Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Voice Support By: Mrs. Jeevani
సాయిబాబాను దర్శించిన వారిలో ఎక్కువమంది హిందువులున్నారు. తరువాత మహమ్మదీయులు వస్తారు.
ఇతర మతస్థులు కూడా అనేకులున్నారు. అయితే కొందరిని సంఘటనలు మాత్రమే లభ్యమవుతున్నాయి.
సాయి మహా సమాధి చెందిన తరువాత కూడా అనేక మంది క్రిస్టియన్లు బాబాను నమ్ముతున్నారు. ఇక్కడ గమనించవలసిన విషయం ఒకటి.
క్రిస్టియన్లు వారి మతంలో ఉండి, సాయిపై నమ్మకాన్ని పెంచుకున్నారు. ఏ మతంలోనైనా నమ్మకం ప్రధానం. క్రిస్టియన్లలో అనేకులు వివిధ భక్తి మార్గాలను అనుసరించారు.
సాయి శరణానంద బొంబాయిలో గిర్గాంలో ఉన్న ఠక్కర్ హాస్పిటలో పనిచేసే ఒక నర్సును గూర్చి తెలిపారు. ఆమెకు పరిశుద్ధాత్మ, సాయి బాబాల ఏకత్వం గూర్చి అవగాహన అయింది.
ఆమెకు షిరిడీకి వెళ్ళి సాయి మహా సమాధిని దర్శించాలని కోరిక కలిగింది, ఆ కోరిక ఉధృతమైంది. సెలవు పెట్టింది. అయితే ఆ సెలవు మంజూరు కాకుండా ఆమె కదలలేదు. అది ఆమె పరిస్థితి.
ఆమె పై అధికారి ఆమె సెలవును మంజూరు చేయలేదు. అందుకని ఆమె ఆయనను (అధికారిని) తప్పుపట్టలేదు. ఆమె సాయి నామాన్ని నిరంతరం జపించసాగింది. నామ స్మరణ ఆమె ఎన్నుకొనిన బాట.
కొద్ది కాలము ఆమె సాయి నామ స్మరణ చేయగా, ఆ అధికారి మనసు మారి, సెలవును మంజూరు చేసినాడు. ఒక అన్య మతస్థురాలు వేరొక మతంలోని నామాన్ని స్మరణ చేయటం నిషిద్ధం కాదు.
బెంగళారులోని సాయి పాదానంద గారు సూచన ఇస్తే, ఒక క్రిస్టియన్ నర్సు విష్ణు సహస్ర నామ పారాయణ చేసింది.
మెథడిస్టు స్కూలులో మీరాబాయి సత్యవీర ఉపాధ్యాయురాలిగా పని చేస్తోంది. ఆమె సాయి శరణానందుని, ”శ్రీ సాయిబాబాను” పారాయణ చేసేది. అలా ఆమె చేయటం వలన అనేక కష్టాల నుండి బయటపడ్డది.
ఆమె నవంబరు 29, 1950న సాయి శరణానందుల వారికి లేఖ వ్రాసి అందులో అప్పుడు ఆమె పోగొట్టుకున్న వంద రూపాయల విలువ గలిగిన రిస్టువాచీ దొరికిందని తెలిపింది.
ఇంకా అనేక విషయాలలో సాయి సహాయం అడుగగా అభిస్తోందని కూడా వ్రాశారు.
సాయి ఎల్లరకూ ప్రభువే!
Compiled By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరిబోస్
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- పాఠకుడాయె – సంపాదకుడు …..సాయి@366 జనవరి 8…..Audio
- శివమ్మతాయి…..సాయి@366 మే 29….Audio
- ఇంటింటికి సాయి పత్రిక…..సాయి@366 జూన్ 1….Audio
- ప్రధమ చిత్ర సాహిత్య ప్రదర్శన…..సాయి@366 నవంబర్ 9….Audio
- “సాయి సచ్చరిత్ర” జయంతి…..సాయి@366 నవంబర్ 26….Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments