నికి అనువాదామైంది. సాయిబాబాను ఈయన తనదైన అరుదైన కోణం నుండి చూపారు.
ఉదాహరణ:
”రామదాసు, మార్క్సుల బోధాలు శివాజీ, లెనిన్‌లను ప్రభావితం చేశాయి. తద్వారా ప్రజల జీవిత విధానాల్లో ఎన్నో మార్పులు వచ్చాయి.
ఒక విధంగా బాబా కూడా ప్రజలలో చైతన్యం తెచ్చిన వారే. ఎన్నో పూర్వపు తత్వాల సజీవరూపంగా బాబా అవతరించారు. అంటే తమ జీవితం ద్వారా కొన్ని ధర్మాలకు ఆయన దారి చూపారు”.
ఎవరికి వారు తమ ఆలోచనలను అటువైపు మళ్ళించి సాయి తత్వ బోధాను మరింత విస్తృతం చేతురు గాక.
సాయిబాబా ఎన్నడూ ఎవరికి బోధింప ప్రయత్నించ లేదు. నీతులు, నియమాలు చెప్ప లేదు.
వేల పుస్తకాల్లోని తత్వం కన్నా బాబా జీవిత విధానం ఎందారెందారినో ప్రభావితం చేసిందని చెప్పవచ్చునని పరుచూరి గారి అభిప్రాయం.
ఆయన జూన్ 1, 1973న సాయిలో ఐక్యం అయ్యారు.
ఆ సంపాదాకునికి వందానాలు!
Compiled By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరి బోస్
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- (అ)ద్వితీయ సాయీ పత్రిక …..సాయి@366 మార్చి 18….Audio
- గృహమే సాయి మందిరం!…..సాయి@366 జూన్ 22….Audio
- మోక్ష గురువు …..సాయి@366 జూన్ 9…Audio
- సాయి ఎల్లరకు ప్రభువే!…..సాయి@366 నవంబర్ 29….Audio
- దుర్గుణానికి నీళ్ళు వదలటం…… సాయి @ 366 ఫిబ్రవరి 1….Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments